Guppedantha Manasu: గేమ్ మొదలు పెట్టిన శైలేంద్ర.. వసు క్షమాపణలు.. ధరణికి కష్టాలు!
మొత్తానికి మెయిన్ విలన్ అయిన శైలేంద్ర భూషణ్ (దేవయాని కొడుకు) ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. భర్త వచ్చాడన్న సంతోషంలో తేలిపోతుంటుంది ధరణి. శైలేంద్రకు రూమ్ లో సిగ్గు పడుతూ కాఫీ ఇస్తుంది. చేతిలో కప్పు తీసుకున్న శైలేంద్ర కాఫీ బాగుంది. నువ్ కూడా బాగున్నావ్ అని రొమాంటిక్ గా మాట్లాడతాడు శైలేంద్ర.
ఆ మాటలతో ధరణి మురిసిపోతుండగా.. ఏంటీ ఈ అవతారం అంటూ గట్టిగా అరుస్తాడు శైలేంద్ర. అప్పటి వరకు తను కలలో ఉన్నానని అర్థం చేసుకుంటుంది ధరణి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 27 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 748లో ఇంకా ఏం జరిగిందంటే?

పల్లెటూరి మొద్దులా: ఈ అవతారంలో ఉంటే నాకు నచ్చదు. నేను ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వను. కాఫీ మాత్రం బాగుంది. కాఫీ పెట్టడం తప్పా ఏం చేతకాదు. ఏంటీ ఆ సైలెన్స్. నీ ముఖం చూసి అర్థం చేసుకోవాలా. సమాధానం రావాల్సిన చోట సైలెంట్ గా ఉంటే నాకు నచ్చదు. ఆ కళ్ల భాష నాకు అస్సలు ఇష్టం ఉండదు అని ధరణిపై శైలేంద్ర అరుస్తుంటే నేను రోజు అదే చెబుతుంటాను అంటూ దేవయాని ఎంట్రీ ఇస్తుంది.
మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడదు. మాట్లాడనివి కూడా మాట్లాడుతుంది. అరే అలా ఉండకూడదు. ఇలా ఉండకూడదు. ఇంకా పల్లెటూరి మొద్దులా ఉంటావేంటని.. పొద్దు అస్తమానం చెబుతూనే ఉంటాను. అసలు నా మాట వింటేనే కదా అని రెచ్చిపోతుంది దేవయాని.

వసుధార షాక్: దేవయాని మాటలకు కళ్లలో కన్నీళ్లు ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ధరణిను చూసిన జగతి, మహేంద్ర ఏమైంది అలా ఉంది అనుకుంటారు. కాసేపటికి వసుధార వస్తుంది. జగతి, మహేంద్ర, రిషిలకు జరిగిన యాక్సిడెంట్ గొడవ గురించి, కలిసి శైలేంద్ర గురించి చెబుతుంది. ఈరోజు నేను ఒక పొగరుబోతుని చూశాను. అసలు అతన్ని చూస్తే భూమి మీద ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది.
మనం చెప్పేది వినిపించుకోడు. మాట్లాడినంతసేపు చిరాకు వేసింది. అలాంటివాడిని నేను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇక చూడను అని వసుధార అంటుండగా పైనుంచి వస్తున్న శైలేంద్రను చూసి షాక్ అవుతుంది. శైలేంద్ర కూడా వసుని చూసి షాక్ అవుతాడు. తనే వసుధార అని శైలేంద్రకు చెబుతుంది దేవయాని.

నువ్వు ఎలా భరిస్తున్నావ్: శైలేంద్ర గురించి రిషి పరిచయం చేస్తే.. హేయ్ వసుధార.. నువ్వేనా రోజూ మా అమ్మ చెప్పే వసుధారవి అని కళ్లు ఎగరేస్తూ అంటాడు శైలేంద్ర. మీకు ముందే పరిచయం ఉందా అని రిషి అంటే ఇంతకుముందే అయింది. నా గురించి చెడ్డగా చెప్పేశావా అని శైలేంద్ర అంటాడు. ఇందాక నేను త్వరగా రావాలనే ఉద్దేశంతో టాక్సీ డ్రైవర్ ను తొందరపెట్టాను. వాడు కంగారులో యాక్సిడెంట్ చేశాడు. ఈ వసుధారేమో నాతో వచ్చి గొడవ పెట్టుకుంది. మీరే చెప్పండి.
ఆ యాక్సిడెంట్ నేను కావాలని చేయిస్తానా అని శైలేంద్ర అంటాడు. అవును వసుధార కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయిస్తారు అని రిషి అంటాడు. కదా కానీ తనేమో పోలీసులు, కేసులు అంటూ నానా హంగామా చేసింది. కానీ దీని వల్ల నేను అర్థం అయింది ఏంటంటే వసుధార చాలా ధైర్యవంతురాలు. వెరీ బిగ్ ఫైటర్. అంత సామాన్యంగా వదిలిపెట్టే రకం కాదు. నువ్వు ఎలా భరిస్తున్నావ్ రిషి అని శైలేంద్ర అంటాడు.

