Guppedantha Manasu: తల్లిపై అరిచిన శైలేంద్ర.. వసు కన్నీళ్లు.. రిషి మనసులో అలజడి

కాలేజీలో వసుధార రాకపోవడంతో ఎందుకు రాలేదని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ లీవ్ పెడితే ఇన్ఫార్మ్ చేస్తుందిగా. కాల్ చేసి ఎందుకు రాలేదని తెలుసుకోవాలి. వద్దులే అని అనుకుంటాడు. ఇంతలో పాండ్యన్ వచ్చి వసుధార మేడమ్ రాలేదు సార్. మొదటి రెండు పీరియడ్స్ ఫిజిక్స్ సార్ తీసుకున్నారు అని పాండ్యన్ అంటాడు.

ఓసారి కాల్ చేసి కనుక్కోలేకపోయావా అని రిషి అంటే.. పాండ్యన్ కాల్ చేయడానికి మొబైల్ తీస్తాడు. ఇంతలు అటునుంచి వసుధార వస్తుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఆగస్టు 19 శనివారం నాటి ఎపిసోడ్‌ 846లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial August 19 2023 Today Full Episode 846

నేను మాట్లాడాలి: వసుధారను చూసిన పాండ్యన్ సార్.. మేడమ్ వస్తున్నారు అని చెబుతాడు. దీంతో సరే నువ్ క్లాసుకు వెళ్లు అని పాండ్యన్ ను పంపించేస్తాడు రిషి. ఏంజెల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ వసుధార చాలా డల్ గా వస్తుంది. రిషి పిలుస్తున్న వసుధార ఆగదు. మరోసారి గట్టిగా పిలిచేసరికి ఆగుతుంది వసుధార.

కాలేజీకి ఎందుకు లేట్ వచ్చారు మేడమ్ అని రిషి అడిగితే.. ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది వసుధార. మాట్లాడుతుంటే వెళ్లిపోతారేంటీ మేడమ్ అని రిషి అంటాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాను కదా. ఇంకా మాట్లాడేందుకు ఏముంది అని వసు అంటుంది. నేను మాట్లాడాలి. నాకు సమాధానం చెప్పాలి. మెసేజ్ పెట్టి ఎందుకు డిలీట్ చేశారని రిషి అడుగుతాడు.

Guppedantha Manasu Serial August 19 2023 Today Full Episode 846

డిలీటెడ్ కదా: డిలీటెడ్ కదా సార్. డీటెల్స్ ఎందుకని వసు అంటే.. డిలీట్ మెసేజ్ చూసినప్పటినుంచి మనసు మనసులో లేదు అని రిషి అంటాడు. పొరపాటున వచ్చింది సార్. అయినా మన మధ్య ఏం లేదు కదా అని వసు అంటుంది. అది మిస్డ్ కాల్ కాదు మేడమ్ పొరపాటున రావడానికి. ఆ మాత్రం నాకు తెలియదా అని రిషి అంటాడు. మీకు అన్నీ తెలుస్తాయి.

కానీ తెలియాల్సినవే తెలియదు అంటూ అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతుంది వసు. మళ్లీ పిలిచి వసు ముందుకు వచ్చి.. ఓసారి తలెత్తి చూడండి అని రిషి అడుగుతాడు. వసుధార కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాధపడిన బయటపడకుండా ఏం జరిగింది. ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అని అడుగుతాడు రిషి.

Guppedantha Manasu Serial August 19 2023 Today Full Episode 846

అనాలోచితంగా: ఏం లేదు సార్. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ తెలియవు అంటూ వెళ్లిపోతుంది వసుధార. క్లాసులో అందరిని ఇచ్చిన హోమ్ వర్క్ తీసుకురమ్మని చెబుతుంది. ఇచ్చిన సమ్స్ కరెక్ట్ చేసినా ఏంజెల్ చెప్పిన ఒక్కో మాట గుర్తు చేసుకుంటూ రాంగ్ అని కొట్టేస్తుంది. అలా అందరికీ చేస్తుంది.

దీంతో మేడమ్ ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకుంటాను అని వసు పర్మిషన్ అడిగి బయటకు వెళ్తాడు పాండ్యన్. మరోవైపు విష్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి విద్యార్థులు స్ట్రెంత్ పెంచడంపై ఆవేశంతో రగిలిపోతుంటాడు శైలేంద్ర. అది చూసిన దేవయాని అనాలోచితంగా చేస్తావ్. తర్వాత ఫెయిల్ అయిందని ఇలా ఆవేశపడతావ్ అంటుంది.

