Guppedantha Manasu: గర్భిణి వేషంతో రిషిపై కత్తితో దాడి.. పాండ్యన్ ఎంట్రీ అదుర్స్.. దొరికిన కీలక ఆధారం
రిషితో మాట్లాడిన తర్వాత రాత్రి ఆటోలో వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు రిషి కూడా తన కారులో వెళ్తుంటాడు. అయితే రిషిని నలుగురు రౌడీలు ఫాలో అవుతుంటారు. అలా నలుగురు వ్యక్తులు రిషిని ఫాలో అవ్వడం చూస్తుంది వసుధార. వారిలో అంతకుముందు రిషిపై అటాక్ చేసిన వ్యక్తి ఉండటంతో ఆలోచనలో పడుతుంది. వీళ్లేంటి రిషి సార్ ను ఫాలో అవుతున్నారు. మళ్లీ అటాక్ ప్లాన్ చేయబోతున్నారేమో అని మనసులో భయపడుతుంది వసుధార. ఆ బైక్ వాళ్లను ఫాలో అవ్వమని అటో డ్రైవర్ కు చెబుతుంది వసు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 7 సోమవారం నాటి ఎపిసోడ్ 835లో ఇంకా ఏం జరిగిందంటే?
వసు అసహనం:వసుధార చెప్పినట్లు బైక్ వాళ్లను ఫాలో అవుతాడు ఆటో అతను. వసుధార ఫోన్ చూసుకుని రోడ్ వైపు చూసేసరికి రౌడీలు కనిపించారు. ఆటో అతన్ని ఆపమని చెప్పి.. వాళ్లు ఎక్కడా అని అడుగుతుంది. ఇప్పటిదాకా ఫాలో అయ్యాను. ఇంతలోనే మిస్ అయ్యారు అని చెబుతాడు. సరే అని లెఫ్ట్ కు వెళ్లు అని అసహనంతో అంటుంది వసుధార. మరోవైపు రౌడీలు ఓ చోట కాపు కాసి ఉంటారు. రౌడీలో ఒకడు శైలేంద్రకు కాల్ చేస్తాడు. మళ్లీ నాకు వాళ్లు తప్పించుకున్నారు వంటి మాటలు వినపడకూడదు అని శైలేంద్ర చెబుతాడు. లేదు సార్ ఈ సారి పని అయిపోతుంది అని రౌడీ అంటాడు. కాల్ కట్ చేసిన తర్వాత ఏరా అంత సిద్ధమా అని మరొకడిని అడిగితే ఒక మహిళ వస్తుంది.

హా చెబుతారు:అంతా కరెక్ట్ గా ఉందని ఆ రౌడీ అంటాడు. ఆ మహిళ గర్భిణి వేషంలో మరో రౌడీతో పక్కన కూర్చుని ఉంటుంది. ఇంతలో రిషి కారులో వస్తుంటాడు. రిషి కారును ఆపి సార్ నా చెల్లెలు. నొప్పులు వస్తున్నాయి. హాస్పిటల్ కు తీసుకెళ్లాలని చెప్పడంతో రిషి కిందకు దిగుతాడు. ఆమెను పట్టుకుని వచ్చి కారు వెనుక డోర్ తీస్తాడు రిషి. ఇంతలో కత్తి తీసి రిషిని పొడవబోతుంది. కానీ, అది చూసిన రిషి పొడవుకుండా ఆపుతాడు. మహిళను అటు నెట్టేసి రౌడీతో ఫైట్ చేస్తాడు. ఇంతలో అక్కడున్న రౌడీలందరూ వస్తారు. అప్పుడు రిషిని పట్టుకుని ఉంటారు. మరొకడు కత్తి తీస్తాడు. రేయ్ నువ్ ఆరోజు అటాక్ చేసిన వాడివే కదా. ఏం కావాల్రా మీకు అని రిషి అంటే.. హా అడగ్గానే చెబుతారు. ఈరోజు నీ పని అయిపోయింది అని కత్తితో ముందుకు వస్తాడు ఆ రౌడీ.

