Guppedantha Manasu: రిషి ముందుకు కనిపించని శత్రువు.. ప్లాన్ బీ ఉచ్చు.. దేవయానికి జగతి చురకలు

డీబీఎస్టీ కాలేజీ ముందు ఓ కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి విలన్ సౌజన్య రావు దిగుతాడు. కాలేజీ బోర్డ్ చూస్తూ ఇది పీకేసి.. ఎమ్ఎస్ఆర్ అని పెడితే ఎంత బాగుంటుంది. ఊహా భలే ఉంది. అదే చేద్దాం అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. రిషి క్యాబిన్ లో కూర్చుంటాడు. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు.

సౌజన్య రావు తన పేరు చెప్పి పరిచయం చేసుకుంటూ అంతా నన్ను ఎమ్ఎస్ఆర్ అని అంటారు. ఎమ్ఎస్ఆర్ ఇన్సిస్ట్యూట్స్ నావే అని చెబుతాడు. హో అవునా మీ గురించి విన్నాను. కూర్చోండి అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 18 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 740లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial April 18 2023 Today Full Episode 740

ఆశయాలు ఒక్కటే: మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మీరు డీబీఎస్టీ పేరు మీద మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయబోతున్నారని నాకు తెలిసింది. నిజంగా మీరు తీసుకుంది గొప్ప నిర్ణయం. రోజుకో వైరస్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో డాక్టర్స్ ను అందించడం సమజానికి చాలా అవసరం. అందుకే నేను కూడా మెడికల్ కాలేజీ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నా.

మనిద్దరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయకూడదు. అంటే మనిద్దరి ఆశయాలు ఒకటే. మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అని సౌజన్య రావు అంటాడు. మీ ఆలోచన బాగుంది సార్.. కానీ నాతోనే ఎందుకు కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అని రిషి అడుగుతాడు.

ఓ మెట్టు పైకి: ఎవరైనా సరే ది బెస్ట్ అయిన వాళ్లతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు. అన్నింటికి మించి మీ గురించి తెలుసుకున్నాకా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను మోస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను అని సౌజన్య రావు అంటే.. అందరూ కాలేజీ విజయానికి నేనే కారణం అంటారు.

కానీ ఈ కాలేజీ పునాది పడినప్పటి నుంచి విజయవంతంగానే రన్ అవుతుంది. దానికి కారణం మా తాత, పెదనాన్న, నాన్నగారు. వాళ్ల తర్వాత నేను దీన్ని చేపట్టి ఓ మెట్టు పైకి తీసుకొచ్చాను అంతే అని రిషి చెబుతాడు. అదే రిషి మీ గొప్పతనం. మీకు నా పలుకుబడి, నా స్థాయి రెండూ మీకు తెలుసు. మనిద్దరం కలిసి వెళ్తే తొందరగా పనులు, పర్మిషన్స్ అన్నీ అవుతాయి. మీరు అనుకున్న మెడికల్ కాలేజీ తొందరగా పూర్తి అవుతుంది అని సౌజన్య రావు అంటాడు.

Guppedantha Manasu Serial April 18 2023 Today Full Episode 740

మీటింగ్ ఏర్పాటు చేయు..: మెడికల్ కాలేజీ పెట్టాలన్నది నా కోరికతోపాటు మా ఇంటి సభ్యులందరి కోరిక. అలాంటి దానికి మీరు సపోర్ట్ ఇస్తానంటున్నారు. దాన్ని కచ్చితంగా మేము స్వాగతిస్తాం. కానీ ఇలా మాటల్లో కాకుండా ఏ విధంగా సహకరిస్తారో. ఎలా ముందుకు వెళ్తారో. టర్మ్స్ అండ్ కండీషన్స్ ఒక పేపర్ మీద ఉంటే బాగుంటుంది అని రిషి అంటాడు.

దానికి ఓకే అని సౌజన్య రావు అంటాడు. దీంతో వసుధారను క్యాబిన్ కు రమ్మని పిలుస్తాడు రిషి. వచ్చిన వసుధారతో సౌజన్య రావును పరిచయం చేసి మెడికల్ కాలేజీకి సపోర్ట్ ఇస్తానంటున్నారు, ఆయన ఫ్రీ టైమ్ చూసి మీటింగ్ ఏర్పాటు చేయమంటాడు రిషి. దీంతో సరే సర్ అని వసుధార సంతోషిస్తుంది.

