Guppedantha Manasu: రిషిధార బంధంపై జయచంద్రకు డౌట్.. పరీక్ష పెట్టకని సలహా.. భార్య గదిలోకి భర్త
ఆధునిక ఆధ్యాత్మిక గురువు జయచంద్రకు రిషి వాళ్ల ఇంట్లో వసతులు ఏర్పాటు చేస్తారు. వసుధరా గదిని అతనికి ఇస్తారు. అయితే అక్కడ వసుధార చున్నీ చూసి ఇందులో ఇంతకుముందు ఎవరైనా ఆడవాళ్లు ఉన్నారా అని రిషిని అడుగుతాడు జయచంద్ర. దీంతో వసుధార అన్న రిషి ఆ చున్నీను తీసేయ్ అన్నట్లుగా చూస్తాడు. వసుధార వెళ్లి ఆ చున్నీని తీసి చేత్తో పట్టుకుంటుంది.
సార్ ఇది అతిథి గది. మీరు మీకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెబుతాడు రిషి. ఇక భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారా.. లేక రూమ్ కే ఫుడ్ పంపించాలా సార్ అని అడుగుతాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 3 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 727లో ఇంకా ఏం జరిగిందంటే?

మౌనంగా ఉండటంతో..
రిషి భోజనం డైనింగ్ టేబుల్ గురించి అడిగితే.. మీకు ఏది బాగుంటుందని అనిపిస్తుంది అని జయచంద్ర అడుగుతాడు. మాతో కలిసి తింటే బాగుంటుంది సార్ అని రిషి అంటాడు. అయితే సరే నేను వస్తాను అని జయంచంద్ర చెబుతాడు. తర్వాత అంతా కలిసి భోజనం చేస్తుంటారు. అప్పుడే ధరణి భర్త గురించి ఆరా తీస్తాడు జయచంద్ర. అగ్రిమెంట్ కారణంగా వేరే దేశంలో ఉన్నారు అని చెబుతుంది ధరణి.
అమ్మా వసుధార నువ్వు వెళ్లి నీ భర్తనే పక్కనే కూర్చుని తినమ్మా అని జయచంద్ర అంటే దేవయాని రగిలిపోతుంది. వసు వెళ్లి రిషి పక్కనే కూర్చుని తింటు ఉంటుంది. ఇద్దరు మౌనంగా మాట్లాడుకోకుండా తింటుంటే.. తదేకంగా గమనిస్తూ ఉంటాడు జయచంద్ర. సార్ ఇది వేసుకోండి అది వేసుకోండి అని జయచంద్రకు అనుమానం రాకుండా కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది వసుధార.

అసలు వీళ్లు అంటూ..
వసుధార పదే పదే సార్ అని పిలవడంతో.. భర్తని సార్ అని పిలుస్తున్నావేంటమ్మా అని అడుగుతాడు జయచంద్ర. పెళ్లికి ముందు అలా పిలవడం అలవాటు అయిపోయిందండి అని వసుధార అంటుంది. మీది రిజిస్టర్ మ్యారేజా.. కాస్తా రిజర్వ్ గా కనిపిస్తున్నారు. లేక అందరిలానే పది మంది ముందు పెళ్లి చేసుకున్నారా అని జయచంద్ర అంటాడు.
అది అసలు వీళ్లు అంటూ దేవయాని ఏదో చెప్పబోతుంటే రిషి అడ్డుపడతాడు. ఇంట్లో సమస్యలు బయటకు చెప్పడం అవసరమా అంటూ. దీంతో దేవయాని ఆగిపోతుంది. తర్వాత ఇది వేసుకోండి. అది వేసుకోండి అంటూ మాట మార్చే ప్రయత్నం చేస్తారు. ఇక భోజనం తర్వాత జయచంద్ర గదికి మంచినీళ్లు పట్టుకుని వెళ్తుంది వసుధార.

ఇబ్బందులు వచ్చినా విడిపోకండి..
వసుధార మీకు పెళ్లి జరిగి ఎన్నేళ్లు అవుతుందమ్మా. మీది ప్రేమ పెళ్లా. మీ ఇద్దరి కళ్లలో ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందమ్మా. నీది మంచి మనసు. పరిస్థితుల్ని చాలా బాగా అర్థం చేసుకుంటావ్. నీకు నచ్చిన పని ఎంత కష్టమైన చేస్తావ్. ప్రేమ కోసం ఎవరినైనా ఎదిరిస్తావ్. మాట మీద నిలబడతావ్. మీ మధ్య ఏదో దూరం ఉన్నట్లుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ దూరం ఉండకూడదు.
నీ కళ్లల్లో ప్రేమ ఒక్కటే కాదు. బాధకూడా కనిపిస్తుంది. అదంతా నీ భర్త కోసమే. మీ జంట చూడముచ్చటగా ఉంది. ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చిన విడిపోకండి అని జయచంద్ర అంటాడు. గురువుగారు మీ ఆశీర్వాదం ఫలించాలి. నన్ను ఆశీర్వదించండి అని వసుధార జయచంద్ర కాళ్లమీద పడుతుంది. ఇక వసుధార వెళ్తుంటే గుమ్మం దగ్గర రిషి ఎదురవుతాడు. రిషి కళ్లల్లోకి సూటిగా చూసి వెళ్లిపోతుంది వసుధార.