మేడమ్ చెప్పారు:మరోవైపు ఇదంతా నిద్రలో కలగంటుంది జగతి. రిషి వైపు కత్తితో రౌడీ రావడంతో రిషి అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది జగతి. నా మనసు చెబుతోంది మహేంద్ర. రిషికి ఏదో ఆపదొచ్చింది అని అంటుంది. అటువైపు రౌడీ వైపు బైక్ లైట్ వెలుగుతుంది. చూస్తే పాండ్యన్ బ్యాచ్ స్టూడెంట్స్ తో హాకీ స్టిక్స్ పట్టుకుని అదిరిపోయే ఎంట్రీ ఇస్తారు. మా సార్ పైనే అటాక్ చేస్తార్రా అని రౌడీలందరినీ చితక్కొట్టి పారిపోయేలా చేస్తారు. ఆ గొడవ చూసిన వసుధార ఆటో ఆపమని చెప్పి అక్కడే ఉండి చూస్తుంది. ఇంతలో వసుధారకు మహేంద్ర కాల్ చేస్తాడు. అమ్మా వసుధార రిషి ఎలా ఉన్నాడు అని అడిగితే.. నేను మళ్లీ చేస్తాను సార్ అని కంగారుగా పెట్టేస్తుంది వసు. మీరెలా వచ్చారు అని పాండ్యన్ ను రిషి అడిగితే.. మీ వెంట రౌడీలు పడుతున్నారని చెప్పి వసుధార మేడమ్ లొకేషన్ షేర్ చేశారు అని చెబుతాడు. పాండ్యన్ వాళ్లందరిని వెళ్లమంటాడు రిషి.

వీడియో కాల్:స్టూడెంట్స్ వెళ్లగానే రిషి కారు దగ్గరే నిలబడి ఆలోచిస్తుంటే కాస్తా దూరంలో రౌడీ ఫోన్ మోగుతుంటుంది. దానికి శైలేంద్ర కాల్ చేస్తుంటాడు. రేయ్ ఫోన్ లిఫ్ట్ చేయండ్రా అని శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. కానీ, రిషి కాల్ లిఫ్ట్ చేసేలోపు కాల్ కట్ అవుతుంది. వసుధారకు మహేంద్ర మళ్లీ కాల్ చేసి.. జగతి విషయం చెబుతాడు. దీంతో రిషిని వీడియో కాల్ లో జగతికి చూపించి క్షేమంగా ఉన్నారని చెబుతుంది వసుధార. తర్వాత వసుధార అక్కడ ఉండటం చూసి పిలుస్తాడు రిషి. వసుధారను ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెబుతాడు. వసుధార ఆగి ఆలోచిస్తుంటే మళ్లీ గట్టిగా పిలిచేసరికి కారు ఎక్కుతుంది వసుధార. కారులో వెళ్తుంటే వసుకు వాటర్ బాటిల్ ఇస్తాడు రిషి.

అర్థం చేసుకోవడం లేదు:వసుధార ఇల్లు రావడంతో డ్రాప్ చేస్తాడు రిషి. ఒకరిరొకరు ఒకేసారి థ్యాంక్స్ చెప్పుకుంటారు. కాపాడినందుకు రిషి థ్యాంక్స్ అంటాడు. ఇంతకుముందు కూడా మిమ్మల్ని రక్షించాను అని వసుధార అంటుంది. ఆరోజు నన్ను రక్షించలేదు. చంపేశారు. దాని మీద నుంచి చూస్తే ఇది పెద్దది కాదు అని మళ్లీ వసుని బాధపెడతాడు రిషి. అవే మాటలు తలుచుకుని ఇంటి లోపలికి బాధగా వెళ్లిపోతుంది వసు. ఏం జరిగిందమ్మా, అల్లుడు గారు ఏమైనా అన్నారా అని తండ్రి చక్రపాణి అడుగుతాడు. ఏం అనకుంటే రిషి సార్ ఎందుకు అవుతారు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఆయన బాగుండాలనే కదా నా తాపత్రయం అని అంటుంది వసుధార.


Click it and Unblock the Notifications