శత్రువులకే తెలియదు: తర్వాత సౌజన్య రావు బయలుదేరుతూ పేపర్ చూశాను. ఎవరో ఎటాక్ చేశారట. ఏమైంది అని కావాలని అడుగుతాడు. దానికి వసుధార, రిషి ఇబ్బందికరంగా చూస్తారు. దీంతో ఎనీవే జాగ్రత్త రిషి. ఈ ఫీల్టులో శత్రువులు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి అని సౌజన్య రావు అంటే.. శత్రువులకే రిషి సార్ గురించి తెలియదు సార్ అని వసుధార కౌంటర్ ఇస్తుంది.

షాక్ అయిన సౌజన్య రావు నవ్వుతూ గుడ్ గుడ్ అనుకుంటూ వెళ్తాడు. కనిపించని శత్రువులు ఉంటారు రిషి. వాళ్లు ఎవరో తెలుసుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరుగుతుంది అని మనసులో అనుకుంటూ గుండుపై కొట్టుకుంటూ వెళ్లిపోతాడు సౌజన్య రావు. ఇదంతా మెయిన్ విలన్ (శైలేంద్ర భూషణ్) ప్లాన్ బీలో భాగంగా తెలుస్తోంది. మరి రిషి అందులో చిక్కుకుంటాడో లేదో చూడాలి.

Guppedantha Manasu Serial April 18 2023 Today Full Episode 740

నీ గదికి వెళ్లు: ఇంట్లో వసుధార, రిషి చాలా సంతోషంగా ఉంటారు. ఎమ్ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యంతో కలిసి మెడికల్ కాలేజీ పెట్టబోతున్నాం అని సంబరపడిపోతారు. రిషి గొప్పదనం గురించి అంతా పొగుడుతారు. తాతయ్య లాగే నీది చాలా గొప్ప మనసు, ఆయన ఊహలన్నీ నిజం చేస్తున్నావ్ రిషి. నాకు చాలా గర్వంగా ఉందని ఫణీంద్ర పొగుడుతాడు. కట్ చేస్తే తన గదికి రమ్మని వసుధారను పిలుస్తాడు రిషి. వసుధార వెళ్లబోతుంటే దేవయాని అడ్డుకుంటుంది.

ఆడపిల్లవి కొంచెమైనా బుద్ధి లేదా. ఇలా వేళ కానీ వేళల్లో వెళ్లకూడదని తెలియదా. నీ గదికి వెళ్లు అని కోపంగా దేవయాని అంటుంది. అప్పుడే రిషి వచ్చి ఆగు వసుధార అంటాడు. పెద్దమ్మా నేనే తనను పిలిచాను. మేము కొంచెం మాట్లాడుకోవాలి. కాలేజీ విషయాలు చర్చించుకోవాలి అని రిషి అంటాడు. ఇప్పుడా. ఇలా బాగుండదు రిషి. నువ్వు కొంచెం అర్థం చేసుకో అని దేవయాని అంటుంది.

నలుగురు చూస్తే: అప్పుడు జగతి ఎంట్రీ ఇస్తుంది. అందులో తప్పేముందు అక్కయ్యా. వసు ఆడపిల్లే. పద్ధతులు తెలిసిన అమ్మాయి. ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించడు. అది సరే రిషి మీద మీరు అనుమానపడితే మీ పెంపకానని మీరే అవమానించినట్లు. రిషి పెరిగింది మీ దగ్గర తప్పటడుగులు వేయడు అని దేవయానికి జగతి వరుసగా చురకలు వేస్తుంది.

ఇలా వెళ్లడం నలుగురు చూస్తే ఏం అనుకుంటారు అని దేవయాని అంటుంది. ఇక్కడ నలుగురు ఎవరున్నారు అక్కయ్యా. మనమే కదా. బయట వాళ్లు ఎవరూ చూస్తారు. వాళ్లు ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదా అని జగతి అంటుంది. మీ పద్ధతులు మీవే కానీ నా మాట వినరన్నమాట అని దేవయాని అంటుంది.

రగిలిపోయిన దేవయాని: పెద్దమ్మా ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మళ్లీ దీని గురించి భయపడాల్సిన పనిలేదు. వసుధార నాతోరా అని తీసుకుని వెళ్లిపోతాడు రిషి. రగిలిపోతున్న దేవయానితో రిషి ఎవరి మాట వినడని తెలుసు కదా. మరి ఎందుకు వాళ్ల విషయంలో కలుగ జేసుకుంటారు. పదే పదే కంట్రోల్ చేయాలని చూస్తారు. రిషితో పదే పదే ఈ మాటలే చెప్పించుకుంటారు. ఇవన్నీ అవసరమా అక్కయ్యా అని జగతి అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X