Guppedantha Manasu: శైలేంద్ర తిరుగులేని స్కెచ్.. వాళ్లకు డేటా మొత్తం లీక్.. కోలుకోలేని దెబ్బ

రిషితో వసుధార మాట్లాడుతుంటుంది. మహేంద్ర సర్ కి కాల్ చేసి మాట్లాడండి సర్. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని వసుధార అంటుంది. అందరి సంతోషం గురించి ఆలోచించే మీరు.. ఆరోజు నా గురించి ఎందుకు ఆలోచించలేదు. నా సంతోషాన్ని మింగేస్తుందని అనిపించలేదా అని రిషి మనసులో అనుకుంటాడు. మేము అప్పుడు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది.

నాలో గిల్టీ ఉండి మౌనంగా ఉంటున్నాను అనుకుంటున్నారు. అది కాదు సర్. ఆరోజు నా వల్ల మీకు అన్యాయం జరిగిందనే భావనకు తల వంచుతున్నానే కానీ, నేను చేసింది తప్పు అని నేను ఎప్పటికీ ఒప్పుకోను అని వసు అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఆగస్టు 12 శనివారం నాటి ఎపిసోడ్‌ 840లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial August 12 2023 Today Full Episode 840

గిల్టీగా ఫీల్ కాలేదు: నేను ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను తప్పని పరిస్థితుల్లో మీ మంచి కోసం చేశాను. కానీ తప్పు చేశానని అనుకోవట్లేదు. కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు అని వసు అంటుంది. మీరు బాధపడటంలో అర్థం ఏముంది. నేను మొత్తం కోల్పోయాను అని రిషి అంటే.. నేను చాలా కోల్పోయాను. మా అమ్మా అని వసుధార అంటుంది. దాన్ని మధ్యలోనే ఆపి.. నాకు తెలుసు.

మీరు గతం కోల్పోయారు. అంతే, నేను నా ప్రాణమైన డీబీఎస్టీ కాలేజీ కోల్పోయాను. అయినా మీకు చాలా పొగరు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని రిషి అంటాడు. అవును సార్. నాకు పొగరే. ఇది మీరు ఎప్పుడూ అనేదే. నేను వినేదే. ఎప్పుడు తలొంచాలో. ఎప్పుడు తల ఎగరేయాలో ఈ పొగరుకు బాగా తెలుసు అని మీకు తెలుసు అని వసుధార అంటుంది.

Guppedantha Manasu Serial August 12 2023 Today Full Episode 840

కంప్లైంట్ చేస్తున్నారు: నా గురించి మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు. మీ మనసుకు కమ్ముకున్న మంచు పొరలు తీసి ఆలోచించండి. ఎప్పుడు మీవైపే కాదు మా వైపు ఉండి ఆలోచించండి. నేను చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి వెళ్లిపోతుంది వసు. తప్పనిసరి పరిస్థితుల్లో చేసినంతమాత్రానా తప్పు తప్పుకాకుండా పోతుందా. మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు అని రిషి మనసులో అనుకుంటాడు.

మరుసటి రోజు డీబీఎస్టీ కాలేజీకి వెళ్లిన శైలేంద్ర.. ప్రిన్సిపాల్ ని నుంచి మొత్తం స్టూడెంట్ డేటా తీసుకుంటాడు. గతంలో పోలిస్తే స్ట్రెంత్ బాగా తగ్గింది. గర్ల్స్ ఎక్కువగా తగ్గారు. ఉత్తీర్ణత శాతం కూడా చాలా తక్కువగా ఉంది. కారణం ఏంటని శైలేంద్ర అడుగుతాడు. టీచింగ్ సరిగా లేదని, సిలబస్ పరీక్షల ముందే కంప్లీట్ అవుతుందని కారణాలు చెబుతున్నారు అని ప్రిన్సిపాల్ అంటాడు.

Guppedantha Manasu Serial August 12 2023 Today Full Episode 840

ఉద్దరిస్తాను అని: అలా ఎందుకు జరుగుతుంది అని శైలేంద్ర ప్రశ్నిస్తే.. రిషి సార్ లేరు కదా సార్. ఆయన ఉంటే అన్ని పక్కాగా చూసుకునేవాళ్లు. ఆయన లేకపోవడంతో ఎవరికీ బాధ్యత లేకుండా పోయిందని ప్రిన్సిపాల్ అంటాడు. సరె నువ్వు వెళ్లు అని చెప్పిన శైలేంద్ర.. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకోవాలి. అనుకున్నది పూర్తి చేయాలని కొత్త ప్లాన్ వేస్తాడు.

