Guppedantha Manasu: రిషిపై మనసు పడ్డ ఏంజెల్.. వసు చెప్పడంతో అలా.. శైలేంద్రకు షాక్
రిషి, వసుధార ఇద్దరు కారులో వెళ్తూ ఏంజెల్ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఏంజెల్ తో ప్రేమ గురించి నేను మాట్లాడలేనని రిషి అంటాడు. మీరు కాలేజీ నుంచి ఫ్రెండ్స్ కదా. మీరే మాట్లాడండి. అయినా మీరు పవర్ ఆఫ్ స్టడీస్, మిషన్ ఎడ్యుకేషన్, రీసెంట్ గా లాంచ్ అయిన చంద్రయాన్ 3 గురించి స్పీచులు ఇస్తారు కానీ దీని గురించి మాట్లాడలేరా అని వసుధార అంటుంది. ఎక్కువగా మాట్లాడకండి మేడమ్. మీరు ఇప్పుడు ఏంజెల్ తో మాట్లాడతారా. లేదా అని రిషి అడుగుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 17 గురువారం నాటి ఎపిసోడ్ 844లో ఇంకా ఏం జరిగిందంటే?
ఫొటో చూస్తూ:రిషి గట్టిగా అడిగేసరికి ఏంటీ సార్ ఆర్డరా.. రిక్వెస్టా అని వసుధార అంటుంది. ఇంపార్టెంట్ అని రిషి అంటాడు. ఎవరికీ సార్ మీకా, నాకా. చూశారా మనకు అని కూడా అనట్లేదు. మీ సబ్ కాన్సియస్ పవర్ కు హ్యాట్సాప్. నేను ఈ విషయంలో ఏంజెల్ తో నేను ఏం మాట్లడను అని వసుధార స్ట్రాంగ్ గా చెబుతుంది. తర్వాత కారు ఆపమన్న వసుధార.. నేను మాట్లాడని అన్నందుకు కోపంతో ఇక్కడే దించేసి వెళ్లిపోతారు. మీరు అనేదాక ఎందుకు అని నేనే వెళ్దామని వసు అంటుంది. నేను అలా చేసే రకం కాదన్న రిషి వసుధారను తన ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు. తర్వాత రిషితో ఉన్న ఫొటోను చూస్తూ జ్ఞాపకాలు తలుచుకుంటుంది వసుధార.

పెళ్లి గురించి:జ్ఞాపకాలతో బతికేస్తున్న సార్. మళ్లీ ఎప్పటిలా ఇవి నిజం అవుతాయా అనుకుంటూ రిషికి ఫొటో సెండ్ చేస్తుంది వసుధార. తర్వాత మళ్లీ డిలీట్ చేస్తుంది. ఏదో సెండ్ చేశాను కానీ, సార్ చూస్తే కోప్పడతారు అని తన మనసులోనే అనుకుంటుంది వసుధార. డిలీట్ చేసిన మెసేజ్ చూసిన రిషి ఏం పంపింది. ఏంజెల్ ను అడిగి తెలుసుకుందామా అని ఏంజెల్ దగ్గరకి వెళ్తాడు. ఈలోపు ఏంజెల్ ప్రేమ గురించి రిషి చెప్పిన విషం గుర్తుకు వచ్చి ఏంజెల్ కు కాల్ చేస్తుంది వసుధార. పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా అని అడుగుతుంది. నాకు ఎలాంటివాడు అయితే బెటరా అని ఆలోచిస్తున్నాను అని ఏంజెల్ అంటుంది. ఏముంది ఏంజల్ అని ఇంతకుముందు చెప్పిన క్వాలిటీసి మొదలు పెడుతుంది వసుధార.
రిషిని చూస్తూ:అలక ఉండాలి ద్వేషం ఉండద్దు. ప్రేమగా చూసుకోవాలి ఇవేగా చెబుతావ్ అన్న ఏంజెల్ ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలుసా అంటుంది. తెలివి ఉంటే అందం ఉండదు. రెండు ఉంటే మంచితనం ఉండదు. పొగరు ఉండదు. మంచి లక్షణం ఉంటే చెడు ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నవాళ్లు ఉంటారా అని ఏంజెల్ అంటుంది. నా ఎండీ ఉన్నాడుగా అని మనసులో అనుకున్న వసుధార అందరూ అలా ఎందుకు ఉంటారు ఏంజెల్. మన పక్కనే ఉన్నా మనకు కనిపించకపోవచ్చు అని అంటుంది. అప్పుడే పక్కకు తిరిగి చూస్తే రిషి ఉంటాడు. దీంతో రిషిని అలాగే చూస్తూ ఉండిపోయిన ఏంజెల్ వసుధార కాల్ కట్ చేస్తుంది. తనను ఏంజెల్ చూడటంతో ఇబ్బంది పడిపోయిన రిషి వెళ్లిపోతాడు.

