Guppedantha Manasu: అటెండర్ చెంప చెల్లు.. శైలేంద్రకు డబుల్ వార్నింగ్.. రిషికి తెలియనున్న నిజం!

విష్ కాలేజీ గోడలపై వసుధార, రిషి ఎంగేజ్ మెంట్ ఫొటోలు కనిపించాలని అటెండర్ కు శైలేంద్ర చెబుతాడు. శైలేంద్ర ఏదో ప్లాన్ చేశాడని, జాగ్రత్తగా ఉండమని వసుధారకు మహేంద్ర కాల్ చేసి చెబుతాడు. ఆ విషయం అదే విషయాన్ని చెప్పేందుకు రిషికి మేసెజ్ చేస్తుంది. ఏం జరగబోతుందో అన్న టెన్షన్ తో బెడ్ పై కూర్చుని ఆలోచిస్తుంటుంది జగతి. ఇంతలో వచ్చిన మహేంద్ర కాలేజీకి వెళ్లి రిషిని కలుస్తానని చెబుతాడు. ఇంత సడెన్ గా ఏంటీ అని జగతి అడిగితే.. వసుధార మాటలు రిషి వింటాడో లేదో. అందుకే వెళ్తున్నాను అని మహేంద్ర చెబుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఆగస్టు 1 మంగళవారం నాటి ఎపిసోడ్‌ 830లో ఇంకా ఏం జరిగిందంటే?

నెరవేరింది:మహేంద్రతో నేను కూడా వస్తానని జగతి అంటుంది. వద్దు. నువ్వు వస్తే రిషికి డౌట్ వస్తుంది. నాతో కూడా సరిగ్గా మాట్లాడలేడు. నువ్వు ఇక్కడే ఉండటమే మంచిది. శైలేంద్ర ఏం చేస్తున్నాడో కనిపెట్టవచ్చు అని మహేంద్ర అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేసేందుకు రిషి ఒప్పుకున్నాడు అని జగతి చెప్పడంతో మహేంద్ర సంతోషిస్తాడు. బోర్డ్ మీటింగ్ కు శైలేంద్రను పిలువు. అతను కాలేజీ నుంచి బయటకు రాకుండా అడ్డుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు మహేంద్ర. మరోవైపు వసుధార మెసేజ్ చూసుకున్న రిషి కాల్ చేస్తాడు. మీరు నాకోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నది నెరవేరింది. మిషన్ ఎడ్యుకేషన్ టేకప్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ కు చెప్పాను అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial August 1 2023 Today Full Episode 830

రిషిని వెళ్లగొడతారు:దాని గురించి కాదు సార్ నేను మీతో మాట్లాడాలి. ఒక్కసారి రండి అని వసుధార అంటుంది. పర్సనల్ కోసం వృత్తి ధర్మం తప్పకూడదని చెప్పిన మాటకు, నా సంతోషం కోసం ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట్లాడలాని అంటున్నారంటే.. అది పర్సనల్ అయే ఉంటుంది. పర్సనల్స్ మాట్లాడేందుకు నీకు నాకు మధ్య సంబంధం లేదు అని కాల్ కట్ చేసి వెళ్లిపోతాడు రిషి. తర్వాత శైలేంద్రకు కాల్ చేసిన అటెండర్ అంతా సిద్ధం అయింది అని చెబుతాడు. రిషి సార్ పరువు పోవడం పక్కా. రిషి, వసుధార ఫొటోలు చూసి విశ్వనాథం సార్ ఆవేశపడతారు. మోసం చేసినందుకు రిషిని వెళ్లగొడతారు. అంతా మీరు అనుకున్నది జరుగుతుంది సార్ అని అటెండర్ అంటాడు. ఆ మాటలన్ని వసుధార వింటుంది.

Guppedantha Manasu Serial August 1 2023 Today Full Episode 830

ఎంగెజ్ మెంట్ పిక్స్:కాల్ కట్ చేసిన అటెండర్ వసుధారను చూసి షాక్ అవుతాడు. ఎవరు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్ అని వసుధార కాలర్ పట్టుకుంటే.. అది విడిపించుకుంటూ నీకు అనవసరం. కొద్ది సేపట్లో నీ పరువు పోతుంది అని అటెండర్ అంటాడు. దీంతో చెంపదెబ్బ కొడుతుంది వసుధార. నన్నే కొడతావ. ఇలా ఎంతమందిని కొడతావో చూస్తా అని అటెండర్ అంటే.. అతని నుంచి ఫోన్ లాక్కుంటుంది వసుధార. అటెండర్ అది లాక్కునేందుకు ప్రయత్నిస్తే.. సెక్యూరిటీని పిలుస్తుంది వసు. దీంతో అటెండర్ పారిపోతాడు. అటెండర్ ఫోన్ లో ఎంగెజ్ మెంట్ ఫొటోలు చూసి షాక్ అవుతుంది వసు. అటెండర్ మాట్లాడిన నెబ్ర కు కాల్ చేసి శైలేంద్ర వాయిస్ విని కన్ఫర్మ్ చేసుకుంటుంది.

