Guppedantha Manasu: రిషి, వసు చేతుల్ని కలిపిన విశ్వం.. శైలేంద్ర ప్లాన్ సక్సెస్.. కూలబడిన జగతి

ఏంజెల్ గురించి విశ్వనాథం బాధపడుతూ ఉంటాడు. అమ్మా వసుధార ఏంజెల్ ను ధైర్యంగా ఉండమని చెప్పమ్మా అని విశ్వనాథం అంటాడు. ఏంజెల్ అంత కంగారుపడకు. కాస్తా రిలాక్స్ అవ్వు అని వసు చెబుతుంటే.. అలా ఎలా ఉండను వసుధార అని ఏంజెల్ అంటుంది. ఇంతలో ఏంజెల్ ను సర్వెంట్ పిలవడంతో ఏంజెల్ వెళ్తుంది. అప్పుడే రిషి వస్తాడు. ఆరోగ్యం ఎలా ఉంది సార్ రిషి అంటే బాగుందని విశ్వం అంటాడు. నేను లేకపోతే ఏంజెల్ ఒంటరి అయిపోతుంది కదా అని విశ్వం అంటే.. అలా మాట్లాడకండి సార్ అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఆగస్టు 14 సోమవారం నాటి ఎపిసోడ్‌ 841లో ఇంకా ఏం జరిగిందంటే?

టాపిక్ ఎందుకు: ఈరోజు కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళాల్సిందే కదా అని విశ్వనాథం అంటుండగా.. ఏంజెల్ వస్తుంది. ఏంటీ విశ్వం. నన్ను వదిలి వెళ్లిపోతావా అని ఏంజెల్ అంటుంది. నిన్ను ఒకటి అడుగుతాను కాదనకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి అని విశ్వనాథం అంటాడు. పెళ్లా అని గట్టిగా అని లేచి నిల్చున్న ఏంజెల్ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావ్ అని అంటుంది. పెళ్లి విలువేంటో వసుధార చెప్పమ్మా అని విశ్వం అంటాడు. జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. పిల్లలకు పెళ్లి చేయాలని పెద్దవాళ్లు ఆరాటపడుతుంటారు. పెళ్లయిన తర్వాత వాళ్లు కలిసిమెలిసి సంతోషంగా ఉండటం చూసి మురిసిపోతారు. అప్పుడు వాళ్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అని వసుధార అంటుంది.

Guppedantha Manasu

భయంగా ఉంది: నేను ఒంటరివాడిని కాకూడదని తను పెళ్లి ఆలోచన చేయడం లేదు. నేను నిన్ను ఇన్నాళ్లు ఏం అడగలేదు. ఇది నా కోరిక నెరవేర్చమ్మా. అన్ని విధాలా అర్థం చేసుకునేలా నన్ను ఒక మంచి సంబంధం చూడమంటావా అని విశ్వం అంటే.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఏంజెల్. తను ఒప్పుకోకపోతే తన జీవితం ఎలా అవుతుందో అని భయంగా ఉంది. తనకు ఒక తోడు ఇవ్వడం నా బాధ్యత అని చెప్పిన విశ్వనాథం.. వసుధార చేతిలో రిషి చేతి పెడతాడు. దీంతో వాళ్లిద్దరు మొహాలు చూసుకుంటారు. తన జీవితాన్ని మీరే చెక్కదిద్దాలి అని విశ్వనాథం అడిగితే ఇద్దరూ సరే అంటారు. వసు ఇంటికి వెళ్తుంది. చక్రపాణి ఏమైందని అడుగుతే.. విశ్వనాథం, ఏంజెల్ పరిస్థితి గురించి వివరంగా చెబుతుంది.

Guppedantha Manasu

స్పెషల్ ఎడిషన్: విశ్వనాథం గారికి అలా జరిగిందని ఏంజెల్ బాధపడుతుంది. ఏంజెల్ విషయంలో సర్ కూడా బెంగపెట్టుకున్నారు. ఏంజెల్ ఒంటరిది అయిపోతుందేమో అని భయపడుతున్నారు. తనకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కానీ, ఏంజెల్ మాత్రం మౌనంగా ఉంటోంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారో అని వసుధార చెబుతుంది. రిషి సార్ ఉన్నారు కదమ్మా. ఆయనే చూసుకుంటారు అని చక్రపాణి అంటాడు. కట్ చేస్తే కాలేజీలో ప్రిన్సిపాల్ ను కలుస్తాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్ ప్రమోటింగ్ పాయింట్స్ గురించి మహేంద్ర కాల్ చేసిన విషయం చెబుతాడు ప్రిన్సిపాల్. ఇంతలో కాలేజీ లెక్చరర్ వచ్చి పేపర్ స్పెషల్ ఎడిషన్ అట. అన్ని కాలేజీలకు పంపించారు అని పేపర్ ఇస్తాడు.

