twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu:ఓ వైపు ఎగ్జామ్స్​.. మరోవైపు కండిషన్.. రిషిధారకు రెండూ పరీక్షలే!

    |

    వసుధారకు మొదటి రోజు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షలు నీకే కాదు, నాకు కూడా. నీ లక్ష్యం వైపు నిన్ను నడిపించేందుకు నేను ఎన్ని కష్టాలు అయిన అనుభవిస్తా. నీ గెలుపులోనే నా విజయం కూడా ఉంది వసుధార.. అని అనుకుంటూ ఎగ్జామ్​ హాల్​లోకి వస్తాడు రిషి.

    నీ నీడల ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను. ఇదే రిషి వాగ్దానం అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. తర్వాత ఎగ్జామ్​ అయిపోతుంది. రాత్రి అవుతుంది. ఇలా ఆద్యంతం మంచి డైలాగ్స్​తో ఆసక్తికరంగా సాగుతున్న ఆగస్టు 31, 2022 బుధవారం నాటి 'గుప్పెడంత మనసు' సీరియల్​ తాజా ఎపిసోడ్​ 543 ఎలా ఉందంటే?

    నీ మానసిక పరిస్థితి నాకు తెలుసు..

    నీ మానసిక పరిస్థితి నాకు తెలుసు..

    ఎగ్జామ్స్​ తర్వాత రాత్రి అవుతుంది. వసుధార ఇప్పుడు ఏం చేస్తుంది? ఎన్ని మార్క్స్​ స్కోర్ చేయబోతోంది? ఈ గ్రూప్​లో ఏం అడగలేను.. ఒకసారి కాల్​ చేద్దామా? మాట్లాడొద్దు అని షరతు పెట్టానే అనవసరంగా.. ఇప్పుడేం చేయాలి? అని రిషి అనుకుంటుండగా గౌతమ్​ వస్తాడు.

    ఏం మిత్రమా నీలో నువ్వే మాట్లాడుకనే బదులు, మాతో చెప్పొచ్చు కదా అని అంటాడు గౌతమ్. దీంతో అదికాదురా అని రిషి బుకాయిస్తుండగా, నీవేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ మానసిక పరిస్థితి నాకు తెలుసు అని వసుధారకు ఫోన్​ చేస్తాడు గౌతమ్. ఈ సమయంలో గౌతమ్ సార్​ ఎందుకు కాల్​ చేస్తున్నారని వసుధార అనుకుంటూ కాల్​ లిఫ్ట్​ చేస్తుంది.

    చివరి ప్రశ్నకు రెండు సమాధానాలు..

    చివరి ప్రశ్నకు రెండు సమాధానాలు..

    హలో వసుధార ఎలా ఉన్నావు? అని గౌతమ్ అడగ్గా బాగానే ఉన్నాను అని వసుధార చెబుతుంది. పక్కనే రిషి ఎందుకు చేశావురా? అని అంటాడు. అలాగే తిన్నదో లేదో, ఎగ్జామ్స్ ఎలా రాసిందో కనుక్కోమంటాడు. దీంతో వసుధార బోజనం అయిందా అని గౌతమ్ అడగ్గా.. తిన్నాను అని వసుధార చెబుతుంది. తర్వాత ఎగ్జామ్స్ ఎలా రాశావు? చివరి ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి కదా అని గౌతమ్ అంటాడు.

    దీంతో చివరి ప్రశ్నకు రెండు ఆన్సర్స్​ ఉన్నాయని మీకెలా తెలుసు? అంటుందు వసుధార. అలాగే పక్కన ఎవరున్నారు? అని అడుగుతందు వసు. పక్కన రిషి సార్​ ఉన్నాడని తెలిసి నేను బాగానే చదువుతున్నాను. ఇలా ఫోన్​ చేసి డిస్టర్బ్​ చేయకండి. నా ఫ్రెండ్​తో మాట్లాడుకోవాలి అని అంటుంది వసుధార.

