Guppedantha Manasu: రిషికి బుక్కైన దేవయాని.. నిలదీసిన ఫణీంద్ర.. కన్నీళ్లతో జగతి!

కాలేజీకి వచ్చిన ఆధ్యాత్మిక, ఆధునిక గురువు జయచంద్ర కార్యక్రమం ముగియడంతో వీడ్కోలు పలికి వెళ్లిపోతారు. జయచంద్ర మాటలు, కాలేజీలో ఓటింగ్ గురించి ఒకచోట కూర్చుని ఆలోచించిస్తుంటాడు రిషి. వసుధారను బాధ పెట్టడం పద్ధతి కాదు. మా మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకాలి. ఎస్ నేను వసుధారని నా భార్యగా అంగీకరిస్తున్నాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు వసుధార కూడా కాలేజీలో జరిగిన విషయాలను తలుచుకుంటూ ఉంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 7 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 731లో ఇంకా ఏం జరిగిందంటే?

నా మాటలు వ్యతిరేకించారు..: కాలేజీలో నా మాటలను వ్యతిరేకించారు. ఆ తర్వాత నా నిర్ణయానికి ఓటేశారు. నేను కూడా అలాగే చేశాను. ఇప్పుడు ఈ తాళిని తీసేసి మళ్లీ పెళ్లి చేసుకోవాలా. ఇది మీకు అడ్డం కాకూడదు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటుంది వసుధార. మరోవైపు రిషి, వసుధార పెళ్లి గురించి దేవయాని, జగతి మధ్య డిస్కషన్ జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు చెప్పినా వసుధారది అసలు పెళ్లే కాదు అని దేవయాని అంటుంది. అదేంటి అక్కయ్య తన భర్తగా ఊహించుకుని తాళి వేసుకుంది కదా అని జగతి చెబుతుంది. ఎవరు పడితే వాళ్లు ఎవర్ని పడితే వాళ్లను ఊహించుకుని మెడలో తాళి వేసుకుంటే పెళ్లి అయిపోయినట్లేనా. అసలు నేను దీనికి అంగీకరించను అని దేవయాని తెగేసి చెబుతుంది.

Guppedantha Manasu

తాళిని ఏం చేయొద్దు..: దేవయాని అంగీకరించను అని అనడంతో అంగీకరించాల్సింది మీరు కాదు.. నేను అని జగతి అంటుంది. రిషి నా మాటే వింటాడు. త్వరలోనే దాని మెడలో తాళి తెగే రోజు వస్తుంది అని దేవయాని అంటుంది. నిద్రపోతున్న వసుధార.. వద్దు మేడం నా తాళిని ఏం చేయొద్దని అరుస్తుంటుంది. అంటే ఇదంతా ఇప్పటి దాకా వసుధార నిద్రలో కల కన్నదని అర్థం అవుతుంది. తర్వాత వసుధార నిద్రలోనుంచి తేరుకుంటుంది. తర్వాత అందరూ ఏదోదో అంటున్నారు. జయచంద్ర గారు ఎందుకు వచ్చారో.. కానీ నాకు ప్రశాంతత లేకుండా చేశారు. ఆ పెద్దమనిషి వీళ్ల పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడారో వీళ్లు ఏం విన్నారో. నాకేం అర్థం కావడం లేదు అని దేవయాని అనుకుంటూ ఉంటుంది.

భర్తగా ఊహించుకుని..: ఈ విషయంలో రిషి ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఈ ఇంట్లో ఇకపై ఏం జరుగుతుందో. రిషి తన పంతం పక్కన పెట్టి వసుధారతో పెళ్లి పీటలెక్కితే నా పరిస్థితి ఏంటి. రిషి వసుధారను భార్యగా అంగీకరిస్తేనాపై పెత్తనం చెలాయిస్తుంది. అమ్మో ఆ ఆలోచనే భరించలేకుండా ఉంది. రిషి కూడా నాకు ఏం చెప్పలేదు. జగతిని అడిగితే చెప్పదు. ఇంకెవర్నీ అడగాలి. వసుధారను రెచ్చగొట్టి విషయం తెలుసుకోవాలి. వాళ్లిద్దరూ ఒక్కటి కాకుండా చేయాలి అని మనసులో అనుకుంటుంది దేవయాని. మరోవైపు వసుధార గురించి రిషి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార తన మెడలో తాళి వేసుకోడవంలో తప్పు లేదు. నన్ను భర్తగా ఊహంచి వేసుకున్న తాళి అలాగే ఉండాలి అని రిషి అనుకుంటాడు.

