Guppedantha Manasu: జయచంద్రకు మొత్తం చెప్పేసిన జగతి.. వణికిపోయిన దేవయాని.. ఆ పిలుపు మారేనా?

ఆధ్యాత్మిక గురువు జయచంద్రకు అనుమానం రాకూడదని వసుధార ఉన్న ధరణి గదిలోకి వెళ్తాడు రిషి. ఏంటీ సార్ మళ్లీ వచ్చారని వసుధార అడుగుతుంది. ఏం రాకూడదా. కారణాలు చెబితే కానీ లోపలికి రానివ్వవా అని అంటాడు రిషి. మళ్లీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారా సార్ అని వసు అంటే రెండోసారి థాంక్స్ చెప్పించుకునే అలవాటు నీకేమైనా ఉందా అని అంటాడు.

దీంతో ఎందుకు వచ్చారో చెప్పట్లేదు ఏంటీ అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 4 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 728లో ఇంకా ఏం జరిగిందంటే?

బయటకు వెళ్లమంటావా..

బయటకు వెళ్లమంటావా..

వసుధార దగ్గరకి వెళ్తాడు రిషి. ముద్దు పెట్టడానికే వస్తున్నట్లు అనుకున్న వసుధార కళ్లు మూసుకుని వెనక్కి వెనక్కి జరుగుతుంది. రిషి కాస్తా దగ్గర్లో ఉన్న పిల్లో దుప్పటి తీసుకుంటాడు. వీటికోసమా అని వసుధార అంటుంది. మరి నువ్వు దేనికోసం అనుకున్నావ్ అని రిషి అంటాడు. ఇంతలో ధరణీ అక్కడికి వచ్చి రిషి ఇక్కడే నిద్రపోతావా.

మేము బయటకు వెళ్లమా అని అంటుంది. లేదు వదినా.. నా రూమ్ లో ఏసీ బాగా పనిచేయట్లేదు. నేను పైన టెర్రస్ పై పడుకుంటాను అని రిషి అంటాడు. చలి పెడుతుందేమో రిషి అని ధరణి అంటుంది. చల్లగాలి కోసమే వెళ్తున్నా అని వసుధార వైపు చూసి వెళ్లిపోతాడు రిషి. పిల్లో, దుప్పటి తీసుకుని రిషి వెళ్లడాన్ని మహేంద్ర, జగతి చాటుగా చూస్తారు.

సమస్య పెద్దది కాకూడదు..

సమస్య పెద్దది కాకూడదు..

ఇప్పుడు అర్థమైందా. జయచంద్రగారికి వాళ్ల బంధం మీద అనుమానం రాకుండా చేయడానికి రిషి అలా చేస్తున్నాడు అని మహేంద్రతో జగతి అంటుంది. తర్వాత రిషి చందమామలో వసుధారను చూసుకుంటూ నిద్రపోతాడు. ఇంతలో అక్కడికి వసుధార వచ్చి.. చున్నీతో గాలి విసురుతుంది. రిషికి మెలకువ వచ్చి... లేచి కూర్చుంటాడు.

కాసేపు ఇద్దరు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటారు. జయచంద్ర గారిని భ్రమపెట్టేందుకే కదా సార్ మీరు ఇక్కడ పడుకున్నది అని వసుధార అంటే.. నాకు భ్రమలు పెట్టడం ఇష్టం ఉండదు వసుధార. సమస్య ఇంకా పెద్దది కాకూడదు అని ఆలోచిస్తాను అంతే అని రిషి అంటాడు. కాసేపటికి వసుధార వెళ్లిపోతుంది. రిషి అక్కడే నిద్ర పోతాడు.

కష్టాలను ఎదురించాలి..

కష్టాలను ఎదురించాలి..

తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే జయచంద్ర ధ్యానం చేస్తుంటే వసుధార కాఫీ పట్టుకుని వస్తుంది. రిషి కూడా నార్మల్ గా వస్తాడు. ధ్యానం నుంచి బయటకు రాగానే గుడ్ మార్నింగ్ అని ఒకరికొకరు చెప్పుకుంటారు. అభిప్రాయాలు వేరైనా.. మనసు ఒకటి అయితే చాలు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. తగ్గాలి. పరిస్థితులతో ఎదురైన కష్టాలను కలిసి ఎదిరించాలి. బాధైనా ప్రేమ అయినా ఇద్దరు సమానంగా పంచుకోవాలి.

