Guppedantha Manasu: గుండెను పిండేసే రిషి జగతి ఎమోషనల్ సీన్.. దేవయానికి వసుధార చురకలు

కిడ్నాపర్ల నుంచి బయటపడి ఇంటికి వస్తారు వసుధార, రిషి. వసుధార కాలికి గాయం కావడంతో జగతికి చెప్పి కట్టు కట్టమని చెబుతాడు రిషి. గదిలోకి తీసుకెళ్లి వసుధారకు జగతి కట్టుకడుతుంది. లేట్ అయినందుకు అరిచిన దేవయానికి సర్ది చెప్పి లోపలికి పంపిస్తాడు. కిడ్నాప్ గురించి జరిగింది అంతా మహేంద్ర, ఫణీంద్రలతో చెబుతాడు రిషి. ఇప్పుడైన మనం యాక్షన్ తీసుకోకపోతే.. వాళ్ల అక్రమాలు పెరిగిపోతాయి కదా అని మహేంద్ర ఫణీంద్ర అంటారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 13 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 737లో ఇంకా ఏం జరిగిందంటే?

సరైనా పాఠం చెబుతుంది:డీబీఎస్టీ కాలేజీ జోలికి రావొద్దు. పోలీస్ శాఖ సహకారంతో 24 గంటల్లో మిమ్మల్ని పట్టుకుని బహిరంగంగా బయటపెడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీ కాలేజీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి. అందుకే మీ మేలు కోరి చెబుతున్నాం. మా కాలేజీ మీదున్న ద్వేశాన్ని తుడిచి పెట్టండి. మీ పని ఏదో మీరు చూసుకోండి. ఇంత చెప్పాక మీరు వక్రబుద్ధి చూపిస్తే.. కాలేజీ యాజమాన్యం సరైన పాఠం చెబుతుంది అని ఇలా ఒక ప్రెస్ నోట్ అన్ని పత్రికల్లో వచ్చేలా చేయండి డాడ్ అని రిషి అంటాడు. సరే అని మహేంద్ర అంటాడు. మంచి నిర్ణయం తీసుకున్నావ్ అని ఫణీంద్ర చెబుతాడు. తర్వాత వసుధార కుంటుకుంటూ వంట గదిలోకి వెళ్తుంది. మీరు బయట తిన్నారుగా అని ధరణి అడుగుతుంది.

Guppedantha Manasu Serial April 14 2023 Today Full Episode 737

జగతికి రిషి థ్యాంక్స్:లేదు మేడమ్. మొత్తం గొడవలోనే సరిపోయింది అని వసుధార చెబుతుంది. బయటకు వెళ్లారు కదా. ఏదైనా రెస్టారెంట్ లో తిన్నారేమో అనుకున్నా. గిన్నెలు కూడా క్లీన్ చేసేశా. భోజనం ఏం లేదు వసుధార అని ధరణి అంటే పర్లేదు మేడమ్. ఆపిల్స్ ఉన్నాయి కదా. కనీసం అవైనా రిషి సార్ తింటారు అని వసుధార అంటుంది. రిషి అంటే ఎంత ప్రేమ నీకు అని ధరణి అంటే.. ప్రేమ ఒక్కటే కాదు ఇష్టం అభిమానం. రిషి సార్ నా ప్రాణం. నాకన్నా నాకు తనే ఎక్కువ అంటూ చెబుతుంది వసుధార. వాటర్ కోసం వచ్చిన రిషి ఆ మాటలు వింటాడు. వెంటనే వెనక్కి వెళ్లిపోతుంటాడు రిషి. అది చూసిన జగతి వాటర్ కావాలా. నేను ధరణితో పంపిస్తాను అంటుంది జగతి. మేడమ్ మీకో విషయం చెప్పాలి. మీ శిష్యురాలిని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడమ్ అని రిషి అంటాడు.

అది నా దురదృష్టం:ప్రేమ అంటే స్వచ్ఛమైనది. రెండు మనసులు కలిసి చేసే ప్రయాణం. ఆ ప్రేమ కోసం ఎంతమందినైనా ఎదిరించాలి. ఎన్ని కష్టాలైన భరించాలి. చాలా బాగా నేర్పిచారు మీ శిష్యురాలికి. మీరు పుస్తకాల్లో ఉండే పాఠాలతోపాటు జీవితానికి అవసరమయ్యే పాఠాలను కూడా చెప్పి వాటికి కట్టుబడి ఉండేలా చేశారు. వసుధార విషయంలో మిమ్మల్ని మెచ్చుకున్నా నా విషయంలో మాత్రం ఆ కొరత అలానే ఉండిపోయింది. ప్రేమకు ఇంత విలువ ఇచ్చే మీరు.. ఇంత స్వచ్ఛంగా ప్రేమించే మీరు మన బంధానికి ఎందుకు దూరంగా వెళ్లిపోయారని అడగాలని ఉంది. కానీ అడగను. ఎందుకంటే మీ ప్రేమని పొందే అదృష్టం నాకు లేదు. అది నా దురదృష్టం అని రిషి చాలా ఎమోషనల్ గా అంటాడు. దీంతో జగతి బాధ ఒక్కసారిగా ముంచుకొస్తుంది.

