Guppedantha Manasu: సినిమా టైపులో సీన్స్.. తండ్రీకొడుకుల ఫైటింగ్ అదుర్స్.. పట్టువీడని శైలేంద్ర
ఫ్లెక్సీ షాప్ లో తన ఎంగేజ్ మెంట్ ఫొటోలు చూసి షాక్ అవుతాడు రిషి. అవి విష్ కాలేజ్ అటెండర్ ప్రింట్ చేయమని చెప్పాడని, కాసేపట్లో వస్తాడని షాప్ అతను చెప్పడంతో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి. అసలు అటెండర్ కు ఫొటోలు ఎలా వచ్చాయి. వసుధార, నాకు ఉన్న సంబంధం ఎవరికి తెలియదు కదా. ఈ ఫొటోలతో మమ్మల్ని అవమానించాలనుకున్నారా. దానివల్ల అటెండర్ కు ఏం లాభం. అసలు ఇదంతా అతనే చేయిస్తున్నాడా. ఇంకెవరైనా ఉన్నారా. ఇంట్లో ఉన్న ఎంగేజ్ మెంట్ ఫొటలు అతనికి దగ్గరికి ఎలా వచ్చాయి అని రిషి ఆలోచనలో ఉంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 2 బుధవారం నాటి ఎపిసోడ్ 831లో ఇంకా ఏం జరిగిందంటే?
తెలియకూడని వాళ్లకే:పరుగెత్తుకుంటూ వచ్చిన కాలేజ్ అటెండర్ బయటే ఉన్న రిషిని చూసి షాక్ అవుతాడు. దీంతో అక్కడే ఆగిపోతాడు. శైలేంద్రకు కాల్ చేస్తాడు. వసుధార ఏంటీ మళ్లీ కాల్ చేస్తుందని శైలేంద్ర లిఫ్ట్ చేస్తే అటెండర్ మాట్లాడతాడు. వసుధార నుంచి ఫోన్ లాక్కున్నాను సార్ అని అటెండర్ అంటాడు. ఎవరికీ తెలియకూడదని చెప్పాగా. ఎవరికీ తెలియకూడదో వారికే తెలిసింది. ఒక ఆడపిల్లను ఆపలేకపోయావ్ అని శైలేంద్ర కోపంగా అంటాడు. ఆమె ఆడపిల్ల కాదు సార్. ఆడ పులి. ఇంకో విషయం సార్.. రిషి సార్ ఇక్కడే ఉన్నారు అని అటెండర్ చెబుతాడు. అయితే వాడిని అక్కడే చంపేద్దాం అని శైలేంద్ర అంటే.. అటెండర్ షాక్ అవుతాడు.

ఎలా పరిచయం:అవును, అందరికీ తెలిసిపోయింది. ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు. నేను కొంతమంది రౌడీలను పంపిస్తాను. వాళ్లకు రిషిని చూపించు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. మరోవైపు ఏం జరుగుతుందో అని వసుధార కంగారుగా ఉంటే.. మహేంద్ర వస్తాడు. అటెండర్ దొరకలేదు. రిషి సార్ ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. శైలేంద్ర ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. అసలు శైలేంద్రకు రిషి సార్ ఇక్కడున్నాడనే విషయం ఎలా తెలిసింది అని వసుధార అంటుంది. అదే అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్తగా వచ్చాం. ఇక్కడ అటెండర్ కు శైలేంద్ర ఎలా పరిచయం అని మహేంద్ర అంటాడు.

అవసరం ఏముంది:శైలేంద్ర సార్ ఇక్కడికి వచ్చారు. విశ్వనాథం ఇంట్లో కూడా శైలేంద్రనే అటాక్ చేయించి ఉంటాడు అని వసుధార అంటుంది. అవునమ్మా, రిషిపై అటాక్ చేయించే అవసరం శైలేంద్రకు తప్పా ఇంకెవరికి లేదు అని మహేంద్ర అంటాడు. ఇందాకా ప్రిన్సిపాల్ తో రిషి సార్ మాట్లాడారు. ఆయనకు సార్ ఎటు వెళ్లారో తెలిసి ఉంటుంది అని ప్రిన్సిపాల్ కు కాల్ చేస్తుంది వసుధార. రిషి సార్ ఫ్లెక్సీ షాప్ కు వెళ్లాడని దాని అడ్రస్ చెబుతాడు. దీంతో మహేంద్ర, వసుధార కారులో బయలుదేరుతారు. మరోవైపు వసుధార చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు రిషి. ఇంకా నాపై అటాక్స్ చేయించే అవసరం ఏముంది. అన్నింటికి దూరమై వచ్చానుగా. ఇంకా నా దగ్గర ఏముంది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి.

