Guppedantha Manasu: వసుధార బాధపడేలా సర్‌ప్రైజ్.. శత్రువును లైట్ తీసుకున్న రిషి!

ఎంఎస్ఆర్ కాలేజీలో డీబీఎస్టీ కాలేజీని కలపాలని జగతి, వసుధార ముందు ప్రపోజల్ పెడతాడు సౌజన్య రావు. అది జరగని పని అని జగతి చెప్పడంతో అదెలా జరగదో నేను చూస్తాను అని సౌజన్య రావు అంటాడు. అనంతరం ఇంటికి వచ్చాక జరిగింది అంతా మహేంద్రకు చెబుతారు. ఇదేంటీ జగతి ఇలా జరిగింది. రిషి చాలా బాధపడతాడు. చాలా ఆశలు పెట్టుకున్నాడు.

అయినా సౌజన్య రావు ఇలా మాట్లడటం ఏంటీ అని మహేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 20 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 742లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial April 20 2023 Today Full Episode 742

మహేంద్ర-జగతి టెన్షన్: అదే నాకు అర్థం కావట్లేదు మహేంద్ర. సౌజన్య రావు మాట తీరు చూస్తే ఏదో అనుమానంగా ఉంది. అతడు కచ్చితంగా ఏదో కుట్రతోనే మనతో ప్రపోజల్ దాకా వచ్చాడనిపిస్తోంది అని జగతి అంటుంది. మీరు అన్నది నిజమే మేడమ్.. నాకు అదే అనిపించింది అని వసుధార అంటుంది. మరి ఇప్పుడు ఈ విషయం రిషికి ఎలా చెప్పాలి. చెప్పాక రిషి ఎలా తీసుకుంటాడో అని జగతి బాధగా అంటుంది. నాకు అదే భయంగా ఉంది జగతి. రిషి సంతోషాన్ని నేను కళ్లారా చూశాను.

దాన్ని ఇప్పుడు ముక్కలు చేసినవాళ్లమే అవుతాం అని మహేంద్ర అంటాడు. ఇంతలో రిషి వచ్చి వసుధార అంటాడు. దీంతో మహేంద్ర, జగతి కాస్త టెన్షన్ పడతారు. ఏమైంది అలా ఉన్నారు. వెళ్లిన పని ఏమైంది మేడమ్. అయినా మీరు వెళ్లాక జరగకుండా ఉంటుందా. పూర్తి చేసే వచ్చి ఉంటారు అని రిషి అంటాడు.

తెలివిగా అనుకుంటారు: సరే మేడమ్ నేను వసుధార బయటకు వెళ్లాలనుకుంటున్నాం. వచ్చాక మాట్లాడుకుందాం. పదా వసుధార అని రిషి అంటాడు. వెళ్లిన చోట టైమ్ దొరికితే విషయం చెప్పేసేయ్ అని జగతి చిన్నగా అంటుంది. సరే మేడమ్ అని వసుధార రిషితో వెళ్తుంది. ఇద్దరూ బైక్ పై వెళ్తారు. అది చూసిన దేవయాని రగిలిపోతుంటుంది. కారులో వెళ్తే వేయి కళ్లు చూస్తాయి. ఇలా బైక్స్ మీద తిరగడం ఏంటండి ఈ వసుధార రిషిలు.

పెళ్లి కాకుండా ఇలా బండిమీద తిరిగితే నలుగురు ఏమనుకుంటారండీ అని దేవయాని అరుస్తుంది. ఏ నలుగురు అని ఫణీంద్ర అంటాడు. అలా అంటారేంటండీ.. బయట జనం ఏమనుకుంటారు. మీరంతా తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ మీ మాటలు, ఆ వసుధార వాలకం అస్సలు నచ్చడం లేదండి అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu Serial April 20 2023 Today Full Episode 742

ఇదేనా సార్ సర్‌ప్రైజ్: రిషిని పెంచిన తల్లివే కానీ మరీ కంట్రోల్ చేయాలని ట్రై చేయకు. మొదటకే మోసం వస్తుంది. బయట ఎంతో మారుతోంది. నీ ఆలోచనలు తప్పా అని ధరణీని కాఫీ తీసుకురమ్మని ఫణీంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు మొదటిసారి బైక్ పై వెళ్లింది గుర్తు చేసుకుంటారు రిషి, వసుధార. మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని వసుధార అడుగుతుంది. ఆ జర్నీని ఎంజాయ్ చేయు నీకే తెలుస్తుంది అని రిషి అంటాడు. తర్వాత కాలేజీలోకి తీసుకెళ్తాడు రిషి.

