Guppedantha Manasu: పద్ధతి మార్చిన రిషి.. వసుధారతో రొమాన్స్.. మినిస్టర్ వార్నింగ్
రిషి గదిలోకి వసుధార కాఫీ పట్టుకుని వస్తుంది. రిషి కనిపించకపోవడంతో సార్ అని పిలుస్తుంది. ఇంతలో తలుపు దగ్గరకు వేసి గడియ పెడతాడు రిషి. అది చూసి కాస్తా కంగారు పడుతూ బిత్తర చూపులు చూస్తుంది వసుధార. వసుధార వైపు రొమాంటిక్ గా చూస్తూ రిషి అడుగులు వేస్తుంటే వసు కంగారు పడుతూ వెనక్కి అడుగులు వేస్తుంది. సార్ కాఫీ అని వసుధార అంటుంది.
అయినా రిషి ముందుకు వచ్చేసరికి కాఫీ సార్.. ఒలికిపోతుంది అంటూ వసుధార వణికిపోతుంది. పోతో పోనివ్వు. మధ్యలో అడ్డుగా ఎందుకు అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 17 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 739లో ఇంకా ఏం జరిగిందంటే?

శుభకార్యాలు చేసుకోరు: వసు చేతిలోని కాఫీ పక్కనే పెడతాడు రిషి. సార్ కాఫీ చల్లారిపోతుంది. వేడిగా తాగితేనే బాగుంటుంది అని వసుధార అంటుంది. జీవితంలో మళ్లీ మళ్లీ కాఫీ దొరుకుతుంది. కానీ ఈ క్షణం దొరకదు కదా అని రొమాంటిక్ గా రిషి అంటాడు. వసుధార ఓవైపు సిగ్గుతో, మరోవైపు భయంతో ఇబ్బందిపడిపోతుంది. అప్పుడు వసుధార ముఖాన్ని తనవైపు చేత్తో తిప్పుకుంటాడు రిషి.
ఈ శూన్యమాసం ఎప్పుడు అయిపోతుందో ఏంటో. మనసు రకారకాలుగా ఆలోచిస్తుంది. దేనికోసమో పరితపిస్తోంది అని రిషి అంటాడు. శూన్యమాసం అంటే ఏంటీ అని రిషి అడిగితే.. ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోరు అని వసుధార చెబుతుంది. ఎప్పుడైపోతుందని రిషి అంటే.. ఏమో సార్ ఒకసారి క్యాలెండర్ లో చూడాలని వసు చెబుతూ దూరం జరుగుతుంది.
అది వేరు-ఇది వేరు: తెలుసుకోవాలి కదా వసుధార. అది మనకు చాలా ముఖ్యం కదా అంటూ మరింత వసు దగ్గరికి వెళ్తాడు రిషి. సార్ ఎవరో వస్తున్నట్లు ఉన్నారు అని వసు అంటే.. వస్తే.. మనకు పెళ్లి జరుగబోతుంది కదా అని రిషి అంటే.. జరగబోతుంది. కానీ జరగలేదు కదా సార్. అప్పటి దాకా మనకు ఇది బాగుండదు అని వసుధార అంటుంది. ఇది అంటే అని రిషి అంటాడు.
ఇలా దగ్గరకు రావడం చేత్తో గడ్డం పట్టుకోవడం అని వసుధార సిగ్గుతో చెబుతుంది. నువ్వే కదా మనం ఇద్దరం ఎప్పుడూ దగ్గరిగా ఉండాలి అన్నది అని రిషి అంటే హా అది వేరు. ఇది వేరు అని వసు అంటుంది. లేదు రెండూ ఒక్కటే అని రిషి అంటాడు. తర్వాత ఇద్దరూ కాఫీని సగం సగం తాగుతారు. ఈ సీన్ లో రిషి కొంటే ప్రశ్నలు, రొమాంటిక్ చూపులు ఆకట్టుకున్నాయి.

