Guppedantha Manasu: శైలేంద్ర కన్నింగ్ ప్లాన్.. రిషిని తప్పించేందుకు స్కెచ్.. బుక్కయిన ధరణి

ధరణి బాధ ఆపుకోలేక జగతి భుజాలపై పడి ఏడుస్తుంది. శైలేంద్రలో మార్పు రావడానికి ఎదురుచూడు. ధైర్యాన్ని కోల్పోవద్దు అని నచ్చజెప్పి పోతుంది జగతి. నేను ఆయనకు నచ్చినట్లుగా ఉండేందుకు ప్రయత్నిస్తాను అని మనసులో అనుకుంటుంది ధరణి. తర్వాత గదిలో నువ్ చాలా బాగా కవర్ చేస్తున్నావ్ నాన్నా.

ఇలాగే ముందు ముందు కూడా ఉండాలి.మనమీద ఎవరికీ అనుమానం రాకుండా చూసుకోవాలి అని దేవయాని అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 29 శనివారం నాటి తాజా ఎపిసోడ్‌ 750లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial April 29 2023 Today Full Episode 750

రిషి స్థానంలో నువ్వు: టెన్షన్ పడొద్దు మామ్. నన్ను కనిపెట్టడం ఎవరి వల్ల కాదు అని శైలేంద్ర అంటాడు. నాకు ఒక ఆశయం ఉంది నాన్నా. అది తీరాలి. ఆ ఆనందం దక్కాలి. తాతగారు తర్వాత డీబీఎస్టీ కాలేజ్ ఛైర్మన్ స్థానం అయితే మీ నాన్నది కావాలి. లేదా నీది కావాలి. కానీ అలా జరగలేదు. అందరూ కలిసి ఆ స్థానంలో రిషిని కూర్చోబెట్టారు. సరే ఏదో నామమాత్రంగా చూసుకుంటాడులే అని ఓర్చుకున్నాను. కానీ దాన్ని సామ్రాజ్యం చేశాడు. దానికి రిషి చక్రవర్తి అయి కూర్చున్నాడు.

అంతా తనే శాసిస్తున్నాడు. రిషి మాటలకు ఎదురు చెప్పేవాళ్లే లేకుండా పోయారు. చివరికి నా మాటలు కూడా లెక్క చేయడం లేదు. ఇదంతా చూస్తుంటే నా గుండె మండిపోతుంది. కళ్లల్లో కోపం పెట్టుకుని వాళ్ల మీద ప్రేమ నటించడం నా వల్ల కావట్లేదు. అందుకే నువ్వు రిషి స్థానంలో కూర్చోవాలి అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu Serial April 29 2023 Today Full Episode 750

నువ్వు చక్రం తిప్పాలి: నీకు దక్కాల్సినవన్నీ తనకు దక్కకూడదు. నువ్వు డీబీఎస్టీ కాలేజీ ఛైర్మన్ కావాలి. రిషిని తప్పించాలి. అదే నా కోరిక అని శైలేంద్రతో దేవయాని అంటుంది. నీ కోరిక తీరదు మమ్మీ. నేను వెళ్లి ఆ సీట్ లో కూర్చోవడం ఏంటీ సిల్లీగా. వాళ్లంతట వాళ్లే అందరూ కలిసి బతిమిలాడి నన్ను ఆ సీట్ లో కూర్చోబెట్టాలి. నువ్వు ఇలా కోరుకో మమ్మీ జరిగిపోతుంది. నాకు కావాల్సింది ఏదైనా సరే నేను ఎవరినీ అడిగి తీసుకోను.

వాళ్లంతట వాళ్లే నాకు ఇచ్చేలా చేస్తాను అని శైలేంద్ర అంటాడు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేనే అనుకుంటే నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నావ్. ఎలాగైన సరే కాలేజీలో నువ్వు చక్రం తిప్పాలి అని దేవయాని అంటుంది. ఇంతలో అన్నయ్యా అని రిషి పిలుస్తాడు. దీంతో శైలేంద్ర, దేవయాని ఇద్దరు షాక్ అవుతారు.

Guppedantha Manasu Serial April 29 2023 Today Full Episode 750

పాఠాలు చెప్పాలా..: పెద్దమ్మా మీరు ఇక్కడే ఉన్నారా. సరే మీరు మాట్లాడుకోండి అని రిషి అంటాడు. పర్వాలేదు రా అని దేవయాని లోపలికి పిలుస్తుంది. రిషి వచ్చి ఊరికే మాట్లాడదాం అని వచ్చా. అన్నయ్యా ఏంటీ ఫారెన్ సంగతులు అని రిషి అంటాడు. అంతా మాములే. ఇక్కడి కాలేజ్ సంగతులు చెప్పు. కాలేజీని చాలా మార్చేశావట అని శైలేంద్ర అంటాడు.

