Guppedantha Manasu: పాపం ధరణి.. అడుగడుగునా వేధిస్తున్న భర్త.. శైలేంద్రకు రిషి కౌంటర్.. జగతి ఓదార్పు

గదిలో శైలేంద్ర రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో ధరణి వచ్చి భోజనానికి పిలుస్తున్నారని ధరణి అంటుంది. వస్తున్నా.. ఏంటీ నువ్వు వసుధారకు బాగా క్లోజ్ అయినట్లు ఉన్నావ్. నిన్ను గిఫ్ట్ అడగమంటోంది. మీరిద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకుంటారా.. లేదంటే కేవలం నా విషయాలే మాట్లాడుకుంటున్నారా అని శైలేంద్ర అంటాడు. అదేం లేదండి అని ధరణి అంటుంది. మరి ఇంకేముంది. అయినా నేను వస్తాను అని ఎదురుచూడనిదానివి నేను తెచ్చే గిఫ్ట్ తెస్తానని ఎదురుచూస్తావా అని శైలేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 28 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 749లో ఇంకా ఏం జరిగిందంటే?

బాధను ఆపుకుంటూ:అయినా నీకు ఏం గిఫ్ట్ తెస్తాను. నువ్వు ఒక అప్పలమ్మవి. పొట్లం కట్టినట్లు ఈ ఆరు గజాల గోను సంచిలాంటి చీర కట్టుకుని ఉంటావ్. ఆ హెయిర్ స్టైల్ ఆ జిడ్డు ముఖం ఆ వాలకం అసలు నిన్ను పూర్తిగా చూడాలని కూడా అనిపించదు అంటూ ధరణిని అనరాని మాటలు అంటాడు శైలేంద్ర. దీనికి బాధను ఆపుకుంటూ సరే త్వరగా రండి అందరూ ఎదురు చూస్తున్నారు అని ధరణి వెళ్లిపోతుంది. పర్లేదు మాటకు మాట అనడం లేదు అని శైలేంద్ర అనుకుంటాడు. తర్వాత అంతా కలిసి భోజనం చేస్తారు. మేడమ్ మీరు కూడా కూర్చోని తినండి అని ధరణిని వసుధార అంటే దేవయాని తనకు తన భర్తకు వడ్డిస్తుంది. అయినా తనకు అందరు తిన్నాక తినడం ఇష్టం అని దేవయాని కోపంగా అంటుంది.

Guppedantha Manasu Serial April 28 2023 Today Full Episode 749

స్పెషల్ గిఫ్ట్ కన్నీళ్లు:దేవయాని మాటలను డైవెర్ట్ చేయడానికి అది కాదు వదినా.. తన భర్త కోసం చేసిన స్పెషల్ వంటకాలను దగ్గరుండి వడ్డిస్తుంది అని మహేంద్ర అంటాడు. ఆ వంటకాలు శైలేంద్ర కోసమేనా మాకు కూడా పెడతావా అని మహేంద్ర అంటే అందరు నవ్వుకుంటూ తింటూ ఉంటారు. బెండకాయ అసలు తినను. ఇది నాకు ఇష్టం ఉండదు అని శైలేంద్ర అంటాడు. ధరణి నీకోసమే చాలా ఇష్టంగా చేసింది తిను అంటూ అందరూ అంటారు. దీంతో సరే అని బెండకాయ కర్రీని ప్లేట్ లో పెట్టించుకున్న శైలేంద్ర దాన్ని పక్కకు తోసేసి మిగిలింది తింటాడు. అది చూసి ధరణి చాలా బాధపడుతుంది. ధరణి బాధను, శైలేంద్ర ప్రవర్తను వసుధార గమనిస్తుంది. తర్వాత వంటింట్లో సార్ నీకోసం ఏం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు అని ధరణిని వసు అడిగితే కన్నీళ్లు అంటుంది. ఏంటీ అని మళ్లీ అడిగితే ఏం లేదు అని శైలేంద్ర చేయి తుడుచుకోవడానికి టవల్ తీసుకెళ్తుంది.

Guppedantha Manasu Serial April 28 2023 Today Full Episode 749

అబద్ధం చెప్పి పంపించి:ఏంటీ నువ్వు స్పెషల్ అనుకుంటే అది స్పెషల్ అయిపోతుందా. దేనిలోనూ నీ ఇష్టాలు నా మీద రుద్దడానికి ట్రై చేయొద్దు అని టవల్ ను ధరణి ముఖం మీద కొట్టి వెళ్లిపోతాడు శైలేంద్ర. ఆ మాటలు కాస్త అస్పష్టంగా వింటుంది వసు. అప్పుడే ధరణి దగ్గరికి వచ్చిన జగతి ఏం అంటున్నాడు శైలేంద్ర. వంటలు బాగున్నాయా అన్నాడా అని అంటే సమాధానం చెప్పలేక అవును అని అంటుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి. జగతి దగ్గరికి వచ్చిన వసు నా ఇష్టాలు వేరు అని ఏదో గట్టిగా అన్నట్లు అనిపించింది మేడమ్ అని అంటే.. ఇంతలో వసుధార అని దేవయాని అరుస్తుంది. జగతి నిన్ను మహేంద్ర పిలుస్తున్నాడు అని అబద్ధం చెప్పి పంపిస్తుంది. వసును గదిలోకి తీసుకెళ్లి.. ఏంటీ నువ్వు. నువ్ నాకు ఇష్టం లేకపోయినా రిషి కోసం ఊరుకున్నాను. మర్యాదగా నా కోడలు, నా కొడుకు విషయంలో కలుగజేసుకోవద్దు. నీకు ఎంత ధైర్యం రోడ్డు మీద నా కొడుకుని అన్ని మాటలు అంటావా అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu Serial April 28 2023 Today Full Episode 749