నీ మీద ఎనలేని ప్రేమ..
సార్ సౌకర్యాలన్ని బాగానే ఉన్నాయ కదా అని రిషి అడిగితే అంతా బాగుంది అని జయచంద్ర అంటాడు. దీంతో సరే సార్ గుడ్ నైట్ అని రిషి వెళ్లబోతుంటే.. ఏదో అడగాలని వచ్చి వెళ్లిపోతున్నావ్ ఎందుకు.. రా కూర్చో అని జయచంద్ర అంటాడు. మనసు చాలా విచిత్రమైనది రిషి. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు తప్పుదోవలో నడిచేలా చేస్తాయి. మనల్ని ఇరకాటంలో పెట్టేస్తాయి.
నువ్వు చాలా అదృష్టవంతుడివి. సీతలాంటి భార్య నీకు దొరికింది. అలా అని తనకు ప్రేమ పరీక్ష పెట్టకు. తనకు నీ మీద ఎనలేని ప్రేమ ఉంది. నువ్వంటే ప్రాణం. నీకోసమే బతుకుతుంది. యంగ్ మ్యాన్.. మీరు ఇద్దరు కాదు. ఒక్కరే. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పరిస్థితులకు తల వంచకూడదు. సరేనా అని జయచంద్ర చెబుతాడు.

బంధం మీద అనుమానం..
సరే సార్.. మీకు ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. తర్వాత ధరణి రూమ్ లో ఉన్న వసధార దగ్గరకు వెళ్తాడు రిషి. కిచెన్ లో ధరణి ఉండటం చూస్తాడు. వసుధార పక్క సర్దుతుంటే హేయ్ పొగరు అని పిలుస్తాడు రిషి. దీంతో షాక్ అయిన వసుధార.. ఈ టైమ్ లో మీరేంటి సార్ అని అంటుంది. ఏం రాకూడదా.
థ్యాంక్స్ వసుధార. నీకు నా మీద ప్రేమ అనంతం. అందరికీ స్ఫష్టంగా కనిపించేస్తుంది అంటూ జయచంద్ర అన్న మాటలన్నీ చెబుతాడు రిషి. వసుధారను అడిగిన ప్రశ్నల గురించి చెబుతుంది. మన బంధం మీద ఆయనకు అనుమానం వచ్చినట్లే ఉంది అని వసుధార అంటుంది. అలా ఏం కాదులే. గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్లిపోతాడు రిషి. తర్వాత వసు మాటలు, జయచంద్ర మాటల గురించి ఆలోచిస్తూ.. నిజంగానే మా బంధం మీద అనుమానం వచ్చి నిలదీస్తే ఎలా అని అనుకుంటాడు.
వసుధార దగ్గరికి రిషి..
అనుమానం రాకూడదు అని తన రూమ్ బయటకు వెళ్లి తలుపు పెట్టి వెళ్లబోతుంటే మహేంద్ర ఎదురవుతాడు. ఎక్కడికీ రిషి అని మహేంద్ర అడిగితే.. ఇక్కడికే డాడ్ గుడ్ నైట్ అని అంటాడు రిషి. అడిగితే గుడ్ నైట్ అంటావ్ ఏంటీ అని మహేంద్ర అంటే. ఇప్పుడు మీకు అదే చెప్పాలి డాడ్ అని ధరణి గదికి వెళ్తాడు రిషి. ఇంతలో జగతి వస్తే రిషి సమాధానం చెప్పకుండా అటు వెళ్తున్నాడు అని మహేంద్ర చెబుతాడు.
ఆ గదిలో వసుధారు ఉందిగా ఏదైనా మాట్లాడాతాడేమో అని జగతి క్లారిటీ ఇస్తుంది. హో ఓకే ఓకే అని మహేంద్ర కూల్ గా నవ్వుకుంటూ వెళ్తాడు. వసుధార లోపల వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రిషి రాగానే ఏంటీ సర్ మళ్లీ వచ్చారు అని అడుగుతుంది. ఏం మళ్లీ రాకుడదా అని రిషి అంటాడు.


Click it and Unblock the Notifications











