Guppedantha Manasu: కథలోకి దేవయాని కొడుకు ఎంట్రీ.. రిషిపై ఈర్శ్య.. అన్నదమ్ముల పోరు మొదలు!
శైలేంద్ర భూషణ్ టాక్సీలో వస్తూ వేగంగా పోనివ్వాలను డ్రైవర్ ను కంగారు పెట్టడంతో ఒక ముసలయనికి కారు ఢీ కొడుతుంది. అది చూసిన వసుధార శైలేంద్రతో గొవడకు దిగుతుంది. రూడ్ గా మాట్లాడి అక్కడి నుంచి శైలేంద్ర వెళ్లిపోతాడు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని వసుధార అనుకుంటుంది. మరోవైపు మినిస్టర్ మాటలను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తాడు రిషి.
జగతి మహేంద్ర వచ్చేసరికి అలాగే హాల్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 26 బుధవారం నాటి తాజా ఎపిసోడ్ 747లో ఇంకా ఏం జరిగిందంటే?

మన ప్లాన్ ఫెయిల్: ఇప్పుడు రిషీతో మాట్లాడొద్దు. కూల్ అయిన తర్వాత మాట్లాడదాం అని జగతి, మహేంద్ర సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటే మేడమ్ అని రిషి పిలుస్తాడు. థ్యాంక్యూ మేడమ్. నాకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా చివరికీ అంతా మంచే జరిగింది. మీరు మన కుటుంబ గౌరవాన్ని కాపాడారు. చాలా కష్టం అనుకున్న మెడికల్ కాలేజీ పర్మిషన్ ను పది రోజుల్లో తెచ్చి గ్రేట్ అనిపించారు.
నన్ను గెలిపించారు అని రిషి అంటాడు. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావ్. అది చాలు మాకు అంటుంది జగతి. మరోవైపు సౌజన్య రావు టెన్షన్ తో శైలేంద్ర భూషణ్ కు కాల్ చేస్తాడు. మన ప్లాన్ ఫెయిల్ అయంది సార్ అని సౌజన్య రావు అంటే.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఎప్పుడో వచ్చిన న్యూస్ ను ఇప్పుడు చెబుతున్నావ్. మొత్తం సర్వ నాశనం చేశావ్ అని శైలేంద్ర అంటాడు.
షాక్ అయిన ధరణి: తూచా తప్పకుండా చెప్పింది చేశాను. రిషీంద్ర భూషణ్ ను మన దారిలోకి వచ్చేలా చేశాను. కానీ వాళ్లిద్దరి (వసు, జగతి) కన్ను కప్పలేకపోయాను నేను. డీబీఎస్టీ కాలేజీకి పర్మిషన్స్ కూడా వచ్చేశాయి సార్ అని సౌజన్య రావు అంటాడు. ఆ విషయం కూడా తెలిసింది అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. మరోవైపు వసు రాలేదని జగతి, మహేంద్ర కంగారు పడుతుంటారు. దారిలో రిషికి కాల్ చేసి సార్ వచ్చేస్తున్నా.
ఈరోజు నేను బ్యాడ్ మేన్ ను చూశాను. అందరూ మీలానే మంచివాళ్లు ఉండరు కదా. అతడు మీకు అస్సలు నచ్చడు. వచ్చాక అతడి గురించి చెబుతాను అని శైలేంద్ర గురించి వసుధార అంటుంది. కొద్దిసేపటికి శైలేంద్ర ఇంటికి వస్తాడు. ధరణి చూసి షాక్ తో సంబరంగా చూస్తుంది. అంతా కిందకి వచ్చి శైలేంద్రకు ఆహ్వానం పలుకుతారు.

నేను కాఫీ ఇవ్వలేనా: ఇంట్లో అందరినీ పలకరిస్తాడు. ఇంతలో కిందకు రిషి వస్తాడు. శైలేంద్రను హత్తుకుంటూ బాగా మారిపోయావ్ అంటాడు రిషి. నువ్వు మారిపోయావ్ రిషీ. బాగా పేరు తెచ్చుకుంటున్నావ్ గా కాలేజీ నడుపుతూ.. ఫారెన్ లో ఉన్నా నీ పేర నా చెవి దాకా వినిపించేది అని శైలేంద్ర అంటాడు. శైలేంద్ర లగేజ్ లోపల పెట్టిన ధరణీ ఇన్నాళ్లు నా ఒంటరితనం తీరిబోతుంది అని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే వచ్చిన రిషి ఏంటీ వదినా ఆనంద భాష్పాలా.