ఆ రోజు రానివ్వను:మేడమ్ అక్కడ ఆయన తప్పు ఉంది కాబట్టే అన్నాను. ఏంతైనా మీ కొడుకు కదా మేడమ్. మీ బుద్దులే వచ్చినట్లు ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తారు. ఎవరినైనా అడ్డు తప్పిస్తారు అని వసు అంటే ఇంతలో రిషి పిలుస్తాడు. వసు వెళ్లబోతుంటే ఇక్కడ జరిగింది రిషికి చెబుతావా అని దేవయాని అంటుంది. చెప్పేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేదాన్ని. తనంతట తానే నిజం తెలుసుకునే రోజు వస్తుంది అని వసు అంటే ఆ రోజు నేను రానివ్వను కదా వసుధార. నిజంగా ఆరోజు వస్తే మీ అందరి సంగతి అప్పుడే తేల్చేస్తాను. ఎవరినీ వదిలిపెట్టను అని అనుకుంటుంది దేవయాని. వసుధార కోసం రిషి వెతుకుతుంటే శైలేంద్ర వచ్చి.. ఏంటీ నీ కళ్లు ఎవరినో వెతుకుతున్నాయి అని అంటాడు. అదేం లేదని రిషి అంటే పక్కకు తీసుకెళ్లి నీ లవ్ మ్యాటర్ చెప్పు. దాని గురించి కథలు కథలుగా చెబుతున్నారు. మీడియా వాళ్ల ముందు మీ ప్రేమ గురించి చెప్పావట. ఎంత దమ్ముండాలి అలా చెప్పాలంటే అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial April 28 2023 Today Full Episode 749

ప్రేమే అడ్వెంచర్:పరిస్థితులు అలా చేయించాయి అని రిషి అంటాడు. దీనికి లవర్ బాయ్ కాస్తా అండ్వెంచరస్ బాయ్ అయ్యావన్నమాట అని శైలేంద్ర అంటే.. నీలా బ్యాడ్ బాయ్ అయితే తప్పు కానీ, అడ్వెంచరస్ బాయ్ అయితే తప్పేముంది అని రిషి అంటాడు. వేశావ్ గా.. బట్ నువ్వు చాలా మారిపోయావ్. నేను ఫారెన్ వెళ్లినప్పుడు ఉన్న రిషి వేరు. ఇప్పుడు రిషి వేరు. ఇంత మార్పేంటీ. ప్రేమేనా అని శైలేంద్ర అంటాడు. అయి ఉండొచ్చు. నిజానికి లవ్వే అడ్వెంచరస్ అన్నయ్యా. అందులో మన గొప్పకంటే ప్రేమే ఆ తెగింపును ఇస్తుంది అనడం కరెక్ట్. ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చిన ఆ ప్రేమని నిలబెట్టుకోవడమే మన గొప్ప. అదే మన క్యారెక్టర్ ను నిర్ణయిస్తుంది అని రిషి అంటాడు. తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు. అనంతరం వసుధార దగ్గరికి వెళ్తాడు రిషి.

Guppedantha Manasu Serial April 28 2023 Today Full Episode 749

అర్థం చేసుకునేదాకా:మీ అన్నయ్యా అని వసు చెప్పబోతుంటే మా అన్నయ్యా చాలా మంచోడు. తనకు నేనంటే చాలా ఇష్టం. పెద్దమ్మా ఇద్దరిని ఒకేలా పెంచింది అంటూ సంతోషంగా చెబుతాడు. దీంతో వసు ఏం మాట్లాదు. ధరణి దగ్గరికి వెళ్లిన దేవయాని తిడుతూ ఉంటుంది. నా కొడుక్కి నచ్చే భార్యను నేను తీసుకుని రాలేకపోయాను అని అంటుంది. అద విన్న జగతి ఏంటీ అక్కయ్యా. ఏదైనా తప్పు ఉంటే చెప్పాలి. భర్తతో ఎలా మసులుకోవాలో కూతురిలా చెప్పాలి. కానీ అలా బాధపడేలా తిట్టడం ఏంటి అని జగతి అంటుంది. నువ్వు పాఠాలు కాలేజీలో చెప్పుకో నాకు కాదు అని ధరణితో శైలేంద్ర కోసం టీ పెట్టిస్తుంది. ఆ టీని దేవయాని తీసుకెళ్తుంది. ఆ టీ నీతో ఇప్పించొచ్చు కదా. ఏం మనిషో అని జగతి అంటుంది. ఆయన్ని నేను అర్థం చేసుకునేదాగా ఆయనకు అనుగుణంగా నేను మారేదాకా ఇలాగే కానివ్వండి చిన్న అత్తయ్య అని ధరణి అంటుంది. ధరణి అని జగతి బాధగా అంటే.. దుఃఖం ఆపుకోలేక చిన్న అత్తయ్య అంటూ జగతి భుజంపై వాలిపోయి ఏడుస్తుంది. ఊరుకో అంటూ జగతి అంటుంది. ఇలా ఈ సీన్ ఎమోషనల్ గా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X