Guppedantha Manasu Serial April 14 2023 Today Full Episode 737

నాకు ఏం వినాలని లేదు:రిషి మన మధ్య దూరానికి కారణం నీకు చెప్పాలని చాలా ప్రయత్నించాను. కానీ నువ్వు వినే పరిస్థితిల్లో లేవు. విన్నా కూడా అర్థం చేసుకోవు అని జగతి ఆవెదనగా చెబుతుంది. అంటే ఏంటీ మేడమ్.. అపార్థాలు ఎప్పటికీ అర్థం కానీ నిజాలుగా ఉండిపోతాయని నిర్ణయించారా అని రిషి అంటే జగతి మనసు ముక్కలు అవుతుంది. అయినా పొగొట్టుకున్న క్షణాలు తిరిగి వస్తాయా మేడమ్. చెప్పాల్సిన టైమ్ మీకు దాటి పోయింది. అడగాల్సిన వయసు నాకు దాటిపోయింది. మీ కారణాలు మీకుంటాయి. నా ఆలోచనలు నాకుంటాయి. మన బంధం విషయంలో మీ ఆశలు మీవి. ఏ ఆశలేని వాడిని నేను. ఎందుకంటే అమ్మతో అనుబంధం పెనవేసుకునే వయసును నేను దాటేశాను మేడమ్ అంటూ మెట్లు ఎక్కబోతాడు రిషి. దీంతో రిషి అని చాలా ఎమోషనల్ గా పిలుస్తుంది జగతి. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా. నాకు ఏం వినాలని లేదు మేడమ్ అని పైకి వెళ్తుంటాడు రిషి.

జాలి పడతావేమో..:రిషి ప్లీజ్ ఒకే ఒక్క మాట అని చాలా ఆవేదనతో జగతి అంటుంది. రిషి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు జగతీ చూపులు కంటతడి పెట్టించేలా ఉంటాయి. నువ్వే కాదు రిషి నేను పోగొట్టుకున్న దాన్నే. కన్నబిడ్డ చేత నోరారా అమ్మా అని పిలిపించుకోలేని తల్లిని నేను. నీకు అమ్మ ఒక్కరే దూరమైంది. కానీ నాకు అందరూ దూరమయ్యారు. కనీసం ఇదైనా నువ్వు తెలుసుకుంటే ఈ అమ్మ మీద జాలి పుడుతుందేమో. ఎప్పుడైనా ఆలోచించాలనిపిస్తే ప్రయత్నించు అని కళ్లనిండా నీళ్లతో జగతి చెబుతుంది. దీంతో రిషి మనసు మెలిపెట్టినట్లు అవుతుంది. రిషి మనం జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండా శత్రువులు ఎక్కువ అవుతున్నారు. కనిపించని శత్రువులు ఉంటారు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఏమో తెలియదు. మనం.. ముఖ్యంగా నువ్వు ఆచి తూచి అడుగులు వెయ్యాలి అని చెప్పి వెళ్లిపోతుంది జగతి.

Guppedantha Manasu Serial April 14 2023 Today Full Episode 737

మీ వల్లే తాళి తెగిందని:తర్వాత జగతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు రిషి. ఇంతలో ధరణి వచ్చి వసుధార నీకోసం ఇవి ఇచ్చిందని ఆపిల్ ముక్కలు ఇస్తుంది. మరోవైపు వసుధార తన గదిలోకి వెళ్తుంటే దేవయాని చూస్తుంది. చాలా సంతోషంగా కనిపిస్తున్నావని దేవయాని అంటే సంతోషించాల్సిన విషయమే కదా మేడమ్ అని వసు అంటుంది. మెడలో తాళి లేకుండా తిరుగుతున్నావ్ అని దేవయాని అంటే.. తొందర్లోనే నా మొగుడు తాళి బొట్టు కట్టబోతున్నాడు. మళ్లీ నేను ఎందుకు కట్టుకోవడం అని వసుధా అంటుంది. జనాలు అడిగితే ఏం చెబుతావ్ అంటే.. మీ వల్లే తాళి తెగిందని చెబుతాను. ఏదో చేయాలని చూశారు. కానీ అది జరగలేదు. ఫణీంద్ర సార్ చూశారు కాబట్టి సరిపోయింది. లేకుంటే మీరు నోరు విప్పి చెప్పేవారా. ఎవరో అడుగుతారని తాళి వేసుకోలేదు. నా ప్రేమను గెలిపించుకోడానికి వేసుకున్నాను అని దేవయానితో వసుధార అన్న మాటలను రిషి వింటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X