Guppedantha Manasu: ఎట్టకేలకు ఒక్కటైన రిషిధార.. షాక్ లో మహేంద్ర-జగతి, ఏడ్చేసిన వసు
ఆధ్యాత్మిక, ఆధునిక గురువు జయచంద్రకు రిషి, వసుధార గురించి మొత్తం చెప్పేస్తుంది జగతి. వాళ్లను ఎలాగైనా మీరే కలపాలి అని చెబుతుంది. అలాగే అంటాడు జయచంద్ర. తర్వాత చర్చాగోష్టీ కార్యక్రమంలో వసుధార పెళ్లి టాపిక్ వస్తుంది. అప్పుడు వసుధార చేసింది కరెక్టా.. రిషి చెప్పింది కరెక్టా అని ఓటింగ్ పెడతాడు జయచంద్ర. వాళ్ల పేర్లలోని మొదటి అక్షరాన్ని రాసి బౌల్ లో వేయమని చెబుతాడు.
రిషి, వసుధారలకు కూడా ఓటు వేసే ఛాన్స్ ఇస్తాడు జయచంద్ర. దీంతో రిషి, వసుధారలు ఇద్దరూ ఆలోచనలో పడిపోతారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 6 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 730లో ఇంకా ఏం జరిగిందంటే?

అభిప్రాయాన్ని తెలిపే:వసుధార చేసింది తప్పు ఎలా అవుతుంది. ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని రిషి అనుకుంటాడు. రిషి సార్ అంత బాధపడటానికి కారణం నేనే కదా.. రిషి సార్ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడుతారు కదా. నేను మెడలో తాళి వేసుకోవడం నిజమే కానీ, పెళ్లి అంటే రిషి సార్ చెప్పినట్లు స్త్రీ పురుషులు ఇద్దరూ ఉండాలి.
రిషి సార్ చెప్పింది కరెక్ట్ అని వసుధార అనుకుంటుంది. తర్వాత అందరూ తాము సపోర్ట్ చేసేవాళ్ల పేర్లు రాసిన చిట్టీలను జయచంద్ర ముందు ఉన్న బౌల్ లో వేస్తారు. రిషి, వసుధారలు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపే చిట్టీలను బౌల్ లో వేయబోతుంటే వారిని ఒక్క నిమిషం ఆగమని చెబుతాడు జయచంద్ర.
వసుధార ఓటు ఎవరికంటే:ఓటింగ్ జరిగేది మీ ఇద్దరి కోసమే కాబట్టి.. మీ ఇద్దరి ఓట్లు నాకు ఇవ్వండి అని జయచంద్ర అడుగుతాడు. దీంతో రిషి, వసుధార తమ చిట్టీలను జయచంద్రకు ఇస్తారు. వాటిని చూడకుండా తన జేబులో పెట్టుకుంటాడు జయచంద్ర. తర్వాత వచ్చిన ఓట్లను లెక్కపెడతాడు జయచంద్ర. అయితే వసుధార, రిషికి ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తాయి.
దీంతో ఇంకా ఓటింగ్ పూర్తి కాలేదు. రిషి, వసుధార అభిప్రాయలను లెక్కలోకి తీసుకోవాలి కదా అని జేబులో ఉన్న చిట్టీలు బయటకు తీస్తాడు జయచంద్ర. అందులో రిషి చిట్టీ తీసి తను ఏం రాశాడంటే అని అంటూ వీ అని చెబుతాడు. అంటే వసుధార అభిప్రాయానికి రిషి ఓటు వేశాడు అని జయచంద్ర చెప్పడంతో మహేంద్ర, జగతి ఇద్దరూ షాక్ అవుతారు. వసుధార కూడా షాక్ లో ఉంటుంది. అప్పుడు వసుధార ఓటు ఎవరికో చూద్దాం అని జయచంద్ర అంటాడు.