Guppedantha Manasu

ఎలా మేడమ్: ఆ పేపర్ చూసి రిషి షాక్ అవుతాడు. పేపర్ లో పతనం అవుతున్న డీబీఎస్టీ కాలేజీ. సెమిస్టార్ కు తగ్గుతున్న ప్రవేశాల సంఖ్య. అంతంతమాత్రంగా ఉత్తీర్ణత శాతం. త్వరలో మూసివేందుకు ఆలోచన అంటూ చాలా బ్యాడ్ గా ఆర్టికల్ వస్తుంది. అదంతా చదివి షాక్ అవుతాడు రిషి. డీబీఎస్టీ కాలేజీ పతనం అవుతున్నట్లు రాశారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, చాలా చెడుగా రాశారు అని లెక్చరర్ అంటాడు. ఏది ఇటు ఇవ్వండి అని ప్రిన్సిపాల్ పేపర్ తీసుకుంటాడు. కట్ చేస్తే ఓ చోట కూర్చుని డీబీఎస్టీ కాలేజీ గురించి ఆలోచిస్తుంటాడు. డీబీఎస్టీ కాలేజీ గొప్పదనం, అక్కడ చేసిన మంచి పనులు, కాలేజీ గురించి వచ్చిన ప్రశంసలు ఆలోచిస్తూ అలా ఎలా పతనం అయ్యేలా చేశారు మేడమ్ అంటూ బాధపడుతుంటాడు.

వసుధార షాక్: ఇంతలో పాండ్యన్ బ్యాచ్ వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం చేసిన సర్వే వివరాలు చెబుతారు. కానీ అంతగా పట్టించుకున్నట్లు రిషి కనిపించకపోవడంతో సర్ అని గట్టిగా అడుగుతారు. అసలు విన్నారా అని అంటారు. సర్వే గురించి చెబుతున్నారు అంతే కదా అని రిషి అంటే.. మరి అలా ఎందుకు ఉన్నారు సర్ అని పాండ్యన్ అంటాడు. రిషి ఏదో చెప్పబోయి.. వసును చూసి ఆగిపోతాడు. చెప్పాలని ఉన్న సమయం, సందర్భం కలిసి రావాలంటూ వెళ్లిపోతాడు. ఏమైందని వసుధార అడిగితే.. ప్రిన్సిపాల్ రూమ్ లో ఈ పేపర్ చూసినప్పటినుంచి సర్ మూడిగా ఉంటున్నారు అని పేపర్ తీసి ఇస్తాడు పాండ్యన్. వసు కూడా పేపర్ చూసి షాక్ అవుతుంది.

కూలబడిపోయిన జగతి: మరోవైపు జగతికి మహేంద్ర ఆ న్యూస్ చూపిస్తాడు. దీంతో జగతి కళ్లు తిరిగి కుర్చీలో కూలబడిపోతుంది. మహేంద్ర వాటర్ ఇస్తాడు. ఇంత బ్యాడ్ గా రాయడం ఏంటీ. అసలు ఇదంతా ఎవరు చేశారు. మన స్టాఫ్ లో ఎవరైనా చేయించారా లేదా. శైలేంద్ర చేసి ఉండవచ్చు అని జగతి అంటే.. నా అనుమానం కూడా అదే. నేను అన్నీ కనుక్కుంటాను అని మహేంద్ర అంటాడు. ఇంతలో పేపర్ టేబుల్ పై వేసి ఏంటీ ఇది పిన్ని అని నిలదీస్తాడు శైలేంద్ర. నేను కూడా అదే అడుగుతున్నాను అని జగతి గట్టిగా అంటుంది. నేను మిమ్మల్ని అడగటానికి వస్తే నన్ను అనుమానిస్తున్నారా. అని శైలేంద్ర అంటాడు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని జగతి అంటుంది.

ఎవరికీ తెలియదు: ఇది మిషన్ ఎడ్యుకేషన్ కు సంబధించింది కాదు. నేను కాలేజ్ బోర్డ్ మెంబర్ ని. దీని గురించి ఎవరెవరో ఫోన్ చేసి మాట్లాడుతుంటే నా తల కొట్టేసినట్లుంది అని శైలేంద్ర అంటాడు. ఎంటీ శైలేంద్ర. నీకు ఫోన్ చేశారా. ఎవరు చేశారు చెప్పు అని మహేంద్ర అంటాడు. దీంతో శైలేంద్ర మౌనంగా ఉంటాడు. అసలు నువ్ ఇక్కడ బోర్డ్ మెంబర్ అని ఎవరికీ తెలియదు. నీకు ఫోన్ చేసి అడుగుతున్నారా. చెప్తే నమ్మేలా ఉండాలి అని మహేంద్ర అంటాడు. అదంతా అనవసరం. ముందు దీనికి సమాధానం చెప్పండి బాబాయ్ అని శైలేంద్ర అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X