twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu:వసుధారకు మొదలైన తొలి పరీక్ష.. అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా?

    |

    రిషి, వసుధార ప్రేమాయణం కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఇంటికి వసుధార వచ్చినట్లు ఊహించుకుంటాడు రిషి. మరోవైపు ఒకరికొకరు తమకు కాల్​ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంతలో రిషి వాట్సాప్​లో ఓ గ్రూప్ క్రియేట్​ చేస్తాడు. అందులో జగతిని కూడా యాడ్​ చేస్తాడు. పుష్ప కూడా ఈ గ్రూప్​ను చూస్తుంది. ఈలోపు గుడ్​ ఐడియా సార్ అని రిషికి వసుధార మెసేజ్​ చేస్తుంది. అలాగే అందరికీ వచ్చే డౌట్స్​ ఈ గ్రూప్​లో అడగొచ్చా అని మరో మెసేజ్​ పెడుతుంది వసుధార. ఇలా ఆసక్తికరంగా సాగుతున్న ఆగస్టు 30, 2022 మంగళవారం నాటి 'గుప్పెడంత మనసు' సీరియల్​ తాజా ఎపిసోడ్​ 542లో ఏం జరిగిందంటే?

    ఎలా కలుసుకుంటారు?

    ఎలా కలుసుకుంటారు?

    వసుధార పెట్టిన మెసేజెస్​కు అవును, ఏ డౌట్​ అయినా అడగొచ్చు.. మీ లక్ష్యమే మీకు ముఖ్యం అని రిప్లై ఇస్తాడు రిషి. తనకోసమే రిషి ఈ మెసేజ్​ పెట్టాడని అనుకుంటుంది వసుధార. ఈ మెసేజ్​ చూసిన జగతి.. ఎవరికీ తెలియకుండా చాటింగ్​ చేసుకుంటున్నారా.. బాగుంది అని అనుకుంటుంది. తర్వాత భోజనం చేశారా? సమయానికి తినండి, ఆరోగ్యం కాపాడుకోండి అని రిషి పెట్టిన మెసేజ్​కు ఓకే సార్ అని రిప్లై ఇస్తుంది వసుధార. మరోవైపు మహీంద్రా, జగతి, గౌతమ్​ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా అయితే రిషి, వసుధార ఎలా కలుస్తారు? అని అంటాడు గౌతమ్. కానీ, ఏదో జరుగుతుంది అని మహీంద్రా అన్న దానికి మనకు తెలియకుండా ఏదో పెద్ద కుట్రే నడుస్తోంది అంటాడు గౌతమ్.

    గ్రూప్​లో పర్సనల్​గా చాటింగ్!

    గ్రూప్​లో పర్సనల్​గా చాటింగ్!

    దీంతో ఫోన్​ చూస్తున్న జగతిని, ఏదో చెబుతా అని ఫోన్​ చూసుకుంటూ ఉంటావేంటీ అని జగతిని మహీంద్రా అడుగుతాడు. దీంతో ఫైనల్​ ఇయర్​ స్టూడెంట్స్ పేరుతో రిషి గ్రూప్​ స్టార్ట్​ చేశాడు. ఈ గ్రూప్​లో ఇద్దరూ చాట్​ చేసుకుంటున్నారు అని అసలు విషయం చెబుతుంది జగతి. అలాగే వాళ్ల చాట్ మొత్తాన్ని చూపిస్తుంది. మా ఇంట్లో కరెంట్ పోయింది ఫ్రెండ్స్​ అని వసు ఇప్పుడే గ్రూప్​లో మెసేజ్​ పెట్టింది అని చెప్పిన జగతితో.. ఇప్పుడు చూడు వెంటనే కారు తీసుకుని రిషి వెళ్తాడు అని మహీంద్రా అంటాడు. దీంతో గౌతమ్​ వెళ్లి చూడగానే రిషి నిజంగానే కారులో వెళ్తుంటాడు. దీనికి జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు కరెంట్ లేదు.. ఎలా చదువుకోవాలి? అని టెన్షన్ పడుతుంది వసుధార.

     ఫస్ట్ ఎగ్జామ్​ ప్రారంభం..

    ఫస్ట్ ఎగ్జామ్​ ప్రారంభం..

    దీంతో వెన్నెల పడుతుందని బయటకు వచ్చన వసుధార, చందమామతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. కారు లైట్స్​ ఆన్​ చేసి.. చదువుకో అంటాడు. దీంతో షాక్ అయినా వసుధార.. నాకోసం వచ్చారా? కరెంట్​ పోయిందని గ్రూప్​లో మెసేజ్​ పెడితే వచ్చి కారు లైట్స్​ పెట్టారా? థ్యాంక్స్ రిషి సార్​ అని మనసులో అనుకుంటుంది వసుధార. తను చదవడం పూర్తయ్యాక ఒక లెటర్​ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది వసుధార. కట్​ చేస్తే పరీక్షల సమయం వచ్చేస్తుంది. మొదటి పరీక్ష ప్రారంభం అవుతుంది. కాలేజీకి వచ్చిన రిషి.. అందరూ బాగా ప్రిపేర్​ అయ్యారా? అని అడుగుతాడు రిషి. దీనికి సమాధానంగా అందరు ప్రిపేర్ అయ్యామని చెబుతారు. అయితే అందరితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి కేవలం వసుధారకు అర్థం అయ్యేలా మాట్లాడుతాడు రిషి.

     మీరు జెంటిల్​ మెన్​ సార్​..

    మీరు జెంటిల్​ మెన్​ సార్​..

    అనంతరం వసుధార బ్యాగులో పెన్ను పెడతాడు రిషి. ఎగ్జామ్స్​ కోసం పెట్టిన గ్రూప్​లో అందరూ యాక్టివ్​గా ఉండండి. పరీక్షలు బాగా రాయండి. మంచిగా మార్క్స్ తెచ్చుకోండి అని చెబుతాడు రిషి. అలాగే వసుతో పాటు అందరికీ ఆల్ ది బెస్ట్​ చెబుతాడు రిషి. తర్వాత తన బ్యాగులో రిషి పెట్టిన పెన్ను చూస్తుంది వసుధార. పెన్నుతోపాటు చిన్న లెటర్​ కూడా ఉంటుంది. ఆ లెటర్​లో మనసు మాట్లాడమంటోడి. షరతు వద్దంటోంది. నీ లక్ష్యమే నీ గమ్యం. ఎగ్జామ్స్​ బాగా రాయి. ఆల్​ ది బెస్ట్​ అని ఉంటుంది. థ్యాంక్యూ సార్​, మీరు జెంటిల్​ మెన్​ సార్​.. అని వసుధార అనుకుంటుంది. ఇక తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఆగాల్సిందే.

    English summary
    Guppedantha Manasu Episode 542
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X