బరువెక్కిన మనసు: మరోవైపు జగతీ చాలా సంతోషంగా ఉంటుంది. మహేంద్రతో దేవయాని అక్కయ్య నోరు మూయించాడు రిషి అని చెబుతుంది జగతి. పెళ్లి విషయంలో అక్కయ్య ఎలాంటి ప్రమాదాలు సృష్టిస్తుందో అనుకున్నాను. కానీ రిషి ఒక్క మాటలో మొత్తం అక్కయ్య ఆట కట్టించేశాడు. వసు ఫ్యామిలీ పెళ్లికి వస్తారు అని చెప్పాడు అని జగతి అంటుంది. రిషి, వసుధార పెళ్లి నువ్వు అమ్మగా చూసేంత వరకు అవుతుందేమో.
దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం కాదేమో అని మహేంద్ర బాధగా అంటాడు. వస్తే ఒక అమ్మగా అంతకన్నా ఆనందం ఏముంటుంది. కానీ రిషి ఇవ్వడు. అక్కయ్యదే ఆ అదృష్టం. అయినా పర్వాలేదు. చూసే కళ్ల ఆనందం బరువెక్కిన మనసును సంతోషపెడుతుందిలే అని జగతి అంటుంది. దీంతో జగతి తలను తీసుకుని తన గుండెలకు హత్తుకుంటాడు మహేంద్ర.
పేర్లు చెప్పాలని లేదు: మరోవైపు కాలేజీకి వచ్చిన రిషి, వసుధారకు ఒక లెక్చరర్ ఎదురుపడి సార్ మీపై కుట్ర జరిగిందా. మీరు మేడమ్ నిన్న రాత్రి కిడ్నాప్ అయ్యారా అని అంటాడు. మీకు ఎలా తెలిసింది అని అంటే ఇదిగో సార్ పేపర్ లో వచ్చింది అని పేపర్ ఇస్తాడు. పేపర్ లో డీబీఎస్టీ కాలేజీపై కుట్ర అనే హెడ్ లైన్ తో వార్త ఉంటుంది. తర్వాత ఇద్దరూ మహేంద్ర క్యాబిన్ కు వెళ్తారు.
అప్పుడు రిషికి మినిస్టర్ కాల్ చేస్తాడు. ఈ వార్త ఏంటీ రిషి. ఏం జరిగింది అని మినిస్టర్ అడిగితే.. జరిగింది చెబుతాడు రిషి. ఇదంతా చేసింది ఎవరు. నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను అని మినిస్టర్ అంటాడు. వాళ్ల పేర్లు చెప్పాలని నేను అనుకోవట్లేదు సార్ అని రిషి అంటాడు. అలా అయితే యాక్షన్ ఎలా తీసుకుంటానని మినిస్టర్ అంటాడు.
యూ ఆర్ గ్రేట్: మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దుద సార్ అని రిషి అంటాడు. ఎందుకు అని మినిస్టర్ అంటే.. ఆ విద్యా సంస్థల పేరు బయట పెడితే స్టూడెంట్స్ భవిష్యత్తు తారు మారు అయ్యే అవకాశం ఉంది. నాకు శత్రువుల పరువు తీయడం కంటే స్టూడెంట్స్ భవిష్యత్తు ముఖ్యం. మీరేం టెన్షన్ పడకండి అని రిషి అంటాడు. యూ ఆర్ గ్రేట్ యంగ్ మ్యాన్.
అందుకే నువ్వు అందరికీ నచ్చుతావ్. ఈ విషయంలో నువ్వు ఊరుకున్నా నా స్పందన ఉంటుంది రిషి అని మినిస్టర్ కాల్ కట్ చేస్తాడు. తర్వాత ఇంట్లో రిషి, దేవయాని, జగతి, వసు, ధరణి, ఫణేంద్ర, మహేంద్ర అంతా టీవీ చూస్తుంటారు. టీవీలో మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటాడు.

మినిస్టర్ వార్నింగ్: డీబీఎస్టీ కాలేజీ ఎండీ రిషీంద్ర భూషణ్ చాలా ఉత్తముడు. అతడి జోలికి వచ్చింది మరో తోటి విద్యా సంస్థేనని తెలిసింది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం.. వివరాలు తెలుసుకుని మరి అనుమతులు రద్దు చేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తాడు మినిస్టర్. దాంతో జగతీ, మహేంద్ర అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక శత్రువులు భయపడటం పక్కా అనుకుంటారు.


Click it and Unblock the Notifications