తెలిసిన వాళ్లే చేశారు:రిషి అని పిలిచిన ఏంజెల్ ఏమైనా కావాలా అని అడుగుతుంది. వసుధార విషయం ఏంజెల్ ను ఎందుకు అడగాలి అనుకున్న రిషి ఏం లేదని వెళ్లిపోతాడు. మరోవైపు డీబీఎస్టీ కాలేజీ పేపర్ విషయమై మీటింగ్ జరుగుతుంది. ఇదెవరో కావాలనే చేశారు. మన కాలేజీకి సంబంధించిన వారు, మనకు బాగా తెలిసిన వాళ్లే ఇదంతా చేశారు. కాలేజీ వివరాలు ఇంత డీటెల్ట్ గా బయటకు వెళ్లాయంటే కాలేజీ వాళ్లు చేసిన పనే అని ఫణీంద్ర అంటాడు. ఇంకెవరు అన్నయ్య కచ్చితంగా శైలేంద్ర అయి ఉంటాడు. తను ఎంత దుర్మార్గుడో మీకు త్వరలోనే బయటపెడతాం అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. దీని వెనుకున్న వాళ్లను పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నా. నువ్వు ఏమంటావ్ మహేంద్ర అని ఫణీంద్ర అంటాడు. దీంతో శైలేంద్ర కంగారు పడతాడు.
500 మంది స్టూడెంట్స్:మీ ఇష్టం అన్నయ్యా అని మహేంద్ర అంటాడు. దీనికి శైలేంద్ర భయపడతాడు. ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లు ఒకరోజు బయటపడతారు. వాళ్ల గురించి పోలీసులంటూ టైమ్ వేస్ట్ చేయకుండా మన కాలేజీ స్ట్రెంత్ ఎలా పెంచుదామో ఆలోచిద్దాం అని జగతి అంటుంది. ఇంతలో పాండ్యన్ బ్యాచ్ ఎంట్రీ ఇస్తుంది. విష్ కాలేజీ నుంచి వచ్చినట్లు పరిచయం చేసుకుని రీసెంట్ గా వచ్చిన న్యూస్ చాలా బాధపడినట్లు చెబుతారు. ఈ కాలేజీలో చదవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకే సపోర్ట్ స్టూడెంట్స్ అనే స్కీమ్ కింద మీ కాలేజీలో జాయిన్ అయేందుకు ఇంట్రెస్ట్ చూపే 500 మంది స్టూడెంట్స్ ని జాయిన్ చేయాలనుకుంటున్నాం. అందుకు సంబంధించిన వివరాలు అంటూ ఫైల్ ఇస్తాడు పాండ్యన్. స్కీమ్ గురించి రిషి చెప్పిన ప్రతి విషయం పాండ్యన్ చెబుతుంటాడు.

ఆలోచన ఎవరిదీ:పాండ్యన్ చెబుతుంటే రిషి చెబుతున్నట్లుగానే జగతి ఊహించుకుంటుంది. ప్రస్తుతానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాదను కోరుకుంటున్నాం అని చెబుతాడు. ఇది చాలా గొప్ప ఆలోచన. మీరు అడిగిన అడ్మిషన్స్ అన్నీ నేను రెడీ చేస్తాను. మా కాలేజీలో సీట్లు ఎలా భర్తి చేయాలో ఆలోచిస్తుంటే దేవుళ్లా మీరు వచ్చారు. ఈ లోకలం నాశనం కోరుకునేవారు ఉన్నట్లే బాగు కోరుకునే వారు ఉన్నారు అని జగతి అంటుంది. పాండ్యన్ బ్యాచ్ వెళ్లిపోతుంటే వాళ్లను పంపించేసి వస్తాం అని వెనుకే జగతి, మహేంద్ర వెళ్తారు. ఈ స్కీమ్ ఆలోచన ఎవరిదీ అని జగతి అడుగుతంది. రిషి తన పేరు చెప్పొద్దన్న మాటలు గుర్తు చేసుకున్న పాండ్యన్ సైలెంట్ గా ఉంటాడు.

సిగ్గు పడుతున్న ఏంజెల్ :పేపర్ లో వార్త చూసి రిషి సారే పంపించారు కదా. మీరు చెప్పకపోయినా అర్థం చేసుకోగలం. రిషి సార్ కు థ్యాంక్స్ చెప్పండి అని జగతి అంటుంది. దటీజ్ రిషీంద్ర భూషణ్ అని మహేంద్ర అంటాడు. మరోవైపు తన పెళ్లి గురించి, మనసుకు నచ్చినవాడు గురించి విశ్వనాథంతో మాట్లాడుతుంది ఏంజెల్. నేను ఎవరిని చెబితే వాళ్లను ఒప్పిస్తా అన్నావ్ కదా అని అడుగుతుంది. అవును, ఎవరమ్మా అని విశ్వనాథం అడుగుతాడు. ఏంజెల్ సిగ్గుపడుతూ రిషిని ఊహించుకుంటూ సైలెంట్ గా ఉండిపోతుంది.


Click it and Unblock the Notifications











