Guppedantha Manasu: దేవయాని కొత్త ప్లాన్ ఫెయిల్.. శత్రువుతో రిషి ఛాలెంజ్.. 10 రోజుల గడువు
ఫణీంద్ర, మహేంద్ర, దేవయానిలను ఇంటికెళ్లి కలుస్తాడు సౌజన్య రావు. డీబీఎస్టీ కాలేజీని ఎమ్ఎస్ఆర్ కాలేజీలో కలపడం ఇష్టం లేదని చెప్పిన రిషి మా కాలేజీని మీదాంట్లో కలపమన్నాడు. నాకు అయితే చాలా మంచి ప్రపోజల్ అనిపించింది. మంచి పేరున్న డీబీఎస్టీ కాలేజీలో మా కాలేజీని కలపడం నాకు అంగీకారమే అని సౌజన్య రావు అంటాడు. ఈ విషయం రిషితో కాకుండా మాకెందుకు చెబుతున్నారు అని ఫణీంద్ర అంటాడు.
రిషిది యంగ్ బ్లడ్. అంత జరిగిన తర్వాత నాకు అపాయింట్ మెంట్ ఇస్తాడని నేను అనుకోవట్లేదు. మళ్లీ ఆవేశంతో నా గుండు పగలగొట్టిన పగులగొడతాడు. అందుకే మిమ్మల్ని కలిశాను అని సౌజన్య రావు అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 22 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 744లో ఇంకా ఏం జరిగిందంటే?

మంచి ఆఫర్ కదా: మీరు రిషితో మాట్లాడండి. తను ఓకే అంటేనే ముందుకు వెళ్దాం అని సౌజన్య రావు అంటాడు. దీనివల్ల మీకేం లాభం అని మహేంద్ర అడిగితే.. మిషన్ ఎడ్యుకేషన్ వల్ల మీకు మంచి పేరు ఉంది. ఇది మీకు మంచి అవకాశం. మెడికల్ కాలేజీ కోసం కొత్తగా బిల్డింగ్ కట్టక్కర్లేదు. లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా కాలేజీని మీ కాలేజీలో మెర్జ్ చేయడమే మిగిలింది.
రిషి ఒప్పుకున్నట్లు నాకు పిలుపు వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు సౌజన్య రావు. మనసులో మాత్రం రిషికి మీరే చెప్పాలి అని అనుకుంటాడు. సౌజన్య రావు వెళ్లిపోయాక ఒప్పేసుకోండి. మంచి ఆఫర్ కదా అని దేవయాని అంటుంది. ఒప్పుకోవాల్సింది నువ్వు.. నేను కాదు రిషి అని ఫణీంద్ర అంటాడు.
రిషిని ఒప్పించడానికి: చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి కదా. ఎలాంటి ఖర్చు లేదు అని దేవయాని అంటే.. వదినగారు.. అలా కాదు.. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. అసలు రిషితో కాకుండా మనకు చెప్పడమే తేడాగా ఉంది అని మహేంద్ర అంటాడు. తర్వాత ఇంటికొచ్చిన రిషి పెద్దమ్మా ఎక్కడ అని వెతుకుతుంటాడు.
ఒంట్లో బాలేదని, నీరసంగా ఉంటే పడుకుందని ధరణి చెబుతుంది. హాస్పిటల్ కు వెళ్లకుండా ఇక్కడే ఉండటం ఏంటని దేవయాని దగ్గరికి రిషి వెళ్తాడు. ఇదంతా విన్న జగతి-వసుధారకు అనుమానం వస్తుంది. సడెన్ గా ఆరోగ్యం బాలేకపోవడం ఏంటని వసుధార అంటే.. నీ అనుమానం నాకు అర్థమైంది. ఇందాకా సౌజన్య రావు వచ్చి ఏదో ప్రపోజల్ పెట్టారట. అది అక్కయ్యకు నచ్చింది. రిషిని ఒప్పించడం కోసం ఇప్పుడు నీరసం వచ్చిందని అంటుంది జగతి.

మనసు పాడు చేస్తారు: ఎవరు ఏం చెప్పిన సౌజన్య రావు ప్రపోజల్ కి రిషి సార్ ఒప్పుకోరని వసుధార అంటుంది. దేవయాని గదిలోకి వెళ్లిన రిషి.. ఏంటీ పెద్దమ్మా నీకు ఆరోగ్యం బాలేకపోవడం ఏంటీ అని అడుగుతాడు. నేను బాగుంటే ఏంటీ లేకపోతే ఏంటీ.. మీరంతా బాగున్నారు కదా అని దేవయాని అంటుంది. మీకు బాగుండకుంటే మేమెలా బాగుంటాం అని రిషి అంటాడు.
నేను చెప్పే మంచి ఎవరికీ నచ్చుతుంది. నా మాట ఎవరు వింటున్నారు. నేను ఈ ఇంట్లో సంతోషంగా లేను. నువ్వైనా సంతోషంగా ఉండు అని దేవయాని అంటుంది. మీకు ఒంట్లో బాగుండకపోవడం కాదు. మనసు బాలేదు. ఏమైందో చెప్పండి అని రిషి అంటాడు. చెప్పినా ఏం లాభం. ఇంట్లో వాళ్లు నీ మనసు పాడు చేస్తారు. నేను మంచి చెప్పినా నువ్వు వినవు. ఇందాకా సౌజన్య రావు వచ్చాడని ప్రపోజల్ గురించి చెప్పి.. రూపాయి పెట్టుబడి లేకుండా అన్ని జరుగుతాయి కదా అని దేవయాని అంటుంది.
నాకు నష్టం చేస్తున్నారు: పెదనాన్న, డాడ్ ఏమన్నారు అని రిషి అడుగుతాడు. వాళ్లు ఒప్పుకోలేదు. రిషి నిర్ణయం తీసుకుంటాడు అన్నారు. అంతా నీకు నష్టం చేస్తున్నారు అని దేవయాని అంటుంది. దీంతో కోపంగా లేచి వెళ్లిన రిషి డాడ్, పెదనాన్న అంటూ గట్టిగా అరుస్తాడు. పెద్దమ్మా చెప్పింది ఎందుకు ఒప్పుకోవడం లేదు. ఎలాంటి సమస్య లేకుండా లైసెన్స్ వస్తుంది కదా.
ఎందుకు సౌజన్య రావు ప్రపోజల్ ఒప్పుకేలేదు అని రిషి అందరికీ షాక్ ఇస్తాడు. ఎవ్వరూ పెద్దమ్మా మాట వినట్లేదు. డాడ్, మేడమ్ ఎలాగు పట్టించుకోరు. పెదనాన్న మీరైనా పెద్దమ్మను అర్థం చేసుకోవాలి కదా. మీరంతా నాకు నష్టం చేస్తున్నారు. పెద్దమ్మా మాట వినాలి కదా. పెద్దమ్మా బెస్ట్ అని రిషి అంటాడు. అది చూసి దేవయాని తనలో తానే మురిసిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ధరణి ఏంటీ అత్తయ్య మీలో మీరే ముసిముసిగా నవ్వుకుంటున్నారని అడుగుతుంది.

