Guppedantha Manasu: సౌజన్య రావుకి స్ట్రాంగ్ వార్నింగ్.. రిషికి తెలియకుండా జగతి సంతకాలు.. ఉచ్చులో పడినట్లే!
జగతి మాటలు విన్న రిషి మెడమ్ కి నా తరఫున థ్యాంక్స్ చెప్పు అని వసుధారతో అంటాడు. మీరు చెబితే బాగుంటుంది అని వసు అంటే.. నీవ్వు చెబితే నేను చెప్పినట్లే కదా అని రిషి అంటాడు. మేడమ్ కి నేను చెప్పడం కంటే మీరు చెబితే వచ్చే సంతోషం వేరు అని వసుధార అంటుంది. తర్వాత సౌజన్య రావు ప్రపోజల్ గురించి ఆలోచించొద్దు అని వసు అంటే.. ఆయన ప్రపోజల్ తలుచుకుంటేనే నచ్చడం లేదు. ఆయన కాలేజీ కింద మన కాలేజా.. అసలు మన కాలేజీ పేరు పక్కన మరో కాలేజీ పేరు ఉండకూడదు అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 21 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 743లో ఇంకా ఏం జరిగిందంటే?
పనికి మాలిన ప్రపోజల్:రిషికి కాల్ వస్తుంది. ఫోన్ కాల్ మాట్లాడిన రిషి వసుధార మీరు కాలేజీకి వెళ్లండి. నేను కొన్ని లెక్కలు తేల్చుకుని వస్తాను అని రిషి వెళ్తాడు. సీన్ కట్ చేస్తే సౌజన్య రావును రిషి కలుస్తాడు. ఏంటీ సార్ నా ప్రపోజల్ గురించి ఏం సమాధానం చెప్పలేదు అని సౌజన్య రావు అంటాడు. అది మీ మూర్ఖత్వం. పనికి మాలిన ప్రపోజల్ గురించి సమాధానం వస్తుందని ఎలా ఊహిస్తారు అని రిషి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు రిషి గారు అని సౌజన్య రావు అంటే.. మీరు విన్నదే మాట్లాడుతున్నా. అయినా మా జగతి మేడమ్, వసుధార చెంపదెబ్బ కొట్టినట్లుగా అక్కడే సమాధానం చెప్పారు కదా. మళ్లీ నా సమాధానం కోసం ఎదురుచూడటం ఏంటీ అని రిషి అంటాడు. ఒకవేళ మీ మనసేమైనా మారుతుందేమో.. మార్చుకుని ఒప్పుకుంటారేమో అని సౌజన్య రావు అంటాడు.

నేనే మీకు ఛాన్స్ ఇస్తా:నా మనసు మారదు. మీ ప్రపోజల్ నాకు నచ్చలేదు. గౌరవప్రదమైన విద్యా సంస్థకు గౌరవమైన హోదాలో ఉన్నాను కాబట్టి. పద్ధతిగా మాట్లాడుతున్నాను. లేదంటే మీరు ఇచ్చిన ప్రపోజల్ కు నా రియాక్షన్ వేరేగా ఉండేది అని రిషి అంటాడు. ఉడుకు రక్తం. ఉక్కు కండరాలు. తప్పులేదు ఇలా మాట్లాడొచ్చు. కానీ ఈ ఫీల్డ్ లో మీకంటే నాకే అనుభవం ఎక్కువ. మీ కాలేజీని మా కాలేజీలో కలిపితే చాలా బెన్ ఫిట్స్ ఉంటాయి అని సౌజన్య రావు అంటే ఎవరికీ మీకా నాకా అని రిషి అంటాడు. మీకే రిషి గారు. కావాలంటే బోర్డ్ మీటింగ్ పెట్టించండి. నేను మాట్లాడతాను అని సౌజన్ రావు అంటే.. ఇంకా ఆపుతారా. ఏంటీ మీరు మాట్లాడేది. ఇంకోసారి ఇలాంటి ప్రపోజల్స్ తో వస్తే మర్యాదగా ఉండదు. అయినా మీరు నాకు అవకాశాలు ఇచ్చేది ఏంటీ. నేను మీకు ఓ అవకాశం ఇస్తాను తీసుకోండి అని రిషి అంటాడు.
మా కాలేజీలో కలిపేయండి:అవునా.. ఏంటది. నేను అవకాశాలను అంత త్వరగా వదులుకోను. చెప్పు చెప్పు అని సౌజన్య రావు అంటే.. మా డీబీఎస్టీ కాలేజీ మెయిన్ గా ఉంటుంది. మీ కాలేజీనే మా కాలేజ్ లో కలిపేయండి. ఇదే నేను మీకు ఇచ్చే అవకాశం అనేసి అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. రిషిలా స్ట్రాంగ్ గా చెప్పడంతో సౌజన్య రావుకు ఏం అర్థం కాకా ఆలోచనలో పడిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన రిషి జరిగింది చెబుతాడు. ఫణీంద్ర, మహేంద్ర మెచ్చుకుంటారు. మెడికల్ కాలేజీ మనమే సొంతంగా పెట్టుుకండాం. పర్మిషన్స్ అవి నేను చూసుకుంటాను అని ఫణీంద్ర చెబుతాడు. తర్వాత వసుధార, జగతి ముందుకు వచ్చిన రిషి మేడమ్ ఎమ్ఎస్ఆర్ కి మీరు చెప్పిన సమాధానమే చెప్పి వచ్చాను. ఇక ఆయన ప్రపోజల్ గురించి ఆలోచించాల్సిన పని లేదు అని వెళ్లిపోతాడు.