మరోవైపు కారులో బయలుదేరుతున్న జగతి, మహేంద్ర మాట్లాడుకుంటారు. శైలేంద్ర ఏదో పెద్ద ప్లాన్ మీదే కాలేజీలోకి అడుగు పెట్టాడు అని జగతి అంటే.. అవును, ఎప్పుడూ కాలేజీ ఆపేద్దాం అని మాట్లాడే వాడు ఇప్పుడు ఉద్దరిస్తాను అని కాలేజీలో అడుగు పెడుతున్నాడు అంటే దాని వెనుక ఏదో కారణం ఉంది. వాడికి భయం అంటే ఏంటో చూపించాలి అని మహేంద్ర అంటాడు.

సామ్రజ్యాన్ని కూలగొడతాను: నా కన్న కొడుకుని చంపాలి అనుకున్న వాడిని కళ్లముందు ఉన్నా ఏం చేయలేకపోతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు. మళ్లీ రిషిపై అటాక్ చేస్తాడు. రిషిని ఎలాగైనా కాపాడుకోవాలి అని మహేంద్ర అంటాడు. అవసరం లేదు. రిషిని వసుధార జాగ్రత్తగా చూసుకుంటుంది. మన వల్ల వదిలేసిన కాలేజీని చెక్కు చెదరకుండా రిషికి అందజేయాలి.

రిషి ప్రాణం కాపాడుకునేందుకు తప్పు చేసిన నేను.. తన ప్రాణం లాంటి కాలేజీని కాపాడి ప్రాయిశ్చిత్తం చేసుకుంటాను అని జగతి అంటుంది. శైలేంద్ర ఎవరి కోసమో ఎదురుచూస్తూ.. రిషి.. నీ సామ్రజ్యాన్ని కూలగొడుతున్నాను. ఈ దెబ్బతో నేను అనుకున్న పని అవుతుంది అనుకుంటాడు. ఇంతలో ఒక వ్యక్తి వస్తాడు.

Guppedantha Manasu Serial August 12 2023 Today Full Episode 840

పేపర్ లో డీబీఎస్టీ డేటా: నేను చెప్పింది తూచా తప్పకుండా చేశావా అని శైలేంద్ర అడుగుతాడు. మీరు చెప్పిందే తప్పుడు పని. అది కూడా తప్పుగా ఎలా చేస్తాను సార్. మీరే చూడండి అని ఓ పేపర్ ఇస్తాడు అతను. పేపర్ చదివిని శైలేంద్ర ఆనందంతో గుడ్ జాబ్. అనుకున్నదానికన్నా బాగా రాసావ్ అని చెప్పి డబ్బు ఇస్తాడు. దీంతో అతను వెళ్లిపోతాడు. ఈ దెబ్బతో మీకు మీరుగా కాలేజీ బాధ్యతల నుంచి తప్పుకుని ఎండీ సీటు నాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉండండి.

పిన్నీ బాబాయ్ ఈసారి మీరు ఊహించని దెబ్బ కొడుతున్నాను. మీరు తప్పించుకోలేరు అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ఫైల్ రెడీ చేస్తుంది జగతి. అప్పుడే వచ్చిన మహేంద్ర ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు.

కాల్ చేద్దాం: రిషి గురించి మాట్లాడుకుంటూ ఎమోషనల్ అవుతారు మహేంద్ర, జగతి. రిషి వస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. రిషి నిజం తెలుసుకుని వస్తాడని మహేంద్ర ధైర్యం చెబుతాడు. ఈ ఫైల్ విష్ కాలేజీకి పంపించాలి. ఓసారి ప్రిన్సిపాల్ కి కాల్ చేయమని చెబుతుంది జగతి. విష్ కాలేజీ ప్రిన్సిపాల్ కు కాల్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ పాయింట్స్ ఫైల్ గురించి చెబుతారు.

ఒకసారి చెక్ చేసి ఛైర్మన్ గారికి పంపిస్తే పనులు ప్రారంభించొచ్చు అని జగతి అంటే.. కరెక్టే కానీ, విశ్వనాథం సార్ కి హెల్త్ బాలేదు. ఇప్పుడు బాగానే ఉన్నారు. రిషి సార్ కాలేజీ, ఆయనను చూసుకోవడానికే సరిపోతుంది. సర్ పూర్తిగా కోలుకున్నాక పంపించండి అని ప్రిన్సిపాల్ చెబుతాడు. విశ్వనాథం గారికి కాల్ చేసి పలకరిద్దాం అని జగతి అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X