Guppedantha Manasu: విశ్వనాథానికి గుండెపోటు.. బయటపడిన ఏంజెల్ గతం.. మహేంద్ర నాటకాలు

మహేంద్ర, జగతి మేడమ్ కంగారుపడుతున్నారనే విషయం రిషికి చెబుతుంది వసుధార. మీకేందుకు చెప్పడం, నాకే చెప్పొచ్చు కదా అని రిషి అంటాడు. కష్టాల్లో ఉన్న వాళ్లు తోడు కోరుకుంటారు. బాధలో ఉన్నవాళ్లు ఓదార్పు కోరుకుంటారు. మీకు చెబితే వింటారో లేదో అనుకోవచ్చు. మీరు విసుక్కుంటారని మీకు చెప్పకపోవచ్చు. మీ దృష్టిలో మనిద్దరం వేరు కావచ్చు. కానీ, వాళ్ల దృష్టిలో మనం ఎప్పటికీ రిషిధారలమే. నాకు జాగ్రత్తలు చెబితే మీకు చెప్పినట్లే భావించినట్టున్నారు అని వసుధార అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఆగస్టు 10 గురువారం నాటి ఎపిసోడ్‌ 838లో ఇంకా ఏం జరిగిందంటే?

ఓదార్పు లేకుండా:ఎస్సై గారికి కాల్ చేసి అది ఎవరు చేశారో కనుక్కోండి అని వసు అంటుంది. రిషి మౌనంగా ఉండేసరికి.. కాస్తా గట్టిగా వసుధార మళ్లీ అదే చెబుతుంది. మీ దబాయింపు ఏంటీ మేడమ్. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలో నాకు తెలుసు. వాళ్లకు చెప్పండి నాకేమైనా జరిగితే చూసుకునేవాళ్లు ఉన్నారని. ఇందాకా మీరన్నారే ఓదార్పు అని. గత మూడేళ్లుగా ఎలాంటి ఓదార్పు లేకుండా బతుకుతున్నాను అని చెప్పేసి రిషి వెళ్లిపోతాడు. నాకు తెలుసు సార్ మీది పైపై కోపమే అని వసుధార మనసులో అనుకుంటుంది. మరోవైపు ఏం జరిగింది అని శైలేంద్రను దేవయాని అడుగుతుంది. కొంచెం ఉంటే ఆ రిషిగాడికి దొరికిపోయేవాడిని అంటూ అటాక్ చేయించిన విషయం, ఫోన్ దొరికిన విషయం చెబుతాడు శైలేంద్ర.

Guppedantha Manasu Serial August 10 2023 Today Full Episode 838

దొరికిపోయే ఛాన్స్:నువ్ అన్ని కరెక్ట్ గానే చేస్తున్నావ్. కానీ, ఎందుకు మిస్ అవుతున్నాయి అని దేవయాని అంటే.. అదే అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియట్లేదు అని శైలేంద్ర అంటాడు. నువ్వేం చేయకు అని దేవయాని అంటుంది. అదేంటి మామ్.. వాడు తిరిగొస్తే నా కల కలలానే ఉండిపోతుంది అని శైలేంద్ర ఆవేశంగా అంటాడు. నువ్ కాలేజీపై ఫోకస్ చేయి. వాడు వచ్చేవాడు అయితే ఈపాటికే వచ్చేవాడు. వాళ్ల అమ్మనాన్న వెళ్లి పిలిచినా రాలేదంటే. వాడు ఇంకా రాడు. ఇంతకాలం కాలేజీని విడిచిపెట్టి ఉండలేడు. నువ్ టెన్షన్ పడకు. ఆవేశపడి మళ్లీ ఏదైనా ప్లాన్ చేస్తే దొరికోపోయే అవకాశం ఉంది. నువ్ దొరికిపోతే ఇర్కుకుంటావ్. నేను కూడా ఇరుక్కుంటాను అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu Serial August 10 2023 Today Full Episode 838

కాలేజీపై ఫోకస్:మరోవైపు మహేంద్రను తన గదికి రమ్మనమని ధరణికి చెప్పిన ఫణీంద్ర దేవయాని-శైలేంద్ర వైపు వస్తుంటాడు. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి కొన్ని రోజులు నేను చెప్పినట్లు చేయి. రిషిని ఏం చేయకు వదిలేయ్. నేను ఎన్ని చెప్పినా నువ్ చేయాల్సి చేస్తాను అని అనుకుంటున్నావ్ (సరిగ్గా ఇలానే మనసులో అనుకుంటాడు శైలేంద్ర) కదా. నాకు తెలుసు. కాలేజీ మీద దృష్టి పెట్టు అని దేవయాని అంటుంది. ఇంతలో సరిగ్గా చెప్పావ్ దేవయాని అని ఫణీంద్ర అంటాడు. దీంతో తల్లి కొడుకులు షాక్ అవుతారు. ఏమంటున్నారు డాడ్ అని శైలేంద్ర అంటే.. కాలేజీపైన శ్రద్ధ పెట్టు అని చెబుతున్నా. నీ ప్రవర్తన, నెగెటివ్ మాటలకు నచ్చకే వద్దన్నాం కానీ, కాలేజీ గురించి పట్టించుకుంటే మంచిదే కదా అని ఫణీంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial August 10 2023 Today Full Episode 838