ఇక్కడికీ ఎందుకు అని వసు అంటే సర్‌ప్రైజ్ అంటాడు. తన క్యాబిన్ కు తీసుకెళ్లి కళ్లు మూసుకోమ్మని చెబుతాడు రిషి. వసు అలాగే చేయడంతో ఓ కర్టెన్ ను జరిపి కళ్లు తెరవమంటాడు. ఈ కర్టెన్ వెనుక గోడ మీద డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ అని ఉండటం చూసి వసుధార షాక్ అవుతుంది. ఇదేనా సార్ సర్‌ప్రైజ్ అని బాధగా అంటుంది వసు. అవును. చాలా అద్భుతంగా ఉంది కదా అని సంతోషంగా రిషి అంటాడు.

కన్నీళ్లు ఆపుకుంటూ: కళ్లలో కన్నీళ్లు ఆపుకుంటూ అవును సార్ చాలా బాగుంది అని వసుధార అంటుంది. మరి ఈ రిషీంద్ర భూషణ్ అంటే ఏమనుకున్నావ్. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడు. వసుధార ఇది నా కోరిక. ఇప్పుడు తీరబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని రిషి అంటాడు. వసుధార అదోలా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. దీంతో సౌజన్య రావు ప్రపోజల్ గురించి రిషికి చెప్పడంతో అతను షాక్ అవుతాడు.

ఏంటీ డీబీఎస్టీ కాలేజీని ఎమ్ఎస్ఆర్ కాలేజీలో కలిసిపోవాలా.. నో వే.. నువ్వెందుకు నిరుత్సాహంగా ఉన్నావ్ అని రిషి అంటాడు. మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు కదా సార్. అది మిస్ చేసుకున్నాం కగా అని వసు అంటే.. నేను అలా అనుకోవట్లేదు. సపోర్ట్ చేస్తా అంటే ఓకే అన్నాను. కానీ అతడి మనసులో ఇంత దురుద్దేశం ఉందని మనకు తెలియదు కదా అని రిషి అంటాడు. తర్వాత డీబీఎస్టీ మెడికల్ కాలేజీ తన డ్రీమ్. కానీ టైమ్ పట్టొచ్చు అని రిషి చెబుతాడు. ఇద్దరూ ఇంటికి వెళ్తారు.

Guppedantha Manasu Serial April 20 2023 Today Full Episode 742

జగతి మాటలు విన్న రిషి: ఇంటికి వెళ్లిన వసుధార మహేంద్ర, జగతికి జరిగింది చెబుతుంది. రిషి ఏమైనా బాధ పడ్డాడా అని జగతి అంటే.. బాధ అయితే మనసులో ఉంది కానీ. బయటకు కనిపించలేదు. నాకే తిరిగి ధైర్యం చెప్పారు అని వసు అంటుంది. డీబీఎస్టీ మెడికల్ కాలేజీ అనేది రిషి ఒక్కడి కలే కాదు. మనందరి కోరిక. ఆ కోరిక తీరితే ఎందరో పేద పిల్లల కలలు నెరవేరతాయి అని జగతి అంటుంది. ఇప్పుడు అది చేజారిపోయింది కదా.

ఇప్పుడు మనం ఏం చేయగలం అని మహేంద్ర అంటాడు. చేయ్యాలి మహేంద్ర. ఏదో ఒకటి చేయాలి. మనమే కష్టపడి. రిషి కలను నిజం చేయాలి అని జగతి అంటుంది. రిషి ఆనందంగా ఉంటే ముందుగా సంతోషపడేది మనమే. అందుకు మనం ఏం చేయడానికైన సిద్ధంగా ఉండాలి అని జగతి అంటుంది. ఆ మాటలు గది బయట నుంచి రిషి వింటూ ఉంటాడు.

షర్ట్ బటన్స్ సరిచేస్తూ: జగతి మాటలు విన్న రిషికి తన తల్లి మనసు ఏంటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్లుగా ఉంటుంది ఆ సన్నివేశం. జగతి అలా అంటే.. ఇప్పుడేం చేద్దాం మేడమ్ అని వసుధార అంటే.. అదే ఆలోచిస్తున్నా అని జగతి అంటుంది. రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం జగతి మాటలను రిషి తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే రిషి రూమ్ కి వసుధార వస్తుంది. కాలేజీకి టైమ్ అవుతుంది వెళ్దామా అని వసుధార అంటుంది. ఇంతలో రిషి బటన్స్ సరిగ్గా పెట్టుకోకపోడవం గమనించిన వసుధార అవి సరిచేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X