Guppedantha Manasu: జగతి వసు దెబ్బకు గుండు బాస్ విలవిల.. దండ వేసి గెంటేసిన మహేంద్ర

మెడికల్ కాలేజీ పర్మిషన్ రావడం కష్టం కదా అని మహేంద్ర, జగతి అంటారు. వాడితో ఛాలెంజ్ ఎందుకు. వాడో కన్నింగ్ ఫెలోలా ఉన్నాడు. రోజుకో మాట మారుస్తున్నాడని వసుధార అంటుంది. నీది ఆశయమైన, వాడిది స్వార్థం, వ్యాపారం.

నిన్ను కావాలనె రెచ్చగొట్టాడు అని మహేంద్ర అంటాడు. మీరే అన్నారు కదా డాడ్ నాది ఆశయం అని. పది రోజుల్లో పర్మిషన్ తీసుకొచ్చి ఆ సౌజన్య రావుకు నేనేంటో చూపిస్తా అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 24 సోమవారం నాటి తాజా ఎపిసోడ్‌ 745లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial April 24 2023 Today Full Episode 745

పర్మిషన్ రాకుండా: వెంటనే పనులు ప్రారంభించండి అని రిషి చెబుతాడు. దీంతో అక్కడి నుంచి అందరూ బయలుదేరతారు. వసుధార మాత్రం డల్ గా ఉంటే ఏమైందని అడుగుతాడు. పర్మిషన్ రాకుపోతే అని వసుధార అంటే.. దాన్ని అలాగే ఆపి.. నేను ఏమైపోతానో, ఎంత బాధపడతాననే కదా నీ భయం.

నాకు బాధపడటమే కాదు దాన్ని తట్టుకోవడం కూడా తెలుసు అని నచ్చజెప్పుతాడు. మరోవైపు ఛాలెంజ్ మొదలైంది. త్వరలో డీబీఎస్టీ కాలేజీ ఎమ్ఎస్ఆర్ కాలేజీలో కలువబోతుంది. డీబీఎస్టీకి పర్మిషన్ రాకుండా మీరే చూసుకోవాలని మెసేజ్ పంపుతాడు గుండు బాస్ సౌజన్య రావు.

పూలదండతో గుండుబాస్: డోంట్ వర్రీ. అది నేను చూసుకుంటాను అని అటు నుంచి (SB) రిప్లై వస్తుంది. ఇక ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండిపోతారు. 10 రోజులు గడిచిపోతాయి. పదో రోజున వాట్ మన కాలేజీకి పర్మిషన్ రాలేదా.. ఎందుకు అని కోపంగా అడుగుతాడు రిషి.

అవును సార్.. ఆ సౌజన్య రావు పక్కాగా ప్లాన్ చేసి మరి పర్మిషన్ రాకుండా చేశాడనిపిస్తోంది అని వసుధార అంటుంది. ఎమ్ఎస్ఆర్ కాల్ చేశారు. కలవడానికి ఇంటికి వస్తున్నా అన్నారు అని మహేంద్ర చెబుతాడు. ఇప్పుడా.. ఎందుకంటా అని కోపంగా రిషి అంటాడు. ఇంట్లో రిషీ, మహేంద్ర ఉంటారు. సౌజన్య రావు పూలదండతో వస్తాడు.

Guppedantha Manasu Serial April 24 2023 Today Full Episode 745

అంత దమ్ము ఉందా: కంగ్రాచ్యులేషన్స్ రిషి అని మెడలో పూల దండ వేస్తాడు సౌజన్య రావు. దాన్ని కోపంగా తీసి నేలకు విసిరి కొడతాడు రిషి. దానికి ఎందుకు రిషి గారు అంత కోపం అని సౌజన్య రావు అంటాడు. ఎందుకొచ్చారు అని రిషి అంటే.. మీకు నిజంగా తెలియదా నేను ఎందుకు వచ్చానో. ఒప్పందం ప్రకారం మీ కాలేజీ మా కాలేజీలో కలవబోతుంది అని సౌజన్య రావు అంటే..

అది ఎప్పటికీ జరగదు అని రిషి అంటాడు. ఎందుకు జరగదు. మీ బోర్డ్ తీసేసి మా బోర్డ్ పెడితే సరిపోతుంది కదా అని సౌజన్య రావు అంటాడు. డీబీఎస్టీ కాలేజీ బోర్డ్ పట్టుకునే దమ్ముందా అని రిషి అంటాడు.

