Guppedantha Manasu: నిజం చెప్పేద్దామన్న జగతి.. తమ్ముడిని చంపేందుకు నేరుగా శైలేంద్ర ఎంట్రీ
రిషిని చూడాలనిపించి మహేంద్రకు కాల్ చేస్తుంది వసుధార. విశ్వనాథం ఇంట్లో ఉన్నారా సార్ అని వసుధార అడిగితే అవునని సమాధానం ఇస్తాడు మహేంద్ర. నీ గురించి, జగతి గురించి బాధపడి బాగా అలసిపోయాడు. నిద్రపోతున్నాడు అని మహేంద్ర చెబుతాడు. ఏమైనా తిన్నారా అని వసుధార అడిగితే.. తినిపించే అవకాశం కూడా నాకు ఇవ్వలేదమ్మా అని మహేంద్ర బాధగా చెబుతాడు. సార్ నాకు రిషి సార్ ను చూడాలని ఉంది. ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపిస్తారా అని వసుధార అడుగుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 4 శుక్రవారం నాటి ఎపిసోడ్ 833లో ఇంకా ఏం జరిగిందంటే?
సైగ చేసిన మహేంద్ర:నువ్ అంతలా రిక్వెస్ట్ చేయకమ్మా. నాకు నీ బాధ అర్థమవుతుంది. రిషి అంటే నీకు ప్రాణం అని తెలుసు. కానీ కాలం పెట్టిన పరీక్షలో మీరిద్దరు ఫెయిల్ అయి దూరమవ్వాల్సి వచ్చింది. నువ్ ఇలా వీడియో కాల్ లో చూసే పరిస్థితి వస్తుందని ఊహించి ఉండవు. వీడియో కాల్ చేస్తానమ్మా అని మహేంద్ర కాల్ చేస్తాడు. ఏం మాట్లాడకు అని సైగ చేసిన మహేంద్ర బెడ్ పై పడుకున్న రిషిని చూపిస్తాడు. రిషిని చూసి వసుధార చాలా సంతోషిస్తుంది. మరుసటి రోజు రిషిని కాపాడేందుకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతుంటారు మహేంద్ర, విశ్వనాథం. మీరు సరైన సమయానికి వచ్చి రిషి సార్ ని కాపాడారు అని మహేంద్ర థ్యాంక్స్ చెబుతాడు.

అలా వీల్లేదు:అది మా డ్యూటి సార్ అని పోలీస్ అంటే.. అలా అనకండి సార్. రిషి అంటే మాకు మాత్రమే కాదు, కాలేజీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫేవరేట్ లెక్చరర్. రిషికి ఏమైనా జరిగితే కాలేజీలో, పబ్లిక్ లో అశాంతి నెలకొనది. అలాంటి రిషిని మీరు సేవ్ చేసినందుకు రుణపడి ఉంటాం అని విశ్వనాథం అంటాడు. ఓ గ్యాంగ్ తనపై అటాక్ చేశారంటే దీనిపై కచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు. ఎవరో రిషిపై పగతోనే ఇలా చేశారనిపిస్తోంది అని పోలీస్ అంటాడు. వాళ్లు ఎవరైనా కానీ పట్టుకోవాలి సార్. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీల్లేదు. అటాక్ చేసినవారు, చేయించినా వారు ఎవరో తెలియాల్సిందే. ఇంతలా ఎందుకు చెబుతున్నానంటే ఇంతకుముందు కూడా నేరుగా ఇంట్లోకి వచ్చే అటాక్ చేశారు అని విశ్వనాథం చెబుతాడు.

చాలా సీరియస్:అది విన్న పోలీస్ షాక్ అవుతాడు. అవును, ఈ విషయాన్ని మీరు కాస్తా పర్సనల్ గా తీసుకోండి అని విశ్వనాథం రిక్వెస్ట్ చేస్తాడు. మీరేం కంగారు పడకండి. సిటీలో ఉన్న గ్యాంగ్ ని అంతా ఐడెంటిఫికేషన్ కోసం పిలిపిస్తున్నాను అని పోలీస్ చెబుతాడు. మరోవైపు రిషి తప్పించుకున్నాడని శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. అలా ఎలా తప్పించుకుంటున్నావురా. ఎంత పక్కగా ప్లాన్ చేసిన ఎస్కేప్ అవుతున్నావ్. ఏం చేస్తో నీ అడ్డు తొలగిపోతుందిరా అంటూ ఆవేశపడుతుంటాడు. ఇంతలో రౌడీ గ్యాంగ్ నుంచి ఒకడు కాల్ చేస్తాడు. సార్ ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అనుమానం వచ్చిన వాళ్లందరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. మేము ఇక్కడే ఉంటే దొరికిపోతాం. ఏదో ఒకటి చేసి మా నుంచి నిజం రాబడతారు. ఇక్కడి నుంచి పారిపోతున్నాం అని చెబుతాడు.

