Guppedantha Manasu: శైలేంద్ర మీదకు చేయిలేపిన మహేంద్ర.. స్ట్రాంగ్ ధమ్కీ.. అదిరిపోయిన రిషి ప్లాన్
డీబీఎస్టీ కాలేజీ పతనం అవుతుందనే పేపర్ లో వార్తపై మహేంద్ర, జగతిలపై ఫైర్ అవుతుంటాడు శైలేంద్ర. ఎవరెవరో కాల్ చేసి మాట్లాడుతుంటే నా తల కొట్టేసినట్లు ఉంది అని శైలేంద్ర అంటాడు. ఏంటీ. నీకు కాల్ చేసింది ఎవరు. అసలు నువ్ బోర్డ్ మెంబర్ వి అని ఇక్కడ ఎవరికీ తెలియదు. అలాంటిది ఇతరులు నిన్ను అడుగుతున్నారా. చెబితే నమ్మేలా ఉండాలి అని మహేంద్ర అంటాడు.
మీ నమ్మకాలతో నాకు పని లేదు. నేను ఆరోజే చెప్పాను మీకు కాలేజీని హ్యాండిల్ చేయడం రావడం లేదు అని ఇదంతా మీ తప్పే అని శైలేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 15 మంగళవారం నాటి ఎపిసోడ్ 842లో ఇంకా ఏం జరిగిందంటే?

కుట్ర ఎవరిదో: కాలేజీ బాధ్యతలు ఎవరికైనా అప్పజెప్పండి అంటే నా మాట ఎవరు వినలేదు అని శైలేంద్ర అంటే.. ఎవరికీ అప్పజెప్ప మంటావ్. ఎవరికీ. వాళ్ల పేరు చెప్పు. నీకా.. నీకు అప్పజెప్పే ప్రసక్తే లేదు అని మహేంద్ర అంటాడు. ఇది మావయ్య గారు వేసిన పునాది. రిషి విస్తరించిన సామ్రజ్యం. దీన్ని వేరేవాళ్లకు అప్పగించే సమస్య లేదు. ఇదెవరు కుట్రపన్నారో నీకు తెలుసు.
నాకు తెలుు అని జగతి అంటుంది. నాకు ఇది నువ్వే చేయించి ఉంటావ్ అని అనుమానంగా ఉంది అని మహేంద్ర అంటాడు. అనుమానాలు కాదు బాబాయ్ ఆధారాలు ఉండాలి. కాలేజీని ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి. మీరిలాగే ఉంటే కాలేజీ మూసే పరిస్థితికి తీసుకొస్తారు అని శైలేంద్ర అంటాడు.

బయట పెడతాను: శైలేంద్ర మాటలకు కోపం కట్టలు తెంచుకున్న మహేంద్ర చేయి లేపుతాడు. మళ్లీ ఒక్క క్షణం ఆగిపోతాడు. ఇంకోసారి ఇలా మాట్లాడితే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అసలు నువ్ రాకుముందు కాలేజీ, ఇల్లు కళకళలాడుతూ ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత నుంచి ఇల్లు, కాలేజీ కళతప్పాయి. మాకు కన్నీళ్లు మిగిలాయి. నువ్ ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నా కేవలం అన్నయ్య కోసం ఊరుకుంటున్నాం.
అందుకే రెచ్చిపోతున్నావ్. నువ్ అంటున్నావ్ కదా ఆధారాలు అని. అవి చూపిస్తాను. బోర్డ్ మీటింగ్ పెట్టి ఈ విషయంపై ఏం చేయాలో అది ఆలోచిస్తాం. ఈలోగా ఆధారాలు దొరకుంటే మళ్లీ సేకరిస్తాను. అన్నయ్య ముందు పెడతాను. ఇది చేసింది నువ్వే అని కన్ఫర్మ్ అయిన తర్వాత అన్నయ్యకు చెప్పేస్తా అని మహేంద్ర అంటాడు.
ఆధారాలు దొరకవు: మా కొడుకుని దూరం చేసిన, ప్రాణాలు తీసేందుకు ట్రై చేసినా అన్నయ్య కోసం భరించాను. ఇక నువ్ మారతావ్ అని చూసేంత ఓపిక లేదు. నువ్ మరింత రాక్షసుడిగా తయారు అవుతున్నావ్. నీ నిజస్వరూపాన్ని బయటపెట్టే సమయం వచ్చేసింది. నిన్ను తప్పించడం ఎవరితరం కాదు అని మహేంద్ర అంటాడు. బయట పెట్టేద్దాం అని జగతి కూడా అంటుంది.
కాస్తా షాక్ అయిన శైలేంద్ర.. మీకు ఏ ఆధారాలు దొరకవు అని మనసులో అనుకుంటాడు. అది చూద్దాం బాబాయ్ అని శైలేంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు విష్ కాలేజీలో డీబీఎస్టీ కాలేజీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇంతలో వచ్చిన వసుధార కాలేజీ గురించే బాధపడుతున్నారు కదా అని పేపర్ చూపిస్తుంది.