పంతం పట్టింపులకు పోకూడదు. స్వభావాలు జీవితాలను శాసించకూడదు అని వసుధార, రిషికి ఇద్దరికి అర్థం అయ్యేలా నీతి చెబుతాడు జయచంద్ర. మరోవైపు దేవయాని పొగరు చూడలేని ధరణి ఒక ఐడియా వేస్తుంది.

అతడివైపు చూడకుండా..

అతడివైపు చూడకుండా..

అత్తయ్యగారు.. జయచంద్రగారికి ధ్యాననేత్రం ఉందట. దానిలో ఆయనకు అన్ని నిజాలు తెలిసిపోతాయి అంట. అలా తెలుసుకున్న ఆయన చెడు, అన్యాయాన్ని కాల్చి బూడిద చేయగలరట అని లేనిపోనివి అన్ని దేవయానికి చెబుతుంది ధరణి. ఇక దేవయాని చేసే పనుల గురించి తెలిసిందే కాబట్టి బాగా భయపడుతుంది.

కనీసం జయచంద్ర పక్కకే వచ్చినా.. అతడివైపు చూడకుండా బిక్క ముఖం వేసి భయపడుతూ ఉంటుంది దేవయాని. రిషి వచ్చి పెద్దమ్మా ఏమైంది. అలా డల్ గా ఉన్నారేంటీ అని అడుగుతాడు. ఏం లేదు నాన్నా అని దేవయాని అంటుంది. ఇక జయచంద్రను కారులో తీసుకెళ్తారు రిషి, వసుధార. ముగ్గురు కారులో బయలుదేరతారు.

పిలుపు మారుతుంది..

పిలుపు మారుతుంది..

వసుధార మాటల్లో పదే పదే రిషిని సార్ సార్ అని అనడంతో జయచంద్ర గమనించి.. సార్ అని పిలవడం నీ అలవాటని చెప్పావ్. కానీ అదే పిలుపు సరి కాదు వసుధార. పిలుపు బంధాన్ని బలపరుస్తుంది. ఇప్పటికైనా ఆ పిలుపు మార్చే ప్రయత్నం చేయమ్మా అని జయచంద్ర అంటాడు.

దీంతో వసుధార మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు మారిపోతుంది సార్.. నెక్ట్స్ టైమ్ మీరు చూసేసరికి పిలుపు మారుతుంది. మీరే చూడండి అని నవ్వు తెచ్చుకుంటూ అంటాడు రిషి. దీంతో వెంటనే రిషి చేతి మీద చేయి వేసి.. నిజంగానా అని వసుధార అడుగుతుంది. అవును అన్నట్లుగా కళ్లతో సైగ చేస్తాడు రిషి. దాంతో వసుధార తెగ సంతోషపడుతుంది.

మంచోళ్లు.. కలవలేకపోతున్నారు..

ఇక కాలేజీలో జయచంద్ర ఓ చోట కూర్చుని ఏవో రాతలు రాసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి జగతి వెళ్తుంది. రండమ్మా అంటాడు జయచంద్ర. ఇది ఒక తల్లి ఆవేదన అనుకుంటారో.. లేక ఓ గురువు తాపత్రయం అనుకుంటారో. మీరు రెండు జీవితాల మధ్య బంధాన్ని నిలబెట్టాలి. సాంప్రదాయబద్ధమైన సంఘమం జరపాలి. ఇద్దరూ సంతోషంగా ఉండేలా చూడాలి అని జగతి అంటుంది.

కూర్చుని వివరంగా చెప్పండి పర్వాలేదు నేను వింటానమ్మా.. కూర్చోండి అని జయచంద్ర అంటాడు. ఈ కాలేజీ ఎండీ రిషి నా కొడుకు అని మీకు తెలుసు కదా సార్. అలాగే వసుధార, వాళ్లిద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ చాలా మంచివాళ్లు. ఎదుటివారని చాలా అర్థం చేసుకునే రకం. కానీ ఇద్దరూ కలవలేకపోతున్నారు అని మొత్తం చెప్పే ప్రయత్నంలో ఉంటుంది జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X