అంతకన్నా ఆశ్చర్యం ఇది: ఈ ఓటు కనుక వసుధార తనకు తాను వేసుకుంటే తన నిర్ణయమే కరెక్ట్. రిషిదే తప్పు అవుతుంది అంటూ చిట్టీ ఓపేన్ చేస్తాడు జయచంద్ర. వసుధార రిషికి ఓటు వేసింది అని జయచంద్ర చెప్పడంతో రిషి షాక్ అవుతాడు. వీళ్లిద్దరిని సమర్ధించేవారు, విమర్శించేవారి ఓట్లు సరిసమానంగా రావడం ఆశ్చర్యం అయితే.. వీళ్లిద్దరి ఒకరికి ఒకరు ఓటు వేసుకోవడం అంతకన్నా ఆశ్చర్యమైన విషయం.
ఇందాక వీళ్లిద్దరు వారి అభిప్రాయాపై బలంగా నిలబడ్డారు. చక్కటి వివరణలు కూడా చెప్పారు. కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్లు అనుకున్నది కాదు అని ఎదుటివాళ్లకు ఎలా ఓటు వేశారు. కారణం నన్ను చెప్పమంటారా అంటాడు జయచంద్ర. రిషి, వసుధార ఇద్దరూ అలాగే షాక్ లో ఉండిపోతారు.
ఇద్దరూ సమానమే అని: వీళ్లిద్దరికి ఒకరి అభిప్రాయం మీద మరొకరికి అమితమైన గౌరవం ఉంది. కానీ నేను చెప్పిందే కరెక్ట్ అనే చిన్నపాటి భేదాభిప్రాయం ఇద్దరికీ ఉండిపోవడంతో.. ఎదుటివారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఎదుటి వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్లు చేసింది కూడా కరెక్టే అని అర్థం చేసుకున్నారు. దట్స్ ఇట్.. నేను చెప్పేది కూడా అదే. జీవితంలో ఆవేశంగానో, అనాలోచితంగానో నిర్ణయం తీసుకోవద్దు.
అది సరైంది కాదు. అదే సరైందని అనుకోవద్దు. ఒక్క క్షణం ఆగి ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తేనే ఇద్దరూ సమానమే అని తెలుస్తుంది అని జయచంద్ర అంటాడు. చూశావా మహేంద్ర. ఇది వాళ్ల ప్రేమ. ఇన్ని రోజులు ఒకరి మీద ఒకరు గెలవాలనుకున్నారు. ఇప్పుడు ఒకరిని మరొకరు గెలిపించుకున్నారు అని జగతి సంతోషంగా అంటుంది.

బాధను గుర్తించలేకపోయాను: అవును జగతీ అని మహేంద్ర కూడా సంబరపడిపోతాడు. తర్వాత అక్కడి నుంచి జయచంద్రతో పాటు అంతా వెళ్లిపోతారు. జయచంద్ర మాటలను గుర్తు చేసుకుంటూ అక్కడే నిలబడిపోతారు వసుధార, రిషి. ఒకరివైపు ఒకరు తిరుగుతారు. చాలా ఆవేదనగా ఒకరివైపు ఒకరు నడిచి కళ్లల్లోకి చూసకుంటూ గట్టిగా హగ్ చేసుకుంటారు. వసుధార ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
నిన్ను అర్థం చేసుకోలేకపోయాను వసుధార. నీ ప్రేమను గుర్తించలేకపోయాను అని రిషి మనసులో అనుకుంటాడు. ఐయామ్ సారీ సార్.. నేను ఎప్పుడూ మీ వైపు నుంచి ఆలోచించలేకపోయాను. మీ మనసులో ఉన్న బాధను గుర్తించలేకపోయాను అని వసుధార అనుకుంటూ ఏడుస్తుంది. అప్పుడే చప్పట్లు కొట్టిన చప్పుడు వినిపించి ఉలిక్కిపడాతరు రిషిధార.
ఆ బాధ్యత కూడా మీదే: వెనుక నుంచి జయచంద్ర చప్పట్లు కొడుతుంటే జగతి, మహేంద్ర నవ్వుతూ సంతోషంగా చూస్తూ ఉంటారు. వాళ్లదగ్గరికి వెళ్లి.. మీరిద్దరూ ఒకరు లేకపోతే ఒకరు బతకలేరు. ఈ విషయం మీకు కూడా తెలుసు. మీ బంధాన్ని మీరు వదులుకోవద్దు. ఇప్పుడు మీ మనసు ఏంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ ప్రేమను నిలబెట్టుకునే బాధ్యత కూడా మీదే అని జయచంద్ర అంటాడు.
అది రిషి సార్ చేతుల్లోనే ఉంది. సార్ మన బంధం వివాహ బంధం అని మీరు భావిస్తేనే ఈ తాళి నా మెడలో ఉంటుంది అని వసుధార అంటుంది. దీంతో రిషికి ఆలోచించుకోడానికి సమయం ఇస్తారు. తర్వాత జయచంద్రకు వీడ్కోలు పలికి సాగనంపుతారు.


Click it and Unblock the Notifications