Guppedantha Manasu

నీకోసమే చూస్తున్నాను..: వసుధార గురించి రిషి ఆలోచిస్తున్న సమయంలోనే వసుధార రూమ్ కి దేవయాని వెళ్తుంది. వసుధార బాత్రూమ్ లో ఉంటుంది. అక్కడ వసుధార తాళి తెగిపోయి కనిపిస్తుంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఎలాగైనా వసుధారతో ఆడుకోవాలి అని దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు ఈరోజు మన మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకబోతున్నాను. నీతో చాలా చెప్పాలి. నీతో చాలా మాట్లాడాలి. నీకు సారీ చెప్పాలి. నా దగ్గర ఎలాంటి ప్రశ్నలు లేవు. అన్నింటికి సమాధానాలు దొరికాయి. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని రిషి అనుకుంటాడు. ఇంతలో అక్కడకు దేవయాని రావడంతో వసుధార అనుకుని రా వసుధార నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటాడు రిషి.

నా పంతం పక్కన పెట్టి..:అప్పుడు దేవయాని ఏం మాట్లాడకుండా తాళిని అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది. అక్కడ వసుధార లేకపోవడంతో ఆ తాళిని చూసి షాక్ అవుతాడు రిషి. మరోవైపు వసుధార ప్రెష్ అయి మొబైల్ కోసం గది మొత్తం వెతుకుతూ ఉంటుది. అప్పుడు రిషి హాల్లో వసుధార అని గట్టిగా పిలవడంతో అందరూ అక్కడికి వస్తారు. ఏదో మంచి వార్త చెప్తారని అనుకున్నాను. ఇదేంటి సార్ గట్టిగా అరుస్తున్నారు అనుకుంటుంది వసుధార. నీ నిర్ణయం కరెక్టే అని అని నేను అనుకున్నాను. కానీ నువ్వు దాన్ని తుడిచేశావ్ అనడంతో అందరూ షాక్ అవుతారు. నా పంతం పక్కన పెట్టి నీ ప్రేమకు విలువ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ నువ్వు నీ పొగరు చూపించావ్. మన ప్రేమకి అడ్డుగా ఉన్న దూరాన్ని తగ్గించాలని అనుకున్నాను. కానీ నువ్వు ఆ దూరాన్ని మరింత పెంచావ్ అని రిషి అంటాడు. ఇప్పుడు నేనేం చేశాను సార్ అని వసుధార అంటుంది. అప్పుడు తన చేతిలో ఉన్న తాళిని చూపించడంతో అంతా షాక్ అవుతారు.

నీ గదిలో ఉండాలి కదా..: ఇదేంటి నాకోసం వేసుకుని తాళిని ఎందుకు తెంచావ్. ఆడది మెడలో నుంచి తాళి తీసేసింది అంటే అర్థం ఏంటి నువ్వు నన్ను భర్తగా అంగీకరించనప్పుడు నేను బతికుండగానే ఎందుకు తాళి తీసేసావు. చెప్పు వసుధార నామీద నమ్మకం పోయందా. లేకపోతే మన బంధానికి ముగింపు పలకాలనుకున్నావా అంటాడు రిషి. ఏం జరిగిందో తెలియకుండా ఏంటీ సార్ ఇదంతా. మీరు చెప్పేంతవరకు నా మెడలో తాళి లేదనే విషయమే నాకు తెలియదు. రాత్రి ఏదో పీడకల వచ్చింది. ఆ పెనుగులాటలో తెగిపడిపోయి ఉండొచ్చు అని వసుధార అంటే.. మరి తాళి తెగిపోతే నీ గదిలో ఉండాలి కదా నా గదిలోకి ఎందుకు వచ్చింది అని రిషి అడుగుతాడు. నాకు తెలియదు అన వసుధార అంటుంది. వచ్చావ్. తన అడుగుల చప్పుడు నేను విన్నాను అని రిషి అంటాడు.

ఇకనైనా నిర్ణయించుకోండి..: దేవయాని ఇందాక నువ్వు రిషి గదికి వెళ్లావ్ కదా అని ఫణీంద్ర అనడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజం చెప్పమని దేవయానిని నిలదీయడంతో అక్కడ తాళి తనే పెట్టినట్లు ఒప్పుకుంటుంది. రిషికి ఇచ్చి ఆ తాళి వేయిస్తే మనస్ఫూర్తిగా ఉంటుందేమో అని అలా చేశాను అని కవర్ చేస్తుంది దేవయాని. ఇంత చిన్న విషయంలో ఎంత అపార్థం చేసుకున్నారు అని వసుధార అంటుంది. దీంతో వెంటనే వసుధార చేతులు పట్టుకున్న రిషి ఇది అపార్థం కాదు. బాధ. నువ్వు ఎక్కడ దూరమైపోతావో అన్న ఆవేదన అని రిషి అంటాడు. జగతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇకనుంచి విభేదించుకోకండి. మీ భవిష్యత్తు ఏంటీ అనేది నిర్ణయించుకోండి అని జగతి చెబుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X