యుద్ధం ప్రకటించే ముందు: ఏంటీ వసుధార జరిగింది మరిచిపోయి అన్నయ్య నీ గురించి అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటీ అని రిషి చిన్నగా అంటాడు. సారీ మీరు అని తెలియక అని వసుధార అంటుంది. తప్పు ఒప్పుకుంటున్నావా. పర్లేదులే. నిజం తెలియక అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అని శైలేంద్ర అంటే.. తను కూడా కావాలని గొడవ పడి ఉండదు కదా.
యాక్సిడెంట్ అయిందనే కంగారులో గొడవ పడి ఉంటుంది అని రిషి అంటాడు. నిజమే రిషి, కానీ యుద్ధం ప్రకటించే ముందు అవతలి వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా అని శైలేంద్ర అంటాడు. అన్నయ్య అంతే వ్యంగంగా మాట్లాడతాడు అని రిషి అంటాడు. ఇక నుంచి అయిన ముందు వెనుక చూసుకుని గొడవకు దిగడం నీకే మంచిది అని శైలేంద్ర అంటాడు.

అంచనా తప్పొచ్చు: తర్వాత వసుధార వెళ్లిపోయి ఆలోచిస్తుంటే వెనుకే వెళ్లిన జగతి ఏమైంది అని అడుగుతుంది. ప్రాణం పోయేంత యాక్సిడెంట్ చేశారు మేడమ్. ఇప్పుడు ఎంత లైట్ గా మాట్లాడుతున్నారు. నేను ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదట అని జరిగింది మొత్తం చెబుతుంది వసుధార. ఇలాంటివి ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది. రిషి కోసం ఆలోచించూ అని జగతి చెబుతుంది. తర్వాత శైలేంద్ర తెచ్చిన గిఫ్ట్స్ పంచుతుంటాడు.
వదిన కోసం ఏం తెచ్చావ్ అని రిషి అడిగితే.. అది తనకు గదిలోనే ఉస్తాను. ఇక్కడ ఇచ్చేది కాదు అని శైలేంద్ర అంటాడు. తర్వాత వసు ఆలోచిస్తూ కింద పడబోతుంటే రిషి పట్టుకుంటాడు. నేను మనుషుల్నీ అంచనా వేయడంలో పొరబడతానా. నేను ఎవరినైనా చాలా సరిగ్గా అంచనా వేస్తాను కదా అని వసు అంటుంది. కొన్నిసార్లు అంచనా తప్పొచ్చు అని రిషి అంటాడు.

చాలా ముందుకు వచ్చాం: రిషిని చూసిప్పుడు మొదటిసారి వసు ఏమనుకుందో.. వసును రిషి ఏమనుకుందో ఇక్కడ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే జగతిని అమ్మా అని పిలవడంపై అడిగితే ఎన్ని రకాలుగా అడిగినా నా సమాధానం ఒక్కటే.
నాకు ఇష్టం లేని ప్రశ్నలు నువ్వు అడుగుతూ.. నీకు నచ్చని సమాధాన వింటూ మనిద్దరం జీవితంలో చాలా ముందుకు వచ్చేశాం అని రిషి అంటాడు. ఇక సీన్ కట్ చేస్తే ధరణిని ఉదయం డల్ గా ఎందుకు ఉన్నావ్ అని జగతి అడుగుతుంది. ధరణి చెప్పబోతుంటే దేవయాని వచ్చి అబ్బాయిని భోజనానికి పిలుచుకుని రా అని ధరణిని పంపిస్తుంది.


Click it and Unblock the Notifications











