For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: ప్రేమలో రిషిధార.. విడదీసేందుకు సాక్షి, దేవయాని ప్లాన్​!

  |

  వసుధార, రిషి ఒకరు చేతిలో ఒకరు వేసుకుని కారులో వెళ్తుంటారు. తమ మనసులతో మాట్లాడుకుంటారు రిషి, వసుధార. తర్వాత వసుధార నువ్వేళ్లి రెస్ట్​ తీసుకో అని అంటాడు రిషి. అప్పుడేనా అని అన్న వసుధారకు సమాధానంగా ఈరోజుకు రెస్ట తీసుకో. రేపటి నుంచి నీ ధ్యాస మొత్తం ఒకేదానిపై ఉండాలి అని బెస్ట్ ఆఫ్​ లక్​ చెబుతాడు రిషి. థ్యాంక్స్​ చెప్పంటారా? మీరు నా ఆశయం కేసం నన్ను అంటూ చెప్పకుండా వద్దులేండి అంటుంది. గుడ్​ నైట్​ అంటుంది వసుధార. తన చేయి పట్టుకున్న రిషిని విదిలించుకుని వెళ్లిపోబోతోంది. ఇలా సాగుతున్న ఆగస్టు 27, 2022 శనివారం నాటి 'గుప్పెడంత మనసు' సీరియల్​ తాజా ఎపిసోడ్​ 540లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదివేసేయండి!

  సంతోషంగా రిషి..

  సంతోషంగా రిషి..

  అలా వెళ్లిపోతున్న వసుధారను చూసి.. పొగరు.. చెప్పొచ్చుగా.. అని రిషి అనుకుంటుండగా పిలిచారా? అని వసుధార అంటుంది. ఏం లేదు.. నీ మనసు నాకు అర్థం అయింది.. కానీ, ఈ దూరం అవసరం వసుధార అని అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. మధ్యలో కారును ఆపిన రిషి కారు దిగుతాడు. కారు బానెట్​పై నిలబడి చాలా సంతోషంగా ఉంటాడు. థ్యాంక్య్​ టు ది డివైన్​. ఈ రాత్రి ఎంతో బాగుంది. ఈ ఆనందం ఇంకా బాగుంది. రిషీంద్ర భూషణ్.. నీ లైఫ్​ ఇప్పుడు నీకు చాలా బాగుంది. లైఫ్​ నాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. నా లైఫ్​కు పెద్ద థ్యాంక్స్​ అని అంటూ రిషి తన నీడను చూసుకుంటాడు.

  వసుధారను ఊహించుకున్న రిషి..

  వసుధారను ఊహించుకున్న రిషి..

  నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండు. ఇలాగే నిబ్బరంగా సహనంగా నిలబడు. సమస్యలు ఎన్ని వచ్చినా ఒప్పుకో.. వసుధార నీది. నువ్వు తన ప్రాణం. తన ఆశయం నువ్వే నిలబెట్టు అని అనుకుంటాడు రిషి. ఈ సీన్ కట్​చేస్తే మహీంద్రా, గౌతమ్​ ఇద్దరూ మెట్టపై కూర్చొని మాట్లాడుకుంటారు. ఏం ఆలోచిస్తున్నావ్? అని అడిగిన మహీంద్ర ప్రశ్నకు రిషి గురించి అని నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటాడు గౌతమ్. ఇంతలో రిషి కారులో ఇంటికి వచ్చేస్తాడు. వాడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడే అడిగేద్దాం అని గౌతమ్ అంటాడు. ముందు నువ్వు అడుగుతావా? లేక నన్ను అడగమంటావా? అని మహీంద్రా అంటాడు. దీంతో పెద్దవారు కదా మీరే అడగండి, కాసేపు సరదాగా మాట్లాడుకుందామని గౌతమ్ అంటాడు. ఇదిలా ఉంటే నేను బాగా అలసిపోయాను. నా వల్ల కాదు. నేను రెస్ట్ తీసుకోవాలి అని రిషి వెళ్లబోతుండగా జగతి కనిపిస్తుంది. అలాగే జగతి వెనుక వసుధార ఉన్నట్లు ఊహించుకుంటాడు రిషి. తర్వాత థ్యాంక్యూ మేడమ్​ అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.

  ఒకరి ఫొటోలు మరొకరు చూసుకుంటూ

  ఒకరి ఫొటోలు మరొకరు చూసుకుంటూ

  మరోవైపు వసుధార చాలా సంతోషంగా ఉంటుంది. ఇంటికి వెళ్లిన వసుధార రిషి ఫొటోను చూస్తూ, రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రిషి కూడా వసుధార ఫొటోను చూస్తూ వసుధార ఏం చేస్తుందో అని తను ఫోన్ చేస్తే బాగుండు అని అనుకుంటాడు రిషి. ఏంటి రిషి సార్​.. ఏం చేస్తున్నారు? తిన్నవా? లేదా? అని అడగాల్సిన బాధ్యత లేదా? మీరు ఫోన్​ చేయరా? మాట్లాడరా? అని మరోవైపు అనుకుంటుంది వసుధార. తనే ఫోన్​ చేయాలని, నేనేందుకు ఎదురు చూడాలి? నేనే చేస్తాను అని మెస్సేజ్​ చేయబోతాడు రిషి. అయినా పరీక్షలు అయిపోయేదాకా నేనే కలవకూడదని చెప్పాకదా.. మళ్లీ నేనే మెసేజ్​ చేస్తే ఏం బాగుంటుందని రిషి అనుకుంటాడు.

  దేవయాని ప్లాన్​?

  దేవయాని ప్లాన్​?

  మరోవైపు నేనేందుకు మెసేజ్​ చేయకూడదు. సార్​ కంటే ముందే నేను మెసేజ్​ చేస్తే బాగుంటుంది కదా అని వసుధార అనుకుంటుంది. మళ్లీ వెంటనే సార్ కలవొద్దు.. మాట్లాడొద్దు అని చెప్పారు కదా. ఆ రూల్​ను బ్రేక్​ చేయడం ఎందుకు అని అనుకుంటుంది వసుధార. వీరిద్దరూ ఇలా అనుకుంటూ ఉంటే.. మరోపక్క.. సాక్షి , దేవయాని.. వసు, రిషి గురించే మాట్లాడుకుంటారు. నన్ను రిషి ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని అంటుంది సాక్షి. ఈ ఎగ్జామ్స్ అయితే పూర్తవని, ఆ తర్వాత రిషి, వసుధార ఇద్దరూ దూరం అవుతారు. అప్పుడు వసుధారను అడ్రస్​ లేకుండా చేయొచ్చు, ఆ తర్వాత రిషి ఒంటరి వాడు అవుతాడు. అప్పుడు రిషిని మనవైపు తిప్పుకోవండ సులభం అవుతుంది అని అంటుంది దేవయాని. అనంతరం తెల్లవారువాతుంది.

  ఏం గూడుపుఠాని?

  ఏం గూడుపుఠాని?

  జగతి కాఫీ పట్టుకుని రిషి గదికి వెళ్తుంది. కానీ, రిషి ఇంకా నిద్ర లేవడు. గౌతమ్​, మహీంద్రా ఇద్దరు రిషితో మాట్లాడుదామని అనుకున్నా రిషి ఇంకా లేవడు. ఇంతలో దేవయాని వచ్చి ఏం గూడు పుఠాని చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో ఏం లేదు అని చెప్పి మహీంద్రా, గౌతమ్​ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు వసుధార నిద్రలేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Guppedantha Manasu Episode 540:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X