వాడే ఛాన్స్ ఇచ్చాడు:మరోవైపు సౌజన్య రావుకి శైలేంద్ర భూషణ్ (SB) (దేవయాని కొడుకు) మీటింగ్ ఏమైంది. మన ప్రపోజల్ ఓకే చేశాడా అని మెసేజ్ చేస్తాడు. లేదు సార్. వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు. కావాలంటే ఎమ్ఎస్ఆర్ కాలేజీనే వాళ్ల కాలేజీలో కలపమంటున్నాడు. వాడు దిగి రాడు సార్. అవకాశం మిస్ అయింది అని సౌజన్య రావు రిప్లై ఇస్తాడు. ఛాన్స్ మిస్ అయిందని నువ్వు అంటున్నావ్. వాడే మనకు అవకాశం ఇచ్చాడు. వాడు చెప్పినట్లే కాలేజీని కలిపేయండి అని SB మెసేజ్ లో చెబుతాడు. ఓకే అన్న సౌజన్య రావు ఫణీంద్రకు కాల్ చేసి కలవాలని, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని కోరడంతో ఫణీంద్ర సరే అంటాడు. మరోవైపు రిషి కోసం మనం ఏమైనా చేయాలి అనుకుంటూ ఓ ఫైల్ రెడీ చేస్తారు. దీని మీద రిషికి తెలియకుండా సంతకం పెట్టించి తీసుకునిరా అని వసుధారతో జగతి అంటుంది. మేడమ్ ఇది మంచి పని అయినా. తనకు చెప్పకుండా సంతంకం పెట్టించడం కరెక్ట్ కాదేమో. నాకు చాలా భయంగా ఉంది అని వసుధార అంటుంది.
నన్ను నేను అనుమానించుకున్నట్లే:ఏం కాదు వసుధార.. ప్లీజ్ వెళ్లు భయపడుతూ వెళ్లకు. రిషి కనిపెట్టేస్తాడు అని జగతి అంటుంది. ఒకవేళ సార్ పేపర్స్ చదివితే ఎలా అని వసు అంటే.. అలా జరగదు వసు అని ధైర్యం చెప్పి పంపిస్తుంది జగతి. ఇబ్బందిపడుతూ అయిష్టంగా రిషి క్యాబిన్ కు వెళ్తుంది వసుధార. రిషితో సంతకాలు పెట్టిస్తుంది వసుధార. ఏంటీ వసుధార ఇన్ని పేపర్స్ ఉన్నాయి ఈరోజు అని రిషి అంటే.. సార్ అవన్నీ మిషన్ ఎడ్యుకేషన్ కు సంబంధించినవి. కొన్ని ముఖ్యమైనవి అని వసుధార అంటే.. ముఖ్యమైనవా మరి చెక్ చేయాలా అని రిషి అంటే వసుధార షాక్ అవుతుంది. నీ పనిపై అనుమానం పడితే నన్ను నేను అనుమానించుకున్నట్లే వసుధార అని సంతకాలు పెడతాడు రిషి. ఆల్ ది బెస్ట్ సార్ అని వసు అంటే ఇప్పుడు ఎందుకు చెబుతున్నావ్ అని రిషి అంటాడు. ఊరికే సార్ మీరెప్పుడు ది బెస్ట్ అవ్వాలనేదే నా కోరిక ఎండీ గారు అని వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆవేశమో.. ఆలోచనో..:రిషి సంతకం పెట్టిన ఫైల్ ను జగతికి ఇస్తుంది వసుధార. నువ్వేం టెన్షన్ పడొద్దు. మనం చేసేది మంచి పనే. మంచే జరుగుతుంది అని ఫైల్ తీసుకుని జగతి వెళ్లిపోతుంది. ఇలా రిషికి తెలియకుండా ఫైల్ పై సంతకం పెట్టిస్తుంది జగతి. మరోవైపు ఫణీంద్ర, మహేంద్ర, దేవయానిలను ఇంట్లోనే కలుస్తాడు సౌజన్యరావు. మా ప్రపోజల్ కు నో అన్న రిషి.. ఆవేశంలో అన్నాడో ఆలోచించి అన్నాడో తెలియదు కానీ, మా కాలేజీని మీ కాలేజీలో కలపమని చెప్పాడు. నాకు అది నచ్చింది. అది నాకు చాలా మంచి అవకాశంగా అనిపించింది అని సౌజన్య రావు అంటాడు. దీంతో మహేంద్ర, ఫణీంద్ర షాక్ అవుతారు. ఒకవేళ సౌజన్య రావు చెప్పింది విని ఎమ్ఎస్ఆర్ కాలేజీని డీబీఎస్టీ కాలేజీలో కలుపుకుంటే SB ఉచ్చులో రిషి ఇరుక్కున్నట్లుగానే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