చాలా నేర్పించాలి:డాడ్ అయితే వినలేదన్నమాట అని మనసులో అనుకున్న శైలేంద్ర.. ఇక నుంచి ఏది పడితే అది మాట్లాడను. బుద్ధిగా వర్క్ చేసుకుంటాను అని అంటాడు. జగతి దగ్గర వర్క్ నేర్చుకో. పాజిటివ్ గా ఆలోచిస్తూ తనకు సహాయం చేయు అని ఫణీంద్ర అంటుండగా.. మహేంద్ర వస్తాడు. శైలేంద్ర కాలేజీకి వస్తానన్న విషయం చెప్పిన ఫణీంద్ర.. నేను ఓకే అన్నాను నువ్వేం అంటావ్ అని అడుగుతాడు. మీ ఇష్టం అన్నయ్యా అని మహేంద్ర అంటే.. పిన్ని అభ్యంతరం పెడుతుందేమో అని శైలేంద్ర అంటాడు. నువ్వేం భయపడకు శైలేంద్ర.. జగతి ఏం అనదు. అయినా నీకు నేర్పించాల్సినవి చాలా ఉన్నాయి. ముందు కాలేజీకి పదా నేర్పిస్తా అని అన్న మహేంద్ర మనసులో నువ్వే కాదు మేం కూడా నాటకాలు ఆడగలం. చిన్నవాడివైనా చాలా నేర్పిస్తున్నావ్ అని అనుకుంటాడు.

వసు ఎదురుచూపులు:రిషికి కాల్ చేసిన ఎస్సై ఆ ఫోన్ ఎవరిదో తెలియలేదు. కేవలం ఆ రెండు నెంబర్ల నుంచి మాత్రమే కాల్స్ వెళ్లాయి. ఈ రెండు నెంబర్లు కూడా ఒక వ్యక్తివే. అది కూడా చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్నాయి. వాడెవడో పెద్ద క్రిమినల్ లా ఉన్నాడు. ఎక్కడ క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా సరే కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో ఏంజెల్ ఏడుపు విని హాల్లోకి వెళ్తాడు రిషి. అక్కడ విశ్వనాథం గుండె పట్టుకుని కుప్పకూలిపోతాడు. ఏంజెల్ ఏడుస్తూ కంగారుపడుతుంది. వెంటనే రిషి డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. మరోవైపు రిషి సార్ ఇంకా రాలేదా అని వసుధార ఆలోచిస్తు ఉంటుంది. పాండ్యన్ ని అడిగితే సార్ ఇంకా రాలేదు అని చెబుతాడు.

Guppedantha Manasu Serial August 10 2023 Today Full Episode 838

ఏంజెల్ గతం:డాక్టర్ వచ్చి విశ్వనాథంకు ట్రీట్ మెంట్ ఇస్తాడు. మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఏది సీరియస్ గా ఆలోచించొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్. నాకు భయం వేస్తోంది రిషి. నాకెవ్వరు లేరు విశ్వం తప్ప అని ఏంజెల్ ఏడుస్తుంటే.. నేను బాగానే ఉన్నానమ్మా అని విశ్వనాథం అంటాడు. నువ్ ఇలానే నవ్వుతావ్ అని ఏంజెల్ బాధపడుతుంటే.. రిషి జూస్ తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. పక్కన రిషిని కూర్చోబెట్టుకుని ఏంజెల్ గతం చెబుతాడు. ఏంజెల్ పసిపిల్లగా ఉన్నప్పుడు నా కొడుకు, కోడలికి ఫారెన్ వెళ్లి ఛాన్స్ వచ్చింది. వాళ్లు వెళ్లాక మా ఆవిడ ఏంజెల్ ను ఎంతో ముద్దుగా పెంచింది. ఐదేళ్ల తర్వాత ఏంజెల్ అమ్మానాన్న ఇండియాకు తిరిగి వస్తండగా ఫ్లైట్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఆ బాధతో నా భార్య కూడా కన్నుమూసింది అని విశ్వనాథం చెబుతాడు.

Guppedantha Manasu Serial August 10 2023 Today Full Episode 838

ఏంజెల్ కన్నీళ్లు:అప్పటి నుంచి ఏంజెల్ ను కంటికి రెప్పలా చూసుకున్నాను. తను పెళ్లి చేసుకుంటే వేరే ఇంటికి వెళ్లిపోతుందని ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాటేసేది. ఇది ప్రాణాపాయం కాదు హెచ్చరిక. తనను ఓ మంచి వ్యక్తి చేతిలో పెట్టాలి. తనకు నేను లేని లోటు తీర్చాలి. నేను పోయేలోపు ఇది నెరవేరుతుందా రిషి అని విశ్వనాథం అంటాడు. సార్ మీరు అలా కండి. కచ్చితంగా అలా జరుగుతుంది. మీరు కూడా బాగుంటారు. ప్రశాంతంగా ఉండండి అని చెప్పిన రిషి ఏంజెల్ దగ్గరికి వెళ్తాడు. విశ్వంకి ఏం కాదు కదా. ఫస్ట్ టైమ్ బాధగా ఉంది. అమ్మా నాన్న లేరని ఏరోజు బాధపడలేదు. ఉంటే బాగుండు అనుకున్నా. నా కళ్లలో ఏ రోజు నీళ్లు రాకుండా విశ్వం పెంచాడు. ఇప్పుడు విశ్వానికి అలా జరిగే సరికి కన్నీళ్లు ఆగడం లేదు. నాకు అన్ని తానే. అందుకే కలుపుగోలుగా ఉంటాను. ఎప్పుడూ ఆటపట్టించినా ఏం అనలేదు. నా సంతోషమే తన సంతోషం అనుకున్నాడు అని ఏంజెల్ చెబుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X