Guppedantha Manasu Serial August 1 2023 Today Full Episode 830

నీలాంటి దుర్మార్గులు:పని పూర్తయిందా అని శైలేంద్ర అంటే.. కాలేదు నేను పూర్తి చేస్తా. నీ కక్ష ఇంకా తీరలేదా. రిషి సార్ ని ఎందుకు వదలడం లేదు అని వసు అంటుంది. ఎండీ సీటు కోసం అని శైలేంద్ర అంటే.. అది జరగదు అని అప్పుడు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. ఆయన్ను నువ్వు ఏం చేయలేవు. ఆ రోజు నా దగ్గర సాక్ష్యం లేదు. ఇప్పుడు ఉంది. ఎలాగైనా రిషి సార్ ని రక్షించుకుంటా అని వసుధార అంటుంది. అందరికీ తెలిసిపోయింది. ఇక రిషిపై అటాక్ చేస్తే నాకు అడ్డుండదు. ఈ విషయాన్ని పిన్నికి చెబుతాను. ఎలా కాపాడుకుంటుందో చూస్తాను అని జగతి దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర. నీ శిష్యురాలు కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇది యుద్ధం కదా. నేరుగా రంగంలోకి దిగుతున్నాను అని శైలేంద్ర అంటాడు. నీలాంటి దుర్మార్గులు ఇలానే చెబుతారు. కానీ ఓడిపోతారు అని జగతి అంటుంది.

Guppedantha Manasu Serial August 1 2023 Today Full Episode 830

గుడ్ న్యూస్:నీ శిష్యురాలు కూడా ఇంచుమించు ఇలాగే మాట్లాడింది. అయినా ఆడపిల్ల ఏం చేస్తుంది అని శైలేంద్ర అంటాడు. ఆడపిల్ల అని తేలిగ్గా తీసివేయకు. నీకు వసుధార పరిచయం అయినప్పుడు ముచ్చెటమలు పట్టించింది మరిచిపోయావా అని జగతి అంటుంది. అల్రెడీ ప్లాన్ అమలైపోయింది. రేపటకిల్ల గుడ్ న్యూస్. నాకు గుడ్ న్యూస్. మీకు బ్యాడ్ న్యూస్ అని శైలేంద్ర అంటాడు. అలా ఏం జరగదు అని జగతి అంటే.. కోపంగా వెళ్లిపోతాడు శైలేంద్ర. మహేంద్రకు కాల్ చేసి ఏదో ప్లాన్ చేశాడని జగతి చెబుతుంది. వాడు ఇక్కడికే వస్తాడనుకుంటా. రిషిని ఏం చేయాలన్న నన్ను దాటుకుని చేయాలి. అలా జరగనివ్వను. రిషిని ఎలాగైనా కాపాడుకుంటాను అని మహేంద్ర కాల్ కట్ చేస్తాడు. అప్పుడే వసుధార కాల్ చేస్తుంది.

Guppedantha Manasu Serial August 1 2023 Today Full Episode 830

డిలీట్ చేయండి:అటెండర్ కు ఎంగెజ్ మెంట్ ఫొటోలు పంపిన విషయం మహేంద్రకు చెబుతుంది వసుధార. నేను వస్తున్నాను అని మహేంద్ర చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోవైపు ఫ్లెక్సీల కోసం రిషి వెళ్తాడు. కాలేజీ ఫ్లెక్సీల గురించి మాట్లాడుతుండగా ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మీరే కదా అని షాప్ అతను ఫొటోలు చూపిస్తాడు. అది చూసి రిషి షాక్ అవుతాడు. ఇది మీకు ఎవరిచ్చారని అడిగితే.. విష్ కాలేజీ అటెండర్ ఇచ్చాడని చెబుతాడు. ఎందుకిచ్చాడని రిషి అడిగితే తెలియదు అని షాప్ అతను చెబుతాడు. అలా తెలియకుండా ఎలా ఇస్తారు అని రిషి ఫైర్ అవుతాడు. వాటన్నింటిని డిలీట్ చేయమని చెబుతాడు. అటెండర్ నెంబర్ ఉందా అని అడిగితే ఉందంటాడు షాప్ అతను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X