Guppedantha Manasu: రిషికి వసుధార స్ట్రాంగ్ వార్నింగ్.. ఏంజెల్ మనసులో ఉన్నదెవరు?
రిషి గురించి మాట్లాడుకుంటారు మహేంద్ర, జగతి. ఆ రాక్షసుడిని (శైలేంద్ర) బయట పెట్టేద్దాం అని జగతి అంటుంది. రిషి నమ్మడు. వదినా ప్రేమనే తలుచుకుంటున్నాడు. శత్రువులనే మంచివాళ్లు అనుకుంటున్నాడు అని మహేంద్ర అంటాడు. నువ్ చెప్పిన నమ్మడా అని చెప్పిన జగతి రిషి గురించి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అది చూసిన దేవయాని గదిలోకి ఎంట్రీ ఇస్తుంది. ఏంటీ జగతి కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్. రిషి జాడ ఏమైనా తెలిసిందా అని అడిగి.. ఏవండి, శైలేంద్ర అంతా రండి అని పిలుస్తుంది దేవయాని. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 5 శనివారం నాటి ఎపిసోడ్ 834లో ఇంకా ఏం జరిగిందంటే?

ఇరికించేందుకు: ఏవండి జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషి జాడ వీళ్లకు తెలిసినట్టుంది అని దేవయాని అంటుంది. ఎక్కడున్నాడో తెలిస్తే మేము ఎందుకు ఇలా ఉంటాం అని మహేంద్ర బదులిస్తాడు. మేమంతా ఉన్నాం కదా. రిషికి ఏం కాదు. తప్పకుండా రిషి వస్తాడు అని దేవయాని అంటుంది. కాస్తా ఆగిన జగతి.. అవును అక్కయ్య. రిషికి ఏం కాదు.
ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన రిషికి ఏం కాదు. మా ఆశీర్వాదాలు రిషికి ఉన్నాయి. ఎవరి ఎన్ని ప్లాన్స్ వేసినా వాటి నుంచి మా ఆశీర్వాదాలు కాపాడుతుంటాయి అని జగతి అంటుంది. దీంతో ఏమైందమ్మా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని ఫణీంద్ర అడుగుతాడు. దీంతో దేవయాని వైపు కోపంగా చూస్తుంది జగతి.

జంకిన దేవయాని: జగతి చూపులకు కాస్తా జంకిన దేవయాని.. రిషి గురించి ఏదైనా పీడకల వచ్చింటుందండి అని కవర్ చేస్తుంది. రిషి బంగారం. రిషికి ఏం కాదు. నాకెందుకు రిషి త్వరలోనే ఇంటికి వస్తాడని అనిపిస్తుంది అని ఫణీంద్ర అంటాడు. మీరు అన్నది నిజం బావగారు. రిషి తప్పకుండా వస్తాడు అని జగతి అంటుంది.
తర్వాత వెళ్లిపోదాం అని చెప్పి దేవయానిని, శైలేంద్రను తీసుకెళ్లిపోతాడు ఫణీంద్ర. మరోవైపు పవర్ ఆఫ్ స్టడీస్, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి స్టూడెంట్స్ కు వివరిస్తాడు రిషి. సోషల్ మీడియా ఉపయోగం చాలా మందికి తెలియదు. దాన్ని సరిగ్గా వాడుకుంటే మంచి నాలేడ్జ్ ను అందరికీ పంచొచ్చు అని క్లాస్ తీసుకుంటాడు.

సార్ కు ఎలా తెలుసు: రిషి మాటలు విన్న పాండ్యన్.. సార్ మీరు ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశారా అని అడుగుతాడు. అవును, చేశాను. నిరక్షరాస్యత ఉన్న ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుని వాళ్లను చదువు వైపు మోటివేట్ చేసేవాన్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వసుధార మేడమ్ ను అడిగి క్లారిఫై చేసుకోండి అని రిషి అంటాడు. సర్ మొన్న బస్తీలో గొడవ అయింది కదా. ఆవిడకు ఇవి తెలుసా అని రోహిత్ అంటాడు. అదేదే మిస్టేక్ గా జరిగినట్లుంది.
కానీ వసుధార మేడమ్ కు ఇందులో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది అని రిషి చెప్పి వెళ్లిపోతాడు. వసుధార మేడమ్ కు ఇందులో ఎక్స్ పీరియన్స్ ఉందని రిషి సార్ కు ఎలా తెలుసు. వీళ్లిద్దరు కలిసి గతంలో పని చేశారా అని ఒక స్టూడెంట్ అంటాడు. వాళ్లు చదువు గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనం కూడా అలానే చేద్దాం. అనుమానాలు వద్దు అని పాండ్యన్ అంటాడు.