శైలేంద్ర రివర్స్: రిషిని చంపెస్తాను అంటే తప్పించుకుంటున్నాడు. కాలేజీ నా హస్తగతం అవుతుందని కాలేజీ గురించి బ్యాడ్ గా పేపర్లో వేయిస్తే అది కూడా బెడిసి కొట్టింది అని శైలేంద్ర అంటాడు. అలా ఎవరైనా చేస్తారా. బ్యాడ్ గా వేయిస్తే కాలేజీ మూత పడుతుంది కానీ, నీకు ఎందుకు దక్కుతుంది. ఇలా పిచ్చి పనులు చేస్తావ్. వర్కౌట్ కాలేదని ఆవేశపడతావ్.

ఒకదానిపై ఆశపడితే సొంతం అయ్యేవరకు ఓపికగా ఆగాలి. నీకు ఎన్నిసార్లు చెప్పినా నన్ను లెక్కచేయడం లేదు అని దేవయాని అంటే.. శైలేంద్ర మమ్మీ అని గట్టిగా అరుస్తాడు. ఇలా చేయొద్దు అంటావ్. రిషి రాడంటావ్. కానీ, ఒక్క ప్లాన్ అయినా చెప్పావా అని రివర్స్ అవుతాడు. త్వరలోనే నువ్ కోరుకుంది. అలా జరిగేలా నేను చేస్తా అని దేవయాని హామీ ఇస్తుంది.

Guppedantha Manasu Serial August 19 2023 Today Full Episode 846

జగతి సంతోషం: మరోవైపు ఇక శైలేంద్ర, దేవయాని ఎన్ని ప్లాన్స్ వేసినా సక్సెస్ కావు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా, రిలీఫ్ గా ఉంది అని జగతి అంటుంది. పాండ్యన్ వాళ్లు వచ్చింది చేసిందంతా తలుచుకుని సంతోషపడిపోతారు. రిషికి డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్, పవర్ ఆఫ్ స్టడీస్, సపోర్ట్ స్టూడెంట్స్ ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి.

నిజంగా నా కొడుకు గ్రేట్ అని జగతి అంటే.. నీకే కాదు నాక్కూడా కొడుకే అని మహేంద్ర అంటాడు. వాటిని మన కాలేజీ వెబ్ సైట్ లో ఆర్టికల్స్ గా పెడదాం అని మహేంద్ర అంటాడు. నా కొడుకు ఏం చేస్తున్నాడో అని జగతి అంటే.. ఏముంది క్లాస్ చెబుతాడు. లేదా పాపం చదువుకుంటాడు అని మహేంద్ర అంటాడు.

రిషితో పాండ్యన్: అలానే రిషి చుదువుకుంటూ ఉంటాడు. ఇంతలో పాండ్యన్ వచ్చి వసుధార మేడమ్ అందరి స్టూడెంట్స్ కు రాంగ్ వేస్తున్న విషయం చెబుతాడు. ఎందుకో మేడమ్ చాలా మూడీగా ఉన్నారు. క్లాస్ తీసుకోవడం లేదు. కాలేజీలో, గానీ ఇంట్లో గానీ ఏమైనా సమస్య ఉందా అని పాండ్యన్ అడుగుతాడు. వసుధార కన్నీళ్లు గుర్తు చేసుకున్న రిషి అదేంటే నేను కనుక్కుంటానులే అని పంపిస్తాడు.

చక్రపాణి కోసం వెళ్తుంటే బయట రోడ్డుపై కనిపించడంతో ఆగుతాడు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా. లేదంటే జగతి మేడమ్, డాడీ గాని ఫోన్ చేశారా, లేదా ఎవరైనా ఇంటికి వచ్చి బెదిరించారా అని రిషి అడుగుతాడు. అలాంటిదేం లేదు. మీరు అలా అడుగుతుంటే భయంగా ఉంది. వసుకి ఏమైంది అని చక్రపాణి అంటాడు.

వసు గురించి రిషి ఆరా: ఇవాళ ఎందుకో మేడమ్ చాలా డల్ గా ఉంది. ఇంట్లో ఏమైనా సమస్య అని తెలుసుకుందామని అడుగుతున్నాను అని రిషి అంటాడు. తను బాధపడటానికి ఇంకేముంటుంది. మీరు దూరం పెట్టినప్పటినుంచి బాధపడుతూనే ఉంది. మీరు దూరం పెట్టడంలో తప్పు లేదు. అంతలా మీ మనసు గాయం చేసింది. ఇవాళ ఏమైనా జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తు వచ్చాయో ఏమో అలా ఉన్నట్లుంది. వసమ్మ గురించి మీకన్నా ఎవరికీ బాగా తెలిసి ఉండదు అంటాడు చక్రపాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X