రగిలిపోయిన దేవయాని: నువ్వేంటి ఇక్కడున్నావ్ అని అన్న దేవయాని హాల్లోకి చూస్తుంది. ఇప్పటిదాకా రిషి నన్ను పొగిడింది నా భ్రమా అని దేవయాని అనుకుంటుంది. అటువైపు ఫణీంద్ర, మహేంద్రలకు థ్యాంక్స్ చెబుతాడు రిషి. నా అభిప్రాయాన్ని గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనది అంతా ఒకే నిర్ణయం అని చాలా బాగా చెప్పారు అని సంతోషిస్తాడు రిషి.
ఈ విషయంలోనే కాదు కాలేజీకి సంబంధించిన ఏ విషయంలో అయినా ఫైనల్ డెసిషన్ నీదే అని ఫణీంద్ర అంటాడు. మిమ్మల్ని సౌజన్య రావు కలుస్తానన్నప్పుడు నాకు చెప్పాల్సింది. అయినా చాలా మంచి పని చేశారు అని పొగుడుతాడు రిషి. అది చూసి దేవయాని రగిలిపోతుంటే ధరణి సెటైర్లు వేస్తుంది.
మీకు పర్మిషన్ వస్తుందో లేదో: మరుసటి రోజు రిషి కోసం సౌజన్య రావు ఎదురుచూస్తుంటాడు. ఇంతలో రిషి వస్తాడు. నా డీల్ కు ఒప్పుకున్నట్లే కదా అని సౌజన్య రావు అంటే.. అదెప్పటికీ జరగదు అని రిషి అంటాడు. దీనివల్ల మీకు ఒక్క రూపాయి ఖర్చు ఉండదు అని సౌజన్య రావు అంటే నేను ఖర్చు గురించి ఆలోచించను స్టూడెంట్స్ భవిష్యత్ ముఖ్యం అని రిషి అంటాడు. నేను నిజాయితీ పరులతో డీల్ చేస్తాను. మీలా రంగులు మార్చేవాళ్లతో కాదు అని రిషి అంటాడు.
అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు. మా కాలేజీని మీ కాలేజీలో కలిపేస్తానన్న కదా. మీరిప్పుడు కాదన్న నాకు పోయేదేం లేదు. నేను సెపరేట్ గా అప్లై చేసి కూడా మీకంటే ముందే పర్మిషన్ తెచ్చుకోగల సత్తా నాకు ఉంది. మీ డీబీఎస్టీ కాలేజీకి పర్మిషన్ వస్తుందో లేదో కానీ మా కాలేజీకి మాత్రం కచ్చితంగా వస్తుంది అని సౌజన్య రావు రెచ్చగొట్టినట్లుగా అంటాడు.
సౌజన్య రావుతో రిషి ఛాలెంజ్: ఏం మాట్లాడుతున్నారు. డీబీఎస్టీకి పర్మిషన్ రాకపోవడం ఏంటీ. మాకున్న పేరుకు మీకంటే ముందే పర్మిషన్ వస్తుంది అని రిషి అంటాడు. ఊరికే భ్రమలు పడొద్దు. పేరు అని మీరు అనుకుంటే సరిపోదు. జనం కూడా అనుకోవాలి. నేను ఇప్పుడు చెబుతున్నా మీ కాలేజీకి పర్మిషన్ రాదని సౌజన్య రావు అంటే.. రిషి కోపంగా వస్తే అని అంటాడు.
ఒక ఛాలెంజ్ చేసుకుందాం పది రోజుల్లో పర్మిషన్ ఎవరికీ ముందు వస్తుందో చూద్దాం. మీ కాలేజీకి పర్మిషన్ వస్తే మా కాలేజీని కలిపేస్తాను. మాకు పర్మిషన్ వస్తే మీ కాలేజీని మాదాంట్లో కలపాలి అని సౌజన్య రావు సవాల్ విసురుతాడు. దానికి రిషి ఒప్పుకుంటాడు. ఇదే విషయం మహేంద్ర, జగతి, వసుకు చెబుతాడు రిషి. 10 రోజుల్లో పర్మిషన్ రావడం కష్టం. అతనితో ఛాలెంజ్ ఎందుకని జగతి అంటే.. మన కాలేజీ ప్రతిష్ట గురించి మాట్లాడాడు మేడమ్ అని రిషి అంటాడు.


Click it and Unblock the Notifications