నిలదీయడం బాలేదు: మరోవైపు ఇంట్లో ఫోన్ లో ఎవరినో చూసుకుంటూ ఉంటుంది ఏంజెల్. ఇంతలో అక్కడికి రిషి సార్ అంటూ అరుస్తూ వసుధార వస్తుంది. ఏమైంది వసుధార అని అడిగిన సమాధానం చెప్పకుండా వసుధార పైకి వెళ్తుంది. రిషి గదిలోకి కోపంగా వెళ్తుంది. ఏంటీ మేడమ్ ఇలా వచ్చేస్తున్నారు. ఎందుకు అలా అరుస్తున్నారు అని రిషి అడుగుతాడు. మీకు నా అరుపులే వినిపిస్తున్నాయి.
కానీ నా బాధ అర్థం కావడంలేదు కదా. ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. అయినా మీరు ఒంటరిగా తిరుగుతున్నారు. ఇదేం బాగోలేదు అని వసు ఫైర్ అవుతుంది. ఇలా నా గదిలోకి వచ్చి నన్ను నిలదీయడం అస్సలు బాగోలేదు. గతాన్ని అందరికీ తలెసేలా చేయాలనుకుంటున్నారా అని రిషి అంటాడు.

పట్టించుకోవట్లేదు: గతం, దూరం ఇవన్నీ నేను ఆలోచించాలనికోవడం లేదు అని వసు అంటే.. ఎందుకిలా వెంటపడి వేధిస్తున్నారని రిషి అంటాడు. మీపై ప్రమాదాలు దూసుకొస్తుంటే మీరు మౌనంగా ఉండటం మంచిది కాదు. ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి అని వసు అంటుంది. కన్న తల్లే మోసం చేసింది. దానిముంది ఇదెంత అని రిషి అంటాడు. గతం వద్దని చెప్పి దాని గురించే పదే పదే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కావాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు అని గట్టిగా అడుగుతుంది వసు. ఇంతలో విశ్వనాథం, ఏంజెల్ వస్తారు. ఏమైంది వసుధార. ఏమైనా సమస్య అని విశ్వనాథం అడుగుతాడు.
జాగ్రత్తగా ఉండాలి: రిషి సార్ మంచి లెక్చరర్. ఆయన అవసరం కాలేజీకి ఎంతగానో ఉంది. అలాంటి వ్యక్తి క్షేమంగా ఉంటేనే అందరూ బాగుంటారు. కానీ, రిషి సార్ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొంచెం మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి సార్ అని వసు అంటుంది. ఏమైంది వసు. దేనికి ఇంత కోపంగా ఉన్నావ్ అని ఏంజెల్ అడుగుతుంది. నా మీద అటాక్ జరిగింది కదా. దాని గురించి మేడమ్ భయపడుతున్నారు.
నేను ఒంటరిగా వెళ్లేసరికి మేడంకి కోపం వచ్చింది అని రిషి అంటాడు. నీ వల్ల మన కాలేజీకి పేరొస్తుందని శత్రువులు తలెత్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి. రిషికి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను అని విశ్వనాథం అంటాడు. నా మీద కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్స్ మీరు బయలుదేరండి అని రిషి వెటకారంగా అంటాడు.

సొంత మనిషిలా: ఈ మాత్రం విన్నందుకు అయినా థ్యాంక్స్ అని రిషికి, మళ్లీ ఇది రిపీట్ చేయకండని చెప్పండి సార్ అని విశ్వనాథంకు అంతే వెటకారంగా చెబుతుంది వసుధార. ఆటోలో వసు వెళ్తుంటే కారు అడ్డంగా తీసుకొచ్చి పెడతాడు రిషి. నేను ఏమైపోతే మీకేందుకు. వాళ్లందరి ముందు నన్ను నిలదీయాల్సిన అవసరం ఏముంది అని సీరియస్ అవుతాడు రిషి.
ప్రమాదాలు జరుగుతుంటే అలా ఉండలేని అని వసు అంటుంది. మన గతం బయటపెట్టడం మీ ఉద్దేశమా. నాకోసం మీరెందుకు చేయాలి అని రిషి అంటాడు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మీరేందుకు అలా చేశారు. నేను కూడా సాటి మనిషిగా చేశాను అని వసు అంటుంది. మీరు అలా చేయట్లేదు సొంత మనిషిలా వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు అని రిషి అంటాడు.
మూలాలు చూడకుండా: మీలా నేను ప్రేమను చంపుకుని బతకలేను. మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండలేను అని వసు అంటుంది. నాకు మనసెక్కడ ఉంది. అదెప్పుడో చంపేశావ్ కదా అని రిషి అంటే.. అంతకన్న క్షణం ముందే నా మనసు చచ్చిపోయింది అని వసు బాధగా అంటుంది. ఏదైనా ఉంటే మన ఇద్దరి మధ్య ఉండాలి అని రిషి అంటాడు. ఇద్దరి మధ్య ఏముంది. ఏం లేదని మీరే అంటారు కదా. మాట్లాడేందుకు రమ్మంటే వస్తారా. మాట కూడా వినకుండా వెళ్లిపోతారు అని వసు అంటుంది.
ఇంతకుముందు వసుధారల మొండిగా బిహేవ్ చేస్తున్నారు. ఇలా ప్రవర్తించే ప్రేమను దూరం చేసుకున్నారు అని రిషి అంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమతో చేశాను. కానీ ఇలా దూరమవుతుందని అనుకోలేదు. మూలాలు చూడకుండా పైపై కారణాలు చెప్పి నన్ను దూరం పెడుతున్నారు. ఇక మీ మాటలు వినదల్చుకోలేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసు. పొగరు ఎక్కడా తగ్గదు అని రిషి అనుకుంటాడు.


Click it and Unblock the Notifications