అన్నయ్యా నువ్వు కాలేజీకి రా. కాలేజీ ఎంతమారిందో నువ్వే గమనించి చెప్పు అని రిషి అంటే.. కాలేజీకి నేనెందుకు. మళ్లీ పాఠాలు నేర్చుకోవాలా.. లేక చెప్పాలా అని శైలేంద్ర అంటాడు. అది మన కాలేజీ. నువ్వు వస్తే బాగుంటుంది. నీ అనుభవం మాకు ఉపయోగపడుతుంది. రేపు ఉదయాన్ని త్వరగా రెడీ అవ్వు. ఇద్దరం కలిసి వెళ్దాం అని రిషి వెళ్లిపోతాడు. దేవయాని, శైలేంద్ర చూసి నవ్వుకుంటారు.

Guppedantha Manasu Serial April 29 2023 Today Full Episode 750

నా మీద డౌట్ వస్తుంది: తర్వాత ధరణి గురించి మాట్లాడుకుంటారు జగతి, వసు. శైలేంద్ర వచ్చినప్పటినుంచి ధరణిలో సంతోషం లేదు. ధరణి శైలేంద్ర మధ్య సక్యత లేదేమో అని జగతి అంటుంది. ఆ మాటలు విన్న శైలేంద్ర.. అంటే వీళ్లు నన్ను గమనిస్తున్నారన్న మాట. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దొరికిపోతాం అని అనుకున్న శైలేంద్ర.. ధరణి.. ధరణి.. అంటూ కిచెన్ లోకి వెళ్తాడు. ఏంటీ ధరణి ఎంత సేపు ఈ పని ఆ పని అంటూ వంట గదిలోనే ఉంటావా.

నీతో మాట్లాడదామంటే సమయమే ఇవ్వట్లేదు. అసలు అగ్రీమెంట్ ఇంకా ఉన్నా ముందుగా ఎందుకు వచ్చానో తెలుసా. నీ కోసమే అని గట్టిగా శైలేంద్ర నాటకం ఆడతాడు. అందుకు ధరణి సంతోషిస్తుంటే.. ఏంటీ పొంగిపోతున్నావ్. అంతా వద్దు. నువ్ ఇలా ఉంటే అందరికీ నా మీద డౌట్ వస్తుంది. పిన్నీ వాళ్లు చూస్తున్నారని ఇలా మాట్లాడుతున్నా. నువ్వు కూడా కాస్తా నవ్వుతూ గ్లో ముఖంతో ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు శైలేంద్ర.

Guppedantha Manasu Serial April 29 2023 Today Full Episode 750

బుక్ చేసిన శైలేంద్ర: కిచెన్ నుంచి బయటకు వచ్చిన శైలేంద్ర.. కావాలనే జగతి, వసు దగ్గర ఆగి మాట్లాడతాడు. ధరణి అసలు నాతో కలుపోలుగా ఉండటం లేదు. ఎప్పుడు వంటింటి కుందేలులాగా ఉంటుంది. అలా ఈ అత్తలకు.. అదే మా మమ్మీకి అలా ఉంటే నచ్చుతుందేమో. నాకు కాదు కదా. ఇదిగో ఈ వసుధారలా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది.

వసుధార నువ్వైన తనను నీలా ఉండమని చెప్పొచ్చుగా అని శైలేంద్ర అని అంటాడు. ఇందులో తన తప్పేం లేదు. ధరణియే సరిగా తనతో ఉండట్లేదని వాళ్ల ముందు బుక్ ధరణిని బుక్ చేస్తాడు శైలేంద్ర. ఇక రాత్రి పడుకునేముందుక రిషి, వసుధారలు మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. రొమాంటిక్ గా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు.

ధరణి బాధపడుతుంది: వసు మెసేజ్ చేసుకుంటూ బయటకు వస్తే అది చూస్తుంది జగతి. ఏంటీ సంగతి ఇంకా పడుకోలేదా అని ఆటపట్టిస్తుంది జగతి. అప్పుడే వాళ్ల కళ్ల ముందు నుంచి ధరణి దిండు, దుప్పటి, చాప పట్టుకుని గదిలోంచి బయటకు వస్తుంది.

అది చూసి జగతి, వసుధార షాక్ అవుతారు. ధరణిని వసుధార అడగబోయేందుకు వెళ్తుంటే జగతి ఆపుతుంది. ఇప్పుడు వద్దు. మనం గమనిస్తున్నామని తెలిస్తే ధరణి బాధపడుతుంది అని జగతి అంటే.. బాధపడుతుంది కదా అని అలా వదిలేయలేం కదా మేడమ్ అని వసుధార అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X