Guppedantha Manasu: వసు కోసం రిషి దొంగ చూపులు.. ఏంజెల్ నిర్ణయంతో ట్రయాంగిల్ లవ్ స్టోరి!

విశ్వనాథం, పెళ్లి గురించి ఆలోచిస్తూ ఏంజెల్ బాధగా కూర్చుని ఉంటుంది. అక్కడికి వచ్చిన రిషి ఆమెను ఓదార్చుతాడు. విశ్వనాథం సర్ ని నేను చూసుకుంటాను. నువ్ ఆందోళనపడకు అని ధైర్యం చెప్పి వెళ్లిపోతాడు. రిషి వెళ్లగానే ఏంజెల్ కు వసుధార కాల్ చేస్తుంది. సర్ ఎలా ఉన్నారు.

ట్యాబ్లెట్లు వేసుకున్నారా అని వసు అడిగితే.. ఇప్పుడు ఇవ్వాలి అని ఏంజెల్ చెబుతుంది. మరి పెళ్లి గురించి ఏం ఆలోచించావ్ అని వసుధార అడుగుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఆగస్టు 16 బుధవారం నాటి ఎపిసోడ్‌ 843లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial August 16 2023 Today Full Episode 843

అర్థం చేసుకుంటారని: సర్ చెప్పిన పెళ్లి గురించి ఏం ఆలోచించావ్. నీకు ఎలాంటి వాళ్లు కావాలి అని వసుధార అడుగుతుంది. అసలు నాకు ఇప్పటివరకు పెళ్లి అనే ఆలోచనే రాలేదు. నాకు ఎలా తెలుస్తుంది ఇతనే కావాల్సినవాడు అని ఏంజెల్ అంటుంది. తెలియడానికి ఏముంది ఏంజెల్. చూడగానే మనకు బాగా తెలిసిన మనిషి అనిపించాలి.

అర్థం చేసుకుంటాడనే భావన రావాలి అంటూ చెబుతుంది వసుధార. మౌనంగా ఉన్న ఏంజెల్ ను ఏంటీ ఏం మాట్లాడవేంటీ అని అడుగుతుంది. అసలు నువ్వు చెప్పే లక్షణాలు ఉన్న మనిషి ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే నీకె చెబుతాను. నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని ఏంజెల్ అంటుంది.

Guppedantha Manasu Serial August 16 2023 Today Full Episode 843

ఎలాగైనా ఒప్పిస్తాను: విశ్వనాథం దగ్గరకు వెళ్లి ట్యాబ్లెట్స్ ఇస్తుంది ఏంజెల్. పెళ్లి గురించి ఏం ఆలోచించావ్. ఇప్పటికైనా నా కోరిక నెరవేర్చవా. నేను ఇంత చెప్పినా నీకు కొంచెం కూడా అర్థం కావాట్లేదా. నాకు సంతోషాన్ని అందించవా. నేను ఇలాగే నీ పెళ్లి దిగులతో పోవాలా అని విశ్వనాథం అంటాడు. విశ్వం అలా మాట్లాడకు అని ఏంజెల్ అంటుంది.

నీకు ఇప్పటివరకు ఎవరూ కూడా నచ్చలేదా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. తను ఎవరైనా నాకు ప్రాబ్లమ్ లేదు. ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేస్తాను అని విశ్వనాథం అంటాడు. ఆలోచిస్తాను విశ్వం అని ఏంజెల్ అంటుంది. దీంతో విశ్వనాథం చాలా సంతోషిస్తాడు. ఏంజెల్ వెళ్లిపోతుంటే రిషి ఎంట్రీ ఇస్తాడు. ఏంటీ సార్ ఏదో ఆలోచిస్తాను అని ఏంజెల్ అంటుంది అని రిషి అడుగుతాడు.

తొందరగా పెళ్లి చేయాలి: ఏంజెల్ ఫస్ట్ టైమ్ పెళ్లి విషయంలో పాజిటివ్ గా మాట్లాడింది. ఎప్పుడూ అడిగిన మాటకు అడ్డుకట్ట వేసేది. ఫస్ట్ టైమ్ ఆలోచిస్తాను అంది. అలా అందంటే తన మనసులో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్ క్లోజ్ ఫ్రెండ్ వి కదా. తన మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకుంటావా. తన పెళ్లి తొందరగా చేయాలి అని విశ్వనాథం అంటాడు.

ఈ విషయం వసుధారకు చెప్పి తన ద్వారా ఏంజెల్ మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని రిషి మనసులో అనుకుంటాడు. అలాగే సర్. కానీ, మీరు అంతగా ఆలోచించకండి. ప్రశాంతంగా ఉండండి. నేను వర్క్ చేసుకుని పడుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పేసి వెళ్లిపోతాడు రిషి.

