Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. దేవయానికి రిషి భారీ షాక్.. సంతోషంలో భూషణ్ ఫ్యామిలీ!
ఇకనైన ఒకరినొకరు విభేదించుకోవద్దు. భవిష్యత్ గురించి ఓ నిర్ణయం తీసుకోండి అని జగతి అంటుంది. మా భవిష్యత్ రిషి సార్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది మేడమ్ అని వసుధార అంటుంది. దీంతో వెంటనే.. రిషి ఇప్పుడే ఆ నల్లపూసలు వసుధార మెడలో వేసేయ్ అని చెబుతాడు. డాడ్ మా ఇద్దరికీ కాస్తా టైమ్ కావాలి. ఆలోచించుకుని చెబుతాం అని రిషి బదులిస్తాడు.
దీంతో వసుధార, జగతి బాధగా చూస్తారు. మహేంద్ర ఆలోచనలో పడిపోతాడు. సీన్ కట్ చేస్తే మహేంద్ర, జగతి తమ గదిలో ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 8 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 732లో ఇంకా ఏం జరిగిందంటే?

పంతాలు పట్టింపులు: అక్కయ్య ఎంత పని చేశారో చూశావా మహేంద్ర అని జగతి అంటుంది. ఇంతటి సాహసానికి ఒడిగడుతుందని అనుకోలేదని మహేంద్ర అంటాడు. వాళ్ల మధ్య దూరం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. అక్కయ్య రిషి గదిలోకి వెళ్లడాన్ని బావగారు చూశారు కాబట్టి సరిపోయింది. నిజం బయటపడిపోయింది. లేకపోతే.. ఇది ఎంత వరకూ దారి తీసేదో.
మళ్లీ వాళ్ల మధ్య పంతాలు పట్టింపులు మొదలయ్యేవి. ఎవరు ఏం చెప్పినా వినేవాళ్లు కాదేమో కదా అని జగతి ఆవేదనగా చెబుతుంది. వాళ్లది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమే వాళ్లని గెలిపిస్తుంది. ప్రతి క్షణం అదే అండగా ఉంటుంది అని మహేంద్ర ధైర్యం చెబుతాడు. ఇప్పుడు రిషి ఎమంటాడో, వసు ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావట్లేదు అని జగతి భయపడుతుంది.

నాకు నచ్చలేదు: మరోవైపు జరిగింది తలుచుకున్న దేవయాని ఈయన చూడకపోతే బాగుండు. ఇప్పుడు రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో. మంచి అవకాశం చేయి దాటిపోయింది అని అనుకుంటుంది. దేవయాని నువ్వు చేసిందేం బాలేదు. వాళ్లిద్దరి మనసులు ఒకటైనా కొన్ని విషయాల్లో పట్టింపులకు పోతున్నారు.
ఇలాంటప్పుడు నువ్వు చేసింది ఏదీ నాకు నచ్చలేదు అని ఫణీంద్ర అంటాడు. దీంతో రిషి కోసమే చేశానండీ. రిషి బాధను చూడలేకపోతున్నానండీ అంటూ కవర్ చేస్తుంది దేవయాని. అది సరే వసుధార గదిలోకి ఎందుకు వెళ్లావ్ అని ఫణీంద్ర కోపంగా అడుగుతాడు. కలిసిపోమ్మని చెప్పడానికి వెళ్లాను అంటూ మళ్లీ ఏదేదే చెప్పి లోపల మాత్రం భయపడుతుంటుంది.
ప్రేమను బతికించుకోవాలి: దేవుడా.. ఆ వసుధార, రిషి కలవకూడదు. వసుధారను బయటకు గెంటెయ్యాలి అని మనసులో మొక్కుకుంటుంది దేవయాని. ధరణి కూడా దేవయాని చేసిన పని తలుచుకుంటూ భయపడుతూ రిషి, వసుధార కలిసిపోవాలని కోరుకుంటుంది. ఇక ఒకచోట రిషి, వసుధారలు నిలబడి మౌనంగా ఉంటారు. దేవుడా రిషి సార్ ఏం నిర్ణయం తీసుకుంటారో అని వసు అనుకుంటుంది.
వెంటనే వసుధార చేతుల్ని పట్టుకుని నీకు నాకు మధ్య ఏదోరకంగా అగాధాలు అడ్డుపడుతున్నాయి. మన ప్రేమను బతికించుకోవాలి వసుధార అని రిషి అంటే.. థ్యాంక్స్ సార్ అని వసుధార అంటుంది. మన ప్రేమకు సాక్ష్యం ఆ వీఆర్ ఉంగరం ఎక్కడ పడిపోయిందో అని రిషి బాధగా అంటే.. అది నా రూమ్ లోనే పడి ఉంటుందని వసు చెబుతుంది.