రిజల్ట్ ముఖ్యం: దమ్ము వరకు ఎందుకు రిషి.. ఒప్పందం ఉంది కదా. అయినా నువ్ అరిచినంత మాత్రాన మన ఒప్పందం చెదిరిపోదు అని సౌజన్య రావు అంటాడు. మీరైనా చెప్పాలి కదా మహేంద్ర గారు. మీ అబ్బాయికి ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. నాతో డీల్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని చేయాల్సింది.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇది అని సౌజన్య రావు అంటాడు. ఏవో రాజకీయాలు, కుట్రలు చేసి మీరు కావాలని చేశారని అర్థం అవుతుంది అని మహేంద్ర అంటాడు. చాతకానీ మాటలు, లాస్ట్ బెంచ్ లో కూర్చుని చెప్పే మాటలొద్దు మహేంద్ర. మీరు ఓడిపోయి.. నేను ఏదో తొండి చేసి గెలిచానంటే ఎలా. అయినా ఏం చేశామన్నది కాదు. రిజల్ట్ ముఖ్యం అని సౌజన్య రావు అంటాడు.

Guppedantha Manasu Serial April 24 2023 Today Full Episode 745

వాయిస్ నాది కాదు: గెట్ అవుట్ అని రిషి గట్టిగా అరుస్తాడు. నేను కూడా మీ కాలేజీ నుంచి మిమ్మల్ని బయటకు పంపించగలను. అయినా ఈ విషయాన్ని మీడియాకు అనౌన్స్ చేయాలి అనుకున్నాం కదా అని సౌజన్య రావు అంటే.. తప్పకుండా చేద్దాం అని జగతి, వసు ఎంట్రీ ఇస్తారు. కచ్చితంగా అనౌన్స్ చేద్దాం. మీరు ఎంత గొప్పగా డీల్ చేశారో.

తెర వెనుక ఎలంటి కథలు నడిపారో. ఎంత కష్టపడి పర్మిషన్ తెచ్చుకున్నారోఆ కథను కథనాన్ని కచ్చితంగా చెబుదాం అని జగతి అంటుంది. అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది వసుధార. ఆ వాయిస్ తనది కాదు అని సౌజన్య రావు అంటాడు. ఆ వాయిస్ మీది అని మేము అనలేదు కదా అని కౌంటర్ ఇస్తుంది వసు.

లంచం ఇచ్చి: తర్వాత డీబీఎస్టీ కాలేజీ అప్లికేషన్ ముందుకు వెళ్లకూడదు. నీకు ఎంత కావాలో చెప్పు. ఏం చేసైనా నేను పెట్టిన అప్లికేషనే ముందుకు వెళ్లాలి. ఫైవ్ డేస్ లో పని జరిగిపోవాలి. అప్పటివరకు ఇదిగో ఇది అడ్వాన్స్ గా ఉంచు అని ఒకరితో మాట్లాడిన వీడియో చూపిస్తుంది. దీంతో సౌజన్య రావు ఫీజులు ఎగిరిపోతాయి. ఇంతలో అతనికి ఫోన్ వస్తుంది.

లంచం ఇచ్చి పర్మిషన్ తెచ్చుకున్నందున్న దాన్ని క్యాన్సిల్ చేసినట్లు చెబుతారు. దీంతో విలవిల లాడిపోతాడు సౌజన్య రావు. మిమ్మల్ని ఎవరినీ వదిలి పెట్టను. ఇదే కదా మీ నెక్ట్స్ డైలాగ్. మీరు భయపడుతూ చెబితే బాగుండదని నేను చెప్పాను. డోంట్ మైండ్ అని మహేంద్ర వెటకారంగా అంటాడు.

మెడికల్ కాలేజీ ఎండీ: ఇక తలదించుకున్న సౌజన్య రావును వెళ్లు అన్నట్లుగా బయటకు చూపిస్తాడు. సౌజన్య రావు వెళ్లబోతుంటే ఆపి కింద పడిన దండను తీసి అతని మెడలో గెంటిసేనట్లుగా పంపిస్తాడు మహేంద్ర. ఇదంతా అర్థం కానీ రిషి గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంటాడు. పర్మిషన్ రాలేదని బాధపడుతుంటాడు.

వసుధార వెళ్లి కుర్చీలో కూర్చున్న రిషి వెనుకవైపు వాలి ప్రేమగా మాట్లాడుతుంది. మినిస్టర్ గారు రమ్మన్నారని చెబుతుంది. ఇద్దరూ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. అదివరకే అక్కడ జగతి, మహేంద్ర ఉంటారు. కంగ్రాచ్యులేషన్ మెడికల్ కాలేజీ ఎండీ అని మినిస్టర్ అంటే రిషి సంతోషంతో షాక్ అవుతాడు. ఇలా మెడికల్ కాలేజీ కలను వసు, జగతి నెరవేరుస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X