ఎవరు లేరు:సరే. అలాగే చేయండి. మీతోపాటు ఆ అటెండర్ గాడిని కూడా తీసుకెళ్లండి. లేదంటే అందరం దొరికిపోతాం అని శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు. ఇక వీళ్లను నమ్ముకుంటే లాభం లేదు. నేనే రంగంలోకి దిగాల్సిందే. రిషిని నేనే చంపేస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు మహేంద్ర, రిషి, వసుధార పోలీస్ట్ స్టేషన్ కు ఐడెంటిఫికేషన్ కోసం వెళ్తారు. డాడ్ ఇదంతా అవసరమా అని రిషి అడుగుతాడు. ముందు ముందు అటాక్స్ జరగకుండా ఉండాలంటే అవసరమే అని మహేంద్ర నచ్చజెప్పుతాడు. పోలీస్ రౌడీలందరినీ పిలుస్తాడు. కానీ వాళ్లలో ఎవరు లేరని ముగ్గురు చెబుతారు. మనకంటే ముందే వాళ్లు పారిపోయి ఉంటారన్న మాట అని పోలీస్ అంటాడు. సార్ పై పక్కాగా నిఘా చేసి ప్లాన్ చేస్తాన్నారు. అందుకే మన మూమెంట్స్ తెలిసిపోతున్నాయని వసుధార అంటుంది.

ఎమోషనల్ వద్దు:ఎంత తెలివైన వారైన ఎక్కడో ఓ చోట తప్పు చేస్తారు. ఒక్క చిన్న క్లూ దొరికితే చాలు. మీకు ఎవరిపైన అయినా అనుమానం ఉందా అని పోలీస్ అడుగుతాడు. లేరని చెబుతాడు. అనుమానంకు బదులు సాక్ష్యాలతో పట్టుకోవాలనేది మా ప్రయత్నం అని మహేంద్ర చెబుతాడు. అంతా బయటకు వస్తారు. రిషిని ప్రేమగా హగ్ చేసుకుంటాడు మహేంద్ర. జాగ్రత్తగా ఉండు నాన్న. కొడుకుకు తండ్రిగా మాత్రమే కాకుండా సొసైటి బాగుండాలని కోరుకునే సామన్య మనిషిగా కోరుకుంటున్నా. వెళ్లాలని లేదు. ఇక్కడే ఉండాలని ఉంది అని మహేంద్ర అంటాడు. ఎమోషనల్ అవ్వకండి డాడ్. నా బాధ్యతే కాదు డీబీఎస్టీ కర్తవ్యం కూడా మీదే. మీరు అక్కడికి వెళ్లాలి అని రిషి చెబుతాడు.

అప్పుడే సెక్యూరిటీ:రిషి సార్ పై అటాక్ జరిగిన విషయం కాలేజీలో పాండ్యన్ బ్యాచ్ కు తెలుస్తుంది. మనం రిషిని సార్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఉండగా సార్ ని ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి సార్ కి సెక్యూరిటి ఇవ్వాలి అని డిసైడ్ అవుతారు పాండ్యన్ బాచ్. ఇంతలో రిషి సార్ వస్తే.. బాడీ గార్డ్స్ ల అతని వెంటే నడుస్తారు. ఏంటీ ఇదంతా అంటే మీపై అటాక్ జరిగింది కదా. మీకు సెక్యూరిటిగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని పాండ్యన్ చెబుతాడు. అలా చేయొద్దు. అటాక్ అనేది వ్యక్తిగతం అంటూ క్లాస్ ఇస్తాడు రిషి. నేను చూసుకోలేనప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే బాగుంటుంది. కానీ నేను చూసుకోగలను అని చెప్పేసి వెళ్లిపోతాడు రిషి.

బయటపెట్టేద్దాం:మరోవైపు రిషి గురించి మాట్లాడుకుంటారు మహేంద్ర. జగతి. నా కొడుకు మనసులో నా స్థానం చెరిగిపోయి ఉంటుందని జగతి అంటుంది. లేదు. మీపై రిషికి ఇంకా ప్రేమ అలాగే ఉంది అని రిషి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అది విన్న జగతి ఎమోషనల్ అవుతుంది. నీ విలువ తెలిసి నీకు దగ్గరవుదాం అనుకున్న సమయానికి మీరు అలా చేసేసరికి తట్టుకోలేకపోయాడు. మంచి చేసిన మీపై కోపం పెంచుకున్నాడు. శత్రువులు మంచిగా కనిపిస్తున్నారు అని మహేంద్ర అంటాడు. అన్నింటికి కారణం శైలేంద్ర. రక్తం రుచి మరిగిన మృగం ఎప్పటికైనా ప్రమాదమే. శైలేంద్ర గురించి చెప్పేద్దాం అని జగతి అంటుంది. రిషి నమ్మడు. వదిన ప్రేమను తలుచుకుంటున్నాడు. శైలేంద్ర మంచోడని అనుకుంటున్నాడని మహేంద్ర అంటాడు. నువ్వు చెప్పిన నమ్మడా. ఇలా ఎప్పటికీ భయపడుతూనే ఉండాలా అని జగతి అంటుంది.


Click it and Unblock the Notifications