వసుధార మెడలో తాళి: వీఆర్ ఉంగరాన్ని వెతికేందుకు ఇద్దరు వసుధార గదిలోకి వెళ్తారు. ఇంతలో ఇద్దరికీ ఒకేసారి ఒక మూలన పడి కనిపిస్తుంది. దీంతో దాన్ని తీసకుని దీన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అని రిషి అంటాడు. ఇప్పుడే ఈ రింగ్ నా చేతికి పెట్టండి అని వసుధార అంటుంది. నాతో రా వసుధార అని తన గదికి తీసుకెళ్తాడు రిషి. బీరువాలో నుంచి తమ ప్రేమకు చిహ్నమైన మరో గిఫ్ట్ బయటకు తీస్తాడు.
అది ప్రపోజ్ చేసినప్పుడు ఇద్దిరికి ఇద్దరు ఇచ్చుకున్న గాజు బొమ్మ. తర్వాత తాళికి వీఆర్ ఉంగరం వేసి రెండు చేతులతో తాళి పట్టుకుంటాడు రిషి. వసుధార మెడలో వేస్తాడేమో అనిపిస్తుంది. కానీ ఒకసారి బంధం అందంగా కాకుండా ఏకాంతంగా ముడిపడింది. ఇంకోసారి ఈ బంధం ముడి పడాలంటే దానికి సరైన నిర్ణయం తీసుకుందాం అంటూ ఆ గిఫ్ట్ కు తాళి వేస్తాడు రిషి.
నిజమేనా రిషి: అయితే ఆ గిఫ్ట్ కు అటువైపు వసుధార ఫొటో ఉండటంతో తనకే తాళి వేసినట్లుగా కనిపిస్తుంది. తర్వాత ఇంట్లో అందరినీ పిలుస్తాడు రిషి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పెద్దమ్మా. నేను వసుధారను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రిషి అంటాడు. దీంతో వసు, జగతి, మహేంద్ర, ధరణి, ఫణేంద్ర మొహాల్లో సంబరం కనిపిస్తుంది. కానీ దేవయాని మాత్రం షాక్ అవుతుంది.
రిషి నువ్వు చెప్పేది నిజమేనా అని మహేంద్ర అంటాడు. నిజమే డాడ్ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక వెనక్కి తగ్గేదే లేదు అంటాడు రిషి. నీ నోటి నుంచి ఈ మాట కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను అని మహేంద్ర అంటాడు. అందరూ రిషికి, వసుధారకు ఎంతో సంతోషంగా కంగ్రాట్స్ చెబుతారు.
ముహుర్తాలు లేవు: మరోవైపు ఇది ఇంత తొందరగా ఇలా జరుగుతుంది అనుకోలేదు అని దేవయాని రగిలిపోతుంది. పెద్దమ్మా పంతుల్ని పిలిచి మంచి ముహుర్తం చూడమని చెప్పండి అని రిషి అంటాడు. దేవయాని అంతగా పట్టించుకోకుంటే.. అక్కయ్య మీకే రిషి చెబుతున్నాడు అని జగతి అంటుంది. హా సరే నాన్నా.. కానీ కొద్దిరోజులు ఆగాలి. శూన్యమాసం కదా. ముహుర్తాలు ఉండవు.
అయిపోగానే పిలుస్తా అని దేవయాని అంటుంది. సరే. ఇప్పుడు మీరంతా హ్యాపీయే కదా అని రిషి అంటాడు. అంతా నవ్వుతారు. వసుధార అలా మనం బయటకు వెళ్లొద్దా అంటాడు రిషి. ఎక్కడికి అని మహేంద్ర అడిగితే.. తెలియదు డాడ్.. సరదాగా అలా బయటకు వెళ్లాలనిపిస్తోంది అని రిషి అంటాడు. తర్వాత వసు, రిషి బయటకు వెళ్తారు.


Click it and Unblock the Notifications