కిందకు వెళ్దాం అని తీసుకుని వెళ్తాడు. అన్నయ్యా మీకోసం వదిన బోలెడంత ప్రేమను దాచి పెట్టుకుందో తెలుసా. ఎంత ఒంటరిగా ఫీల్ అయిన బాధను ఎవరికీ చెప్పుకోలేదు అని రిషి అంటే.. ఫణీంద్ర కూడా ఒక ఆడపిల్లకు తన భర్త పక్కన నిలబడి ఉండటమే ఆనందంగా భావిస్తారు. అది ఈరోజు నేను ధరణీ కళ్లల్లో చూస్తున్నాను అని అంటాడు. శైలేంద్రకు కాఫీ తీసుకురా అని మహేంద్ర అంటే.. ఆగమని చెప్పి ఇంతకాలానికి వచ్చిన నా కొడుక్కి నేను కాఫీ ఇవ్వలేనా. ఎవరో ఇస్తే నాకేం సంతృప్తి అని దేవయాని అడ్డు పడుతుంది.
ఒక్కొక్కటీ ఇద్దువులే: ఎవరో కాదు ధరణి వాడి భార్య. నీకు ఎంత ప్రేమ ఉందో. తనకీ అంతే ప్రేమ ఉంటుంది. నువ్వు కూర్చో. తను ఇస్తుందిలే అని ఫణీంద్ర అంటే ధరణి వెళ్తుంది. అన్నయ్యా నా రూమ్ లోకి రా వెళ్దాం అని శైలేంద్ర చేయి పట్టుకుని రిషి వెళ్తాడు. అది చూసి రిషికి బంధాలంటే ఎంత ఇష్టమో కదా అని మహేంద్ర అంటాడు. నా కొడుక్కి బంధాలంటే ఇష్టమే కాదు.
గౌరవం కూడా అని జగతి అంటుంది. ఆ మాటలకు దేవయాని రగిలిపోతుంది. ఇదే అన్నయ్యా నీ రూమ్. ఏంటీ అలా చూస్తున్నావ్. నచ్చలేదా. పోనీ నా రూమ్ తీసుకుంటావా అని రిషి అంటాడు. నువ్వు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయిలే. తొందరెందుకు. టైమ్ కుదిరినప్పుడు ఒక్కొక్కటీ ఇద్దువు గానీ, తీసుకుంటా అని శైలేంద్ర అంటాడు.
నువ్వు హీరో అయ్యావ్: ఏంటో అన్నయ్యా నువ్వు సరదాగా మాట్లాడతావో వ్యంగంగా మాట్లాడతావో ఇప్పటికీ అర్థం కాదు. ఎలా ఉంది నీ ఫారిన్ లైఫ్. ఇక్కడ బాగుందా. అక్కడ బాగుందా. అని రిషి అంటాడు. నాకు ఎక్కడున్నా ఒకటే రిషి. నేను ఎక్కడుంటే అక్కడా నా చుట్టూ పరిసరాలన్నీ నాకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి అని శైలేంద్ర అంటాడు.
మారిపోవడం కాదు. నువ్వే మార్చేసుకుంటావ్ అని రిషి అంటాడు. సరే నీ కాలేజీ ఎండీగా నీ అనుభవం ఎలా ఉంది అని శైలేంద్ర అంటాడు. అంతా బాగుంది. చక్కగా నడుస్తుంది అని రిషి అంటే కాలేజీకేమో గానీ నీకు మాత్రం మంచి పేరు వస్తుంది. మమ్మీ పెంపకం కదా. నిన్ను జెంటిల్ మెన్ గా మార్చేసింది. అందరిలోనూ నువ్వు హీరో అయ్యావ్ అని ఈర్శ్యతో శైలేంద్ర అంటాడు. మునగ చెట్టు ఎక్కించాలని చూస్తున్నావా అని రిషి అంటాడు.
వారసత్వ పోరు: ఇంతలో ధరణీ కాఫీ పట్టుకుని వస్తుంది. అదిగో నీ స్పెషల్ కాఫీ వచ్చింది. తాగి ప్రెష్ అవ్వు అన్నయ్యా. నేను వస్తాను అని రిషి వెళ్లిపోతాడు. ధరణి కాఫీ పట్టుకుని లోపలికి సిగ్గు పడుతూ వస్తుంది. ఇది మనిద్దరి గదా అని అంటాడు. అవును అన్నట్లుగా సిగ్గు పడుతుంది ధరణి. అవునా కాదా అని శైలేంద్ర అంటే ఊ అని ధరణి మెల్లిగా అంటుంది.
లోపలికి వచ్చావ్ తలుపు వేయ్యాలని తెలీదా అని శైలేంద్ర అంటే ధరణి వెళ్లి తలుపు పెడుతుంది. మళ్లీ సిగ్గుపడుతూ శైలేంద్ర దగ్గరికి ధరణి వస్తే షర్ట్ బటన్స్ విప్పుతూ శైలేంద్ర ఉంటాడు. శైలేంద్ర క్యారెక్టర్ చూస్తుంటే ఇక నుంచి అన్నదమ్ములకు వారసత్వ గొడవలు జరిగేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