రౌడీలను ఫాలో అవుతూ:రౌడీలు వచ్చి రిషికి అడ్డంగా ఉంటారు. రిషి పక్కకు తప్పుకునేందుకు చూసిన వాళ్లు వెళ్లకపోవడంతో.. ఎవరు మీరు ఏం కావాలి అంటాడు రిషి. దీంతో రిషి చేతుల కట్టేసి కారులోకి బలవంతంగా కూర్చోబెట్టి తీసుకెళ్తారు. లోపలి నుంచి షాప్ అతను వస్తాడు. ఇంతలో మహేంద్ర, వసుధార వస్తారు. మేడమ్ ఫొటోలో మీతో ఉన్నతన్ని ఎవరో రౌడీలు ఇప్పుడే తీసుకెళ్లిపోతున్నారు అని చెబుతాడు. దీంతో ఆ రౌడీలను ఫాలో అవుతారు మహేంద్ర, వసుధార. మహేంద్ర, వసుధార ఇద్దరూ కంగారు పడతారు. పోలీసులకు కాల్ చేయమని వసుధారకు మహేంద్ర చెబుతాడు. దీంతో వసుధార పోలీసులకు చెబుతుంది. వీళ్లు ఫాలో అవుతుంటారు కానీ, కార్ ఎక్కడా కనిపించదు.

హీరోయిటిక్ ఎంట్రీ:కారులో అటు ఇటు గింజుకుంటాడు రిషి. ఇంతలో కారు డ్రైవర్ తలకు తన కాళ్లతో మలిపెట్టి అటు ఇటు తిప్పుతాడు రిషి. దీంతో కారు అటు ఇటు ఊగిపోతుంది. డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో కారు ఓ పోల్ ను ఢీ కొడుతుంది. రౌడీలందరి కారులోనుంచి బయట పడిపోతారు. అప్పుడు సినిమాల్లో హీరోలాగా రిషి కారులోనుంచి హీరోయిటిక్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలతో కొద్దిసేపు ఫైట్ చేసిన రిషికి మత్తుమందు ఉన్న కర్చీఫ్ పెడతారు. దీంతో స్పృహ కోల్పోతాడు రిషి. అప్పుడు రిషిని పట్టుకుని కత్తితో పొడిచేందుకు రౌడీ ముందుకు నడుస్తాడు. ఇంతలో రౌడీ చేతికి రాడ్ తగిలుతుంది. దాన్ని మహేంద్ర విసురుతాడు. ఆ రౌడీలందరితో మహేంద్ర ఫైట్ చేస్తుంటాడు.

పోలీసుల ఎంట్రీ:రిషిని లేపేందుకు వసుధార ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో పోలీసుల కారు సైరన్ వినిపించడంతో రౌడీలు పారిపోతారు. రిషిని విశ్వనాథం ఇంటికి తీసుకెళ్దామని మహేంద్ర అంటే.. ఆయన కంగారు పడతారని చెప్పి తన వసుధార ఇంటికి తీసుకెళ్దామని చెబుతుంది వసుధార. మరోవైపు రౌడీలపై కోప్పడతాడు శైలేంద్ర. ఒక్కడిని ఏం చేయలేకపోయారు. మీరు రౌడీలేనా అంటాడు. వసుధారను, మహేంద్రను ఆపడం తమన వల్ల కాలేదని, ఆమె కళ్లలో కోపం రగిలిపోయిందని రౌడీ చెబుతాడు. వసుధార ఉన్నంతవరకు రిషిని ఏం చేయలేను.

కోపంతో రిషి:ముందు వసుధార అడ్డు తప్పించుకోవాలి అని అనుకున్న శైలేంద్ర.. వాడిని కనిపెడుతూ ఉండూ సమయం దొరికితే వేసేయ్ అని చెప్పి వెళ్లిపోతాడు శైలేంద్ర. మరోవైపు అసలు ఏం జరిగిందో అని కంగారుపడుతూ మహేంద్రకు జగతి కాల్ చేస్తుంది. రిషికి ఏం కాలేదని, సమయానికి వచ్చి కాపాడం అని మహేంద్ర చెప్పడంతో జగతి ఊపిరి పీల్చుకుంటుంది. తన ఇంట్లో రిషికి సేవలు చేస్తుంటుంది వసుధార. కొంతసేపటికి మెళకువ వచ్చిన రిషి.. తండ్రిని చూసి షాక్ అవుతాడు. అసలు ఎక్కడున్నాం డాడ్ అని రిషి అడిగితే.. వసుధార ఇంట్లో అని చెబుతాడు. దీంతో ఉలిక్కిపడి లేచి నిల్చుంటాడు రిషి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని రిషి అడిగితే.. ఇదే సేఫ్ ప్లేస్ అని మహేంద్ర అంటాడు. నేను ఇక్కడ ఉండను అంటూ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాడు రిషి.


Click it and Unblock the Notifications