Guppedantha Manasu Serial August 16 2023 Today Full Episode 843

తొంగి తొంగి చూస్తూ: చూస్తుంటే ఏంజెల్ మనసులో రిషి ఉన్నట్లు చూపిస్తారని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే వసుధార, రిషి, ఏంజెల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలు అయినట్లే. ఇక పాండ్యన్ బ్యాచ్ రిషి చెప్పిన సపోర్ట్ స్టూడెంట్స్ పని పై ఉంటారు. సోషల్ మీడియా పేజ్ క్రియేట్ చేసి రిషికి మెయిల్ చేస్తారు. అది చాలా నచ్చి పాండ్యన్ బ్యాచ్ కు కాల్ చేసి అభినందిస్తాడు.

అలాగే దాని గురించి సలహాలు, సూచనలు ఇస్తాడు. తర్వాత విశ్వనాథం మాటలు గుర్తు చేసుకుని ఏంజెల్ గురించి వసుధారతో మాట్లాడాలని అనుకుంటాడు రిషి. మరుసటి రోజు విష్ కాలేజీలో వసుధార స్టూడెంట్స్ కు క్లాస్ చెబుతుంది. వసు కోసం రిషి తొంగి తొంగి చూస్తాడు. వసుధార తనను చూడటంతో పక్కకు వెళ్లిపోతాడు. మరోసారి అలాగే చేస్తాడు.

Guppedantha Manasu Serial August 16 2023 Today Full Episode 843

సైట్ కొట్టే అలవాటు: ఏంటీ రిషి సార్ వచ్చారు. ఎందుకు వెళ్లారు అని వసు అనుకుంటుండగా రిషి మెసేజ్ చేస్తాడు. క్లాస్ అయ్యాక కలవండి మేడమ్. మీతో మాట్లాడాలి అని రిషి అంటాడు. దానికంటే ముందు నాకో విషయం చెప్పండి. ఇంతకుముందు ఎందుకు అలా తొంగి చూశారని అడుగుతుంది వసు. లేదని రిషి అంటాడు. లేదు చూశారు.

అలా ఎందుకు చూశారు. ఎవరికో సైట్ కొడుతున్నట్లు చూశారు అని ఫన్నీగా వసు మెసేజ్ చేస్తుంది. నాకు సైట్ కొట్టే అలవాటు లేదు అని రిషి అంటాడు. అలా ఇద్దరూ ఫన్నీగా చాట్ చేసుకుంటూ ఉంటారు. వసుధార చాటింగ్ ను స్టూడెంట్స్ గమనిస్తారు. రిషిని కావాలనే వసు ఆటపట్టిస్తుంటుంది. తర్వాత స్టూడెంట్స్ అంతా వసును చూస్తే.. ఇటేం చూస్తున్నారు. సమ్ నోట్ చేసుకోండని చెబుతుంది.

మన ప్రేమ కాదు: కాలేజీ తర్వాత వసు ఎదురుచూస్తూ ఉంటుంది. రిషి వచ్చి కారు ఆపుతాడు. ఎక్కాలా వద్దా అని వసు ఆలోచిస్తుంది. వెంటనే రిషి దిగి కారు డోర్ తీసి ఉంచుతాడు. దీంతో వసుధార వచ్చి కారు ఎక్కుతుంది. చెప్పండి సార్ దేని గురించి మాట్లాడటానికి పిలిచారని వసు అంటుంది.

ఇద్దరూ ఒకేసారి ప్రేమ గురించి అని అంటారు. మన మధ్య ప్రేమ లేదని చాలా సార్లు చెప్పిన మీరు ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలని అంటున్నారని మళ్లీ కొంటెగా మాట్లాడుతుంది వసుధార. మన ప్రేమ గురించి కాదు ఏంజెల్ ప్రేమ గురించి. ఏంజెల్ మనసులో ఎవరు ఉన్నారో. ఏముందో తెలుసుకోవాలి. మీరు ఏంజెల్ కు మంచి ఫ్రెండ్ కదా అని రిషి అంటాడు.

పొంతన లేని ఆన్సర్స్: మీరు కూడా ఏంజెల్ కు మంచి ఫ్రెండ్ కదా. ఆ విషయం మీరే తెలుసుకోవచ్చు కదా అని వసుధార అంటుంది. నేను వేరేవాళ్లతో పెళ్లి, ప్రేమ, మనసులో ఎవరు ఉన్నారు అని మనసువిప్పి మాట్లాడలేను. ఇబ్బందిగా ఉంటుంది అందుకే నీకు చెబుతున్నాను అని రిషి అంటాడు. మరి నా దగ్గర మాత్రం బాగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు.

అంటే నేను పరాయి మనిషిగా ట్రీట్ చేయడం లేదని, మన మధ్య ఏందో సమ్ థింగ్ ఉందని అనుకోవచ్చా అని వసుధార అంటుంది. ప్రతిది మీ దాకా తేకండి. చిన్న హెల్ప్ అడిగితే ప్రశ్నలతో విసిగిస్తూ పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం లేదు అని రిషి సీరియస్ అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X