చేయి దాటిపోయింది: మీరు ఈ సమస్యను పరిష్కరించండి అని వసు అంటే.. అది కాలేజీకి సంబంధించిన వాళ్లకు చెప్పండి. వారు మీకు టచ్ లోనే ఉంటారు కదా అని రిషి అంటాడు. నేను వాళ్లకే చెబుతున్నాను. కాలేజీని విస్తరించింది మీరు. ఇప్పుడా కాలేజీ కష్టాల్లో ఉంది. దానికి ఓ పరిష్కారం ఉంది అని వసు అంటే.. ఏంటని రిషి అడుగుతాడు. మీరు కాలేజీకి వెళ్లడం.
మీ అవసరం కాలేజీకి వెళ్లడం. మళ్లీ పూర్వవైభవం తీసుకురండి అని వసుధార అంటుంది. అక్కడ జగతి మేడమ్ ఉన్నారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఆవిడ హ్యాండిల్ చేయగలరని నాకు నమ్మకం ఉంది అని రిషి అంటాడు. మేడమ్ చేయి దాటిపోయింది కాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అని వసు అంటుంది.
కాలేజీ స్ట్రెంత్ పెంచుతా: కాలేజీ స్ట్రేంత్ బాగా పడిపోయింది. గతాన్ని తలుచుకోవద్దు. శిక్ష అనుభవించాల్సిన వాళ్లు అనుభవిస్తున్నారు. స్టూడెంట్స్ కోసం కాలేజీ ముందుకెళ్లాలి. చాలామంది కాలేజీ పతనం కోసం చూస్తున్నారు. మేడంకి ఎదుర్కునే శక్తి ఉన్నా వాళ్లు వేసే ఎత్తులకు ఒక్కోసారి తలవంచాల్సి వస్తుంది అని వసు అంటుంది. అవన్నీ గుర్తు చేయకండి మేడమ్.
అందుకోసం నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే కాలేజీ స్ట్రేంత్ పెరిగేలా చేస్తాను. కానీ, కాలేజీలో అడుగు పెట్టే ప్రసక్తే లేదు అని రిషి వెళ్లిపోతాడు. తర్వాత క్యాబిన్ లో కూర్చుని కొన్ని కొటేషన్స్ రాస్తుంటాడు. ఇంతలో పాండ్యన్ వాళ్లు వచ్చి రమ్మన్నారట అని అడుగుతారు. మీకు సస్పెండెడ్ కాఫీ అంటే తెలుసా అని అడుగుతాడు రిషి.
స్టూడెంట్ సపోర్ట్: నాకు తెలుసు అని లేనివాళ్లకు ఉన్నవాళ్లు చేసేది అంటూ రోహిత్ వివరిస్తాడు. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో పిల్లల్ని చదివించగలిగే స్థోమత ఉన్నవాళ్లను ఒక స్టూడెంట్ బాధ్యత తీసుకునేలా చేద్దాం. స్టూడెంట్ సపోర్ట్ పేరుతో డీబీఎస్టీ లాంటి పెద్ద కాలేజీలో చదివించేలా చేయాలి. 500 మంది స్టూడెంట్స్ మన టార్గెట్. అలాగే చేద్దాం అని పాండ్యన్ వాళ్లు వెళ్లిపోతారు.
మరోవైపు ఇంట్లో పెళ్లి చేసుకోవాలా. నాకు ఎలాంటి వాడు కరెక్ట్ అని ఆలోచిస్తుంటుంది. ఇంతలో వచ్చిన రిషి ఏంజెల్ ను పలకరిస్తాడు. ఇంట్లోకి ఎవరు వచ్చారో కూడా తెలియకుండా పరధ్యానంగా ఉన్నావేంటి. విశ్వనాథం సర్ గురించి ఆలోచించవద్దు. నేను చూసుకుంటాను అని రిషి అంటాడు. తర్వాత ఇద్దరం కలిసి తిందాం అని ఏంజెల్ అంటే.. నాకు ఆకలిగా లేదు. నువ్ తినేసేయ్ అని రిషి వెళ్లిపోతాడు.


Click it and Unblock the Notifications