    నీ ఫ్రెండ్​ ఎవరు?

    నీ ఫ్రెండ్​ ఎవరు?

    దీనికి నీ ఫ్రెండ్​ ఎవరు? అని అడుగుతాడు గౌతమ్. అందుకు చందమామ అని బదులిస్తుంది వసు. ఆ తర్వాత ఫోన్​ తీసుకున్న రిషి.. తను మాట్లాడుతుంటే వింటుంటాడు. బై సార్.. అందరికీ గుడ్ నైట్ అని కాల్​ కట్​ చేస్తుంది వసుధార. తెల్లావారుతుంది. రెండో పరీక్ష స్టార్ట్​ అవుతుంది. మొదటి పరీక్ష బాగా రాశారని అనుకుంటున్నా. రెండో పరీక్షను ఏ టెన్షన్​ లేకుండా రాయండి అని చెప్పి వసుధార దగ్గరికి వచ్చి చెప్పి వెళ్లిపోతాడు రిషి. రెండో రోజు ఎగ్జామ్​ ముగిసి మూడో రోజు పరీక్ష, తర్వాత నాలుగో పరీక్ష ప్రారంభం అవుతుంది. అంతా ఓకే కదా జగతి అని మహీంద్రా అడుగుతాడు. దీంతో అంతా ఓకే సార్​ అంటుంది జగతి. సరే రౌండ్స్​కు వెళ్లి వస్తానని వసుధార హాల్​లోకి వెళ్తాడు మహీంద్రా.

    రిషి గురించి మహీంద్రా ఆలోచన..

    రిషి గురించి మహీంద్రా ఆలోచన..

    అదే సమయంలో రిషి అక్కడే ఉండటంతో నాకు తెలుసు రిషి నువ్​ ఈ హాల్​లోకి వస్తావని అని అనుకుంటాడు మహీంద్రా. అనంతరం పరీక్ష ముగిసి ఐదో రోజు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఆ పరీక్ష కూడా ముగిశాక, పుష్ప, వసుధార ఇద్దరు వెళ్తుండగా, రిషి ఎదురు పడి.. ఎగ్జామ్స్​ ఎలా రాశారని అడుగుతాడు. బాగానే రాశామని పుష్ప, వసు సమాధానం ఇస్తారు. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మార్క్​ చేసి పంపిస్తాను. వాటినే చదవండి అని చెబుతాడు రిషి. కట్​ చేస్తే.. మహీంద్రా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది అని జగతి అడగ్గా, రిషి గురించి అని అనేసిరికి ఇంతలో రిషి వస్తాడు.

    అనవసరంగా కండిషన్​ పెట్టాను..

    అనవసరంగా కండిషన్​ పెట్టాను..

    ఇక్కడ కట్​ చేస్తే ఎగ్జామ్స్​ అయిపోయాక అందరం వెళ్లిపోవాలి కదా, అందరినీ వదిలి వెళ్లిపోవాలి కదా అంటుంది పుష్ప. ఇంతలో రిషి వస్తాడు. రిషి సార్​తో మాట్లాడకపోతే ఇంత బాధగా ఉంటుందా? ఒక్కసారి గలగల మాట్లాడాలని ఉంది అని అనుకుంటుంది వసుధార. మరోవైపు వసుతో మాట్లాడితే బాగుండు. అనవసరంగా కండిషన్​ పెట్టానని అనుకుంటాడు రిషి. అందరూ పరీక్షలు ఎలా రాస్తున్నారు అని అడుగుతాడు రిషి. నేను బాగానే రాస్తున్నాను సార్​ అని వసుధార అనడంతో 543వ ఎపిసోడ్​ ముగుస్తుంది. నెక్ట్స్​ ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్​ 544 చూడాల్సిందే.

    English summary
    Guppedantha Manasu Episode 543:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X