Guppedantha Manasu: ఏంజెల్ ఇంట్లో వసుధార రచ్చ.. రిషి ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించి!

రౌడీ ఫోన్ లో శైలేంద్ర వాయిస్ విని అది మీ అన్నయ్యది అని రిషికి చెబుతుంది వసుధార. మీ అన్నయ్య, దేవయాని మీ వెనుక ఎన్ని కుట్రలు పన్నారో మీకు తెలియదు. కావాలంటే సాక్ష్యాలు చూపిస్తానని అంటుంది వసుధార. చాలు వసుధార అని గట్టిగా అరుస్తాడు రిషి. నీ దగ్గర అన్నింటికి సాక్ష్యాలు ఉంటాయి. నాపై కూడా సాక్ష్యాలతోనే అభియోగం మోపారు కదా. అలానే వీళ్ల మీద కూడా సృష్టించి ఉంటారు. మా పెద్దమ్మ, అన్నయ్య గురించి నువ్వే కాదు. ఆ దేవుడు చెప్పినా కూడా వినను అని రిషి అరుస్తాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఆగస్టు 9 బుధవారం నాటి ఎపిసోడ్‌ 837లో ఇంకా ఏం జరిగిందంటే?

మీరు వినుంటే:రిషి గట్టిగా అరిచేసరికి వసుధార తేరుకుంటుంది. పక్కనే ఉన్న ఎస్సై ఆ గొంతు ఎవరిదో గుర్తు పట్టారా అంటే మాట్లాడరేంటి మేడమ్ అని అడుగుతాడు. దీంతో ఇదంతా కల అని వసుధార అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి వాయిస్ ఏంటని అడుగుతాడు. ఫోన్ లో ఒకరి వాయిస్ వినిపించింది. అది గుర్తు పట్టారా అని మేడమ్ ని అడుగుతున్నాను అని ఎస్సై అంటాడు. చెప్పండి మేడమ్ ఆ వాయిస్ గుర్తు పట్టారా అని రిషి అడుగుతాడు. ఆ వాయిస్ మాత్రం తెలిసినట్లే ఉంది. కానీ గుర్తు రావడం లేదు అని వసుధార అంటుంది. ఆ గొంతు మీరు వినుంటే బాగుండేది అని చెప్పిన ఎస్సై ఫోన్ తీసుకెళ్తా అని చెప్పి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu Serial August 9 2023 Today Full Episode 837

పక్కాగా ప్లాన్ చేసిన:వసుధార కూడా వెళ్లిపోతుంటే.. నిన్న జరిగిన విషయం మీ మేడంకి, డాడ్ కు చెప్పారా. ఇక్కడ జరిగిన ప్రతి విషయం వాళ్లకి చెప్పి కంగారు పెట్టి ఇక్కడకు వచ్చేలా చేయొద్దు అని రిషి అంటాడు. మీ డాడ్, మా మేడమ్ ఏంటి సార్ అని వసు అంటే.. గతం వద్దు. ప్రస్తుతంలో ఉండండి. మనం కాలేజీలో తోటి లెక్చరర్స్ మాత్రమే. మన మధ్య ఏ బంధం ఉండదు. ఇక మీరు వెళ్లొచ్చు అని రిషి అంటాడు. మరోవైపు రాత్రి ఆ వెధవలు రిషిని ఏం చేయలేకపోయారు. ఫోన్ కూడా అక్కడే వదిలేశారు. అది రిషికి దొరికిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. ఇంత పక్కగా ప్లాన్ చేసిన చివరి క్షణంలో ఎలా తప్పించుకుంటున్నావురా. నీకు నిజం తెలియకుంటేనే ఇలా ఉంది. తెలిస్తే.. లైఫ్ లో ఇంత టెన్షన్ పడలేదు. అలా జరిగేలోపే నీ ప్రాణాలు తీసేయాలి. కానీ ఎలా అని శైలేంద్ర రగిలిపోతుంటాడు.

నన్ను బెదిరిస్తుందా:తర్వాత రిషి క్లాస్ లో లెస్సన్ చెప్పి కూర్చుంటాడు. సార్ నేను మీతో మాట్లాడాలని వసు మెసేజ్ చేస్తుంది. ఏం మాట్లాడుతారు. మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని రిషి అంటే.. అవసరం ఉంది. నేను వెయిట్ చేస్తానని వసు అంటుంది. క్లాసులో ఉన్నాను. డోంట్ వెయిట్ రిషి అంటే.. క్లాస్ అయ్యాక ఇంటికెళ్లేటప్పుడు కలుద్దాం. నేను మీతో మాట్లాడి తీరాలి. లేకపోతే ఇంటికొస్తాను అని వసు అంటుంది. దీంతో డ్యామ్ ఇట్.. పొగరు తగ్గదుగా అని గట్టిగా అనేస్తాడు రిషి. పాండ్యన్ సార్ అనడంతో అలెర్ట్ అయి. సారీ కానివ్వండి అంటాడు. ఇప్పుడు నన్ను బెదిరిస్తుందా. అయినా కలవను అని రిషి అనుకుంటాడు. కాలేజీ బయట వసుధార కూర్చుని ఉంటుంది.

Guppedantha Manasu Serial August 9 2023 Today Full Episode 837

మీరెవరు మేడమ్:వసుధారను చూసి కూడా పట్టించుకోకుండా రిషి వెళ్లిపోతాడు. సార్ అని పిలిచినా పట్టించుకోడు. కారు ఎక్కబోతుంటే.. చివరిసారిగా అడుగుతున్నా నాతో మీరు మాట్లాడుతురా లేదా అని వసుధార అంటుంది. లేదు అని వెళ్లిపోతాడు రిషి. కట్ చేస్తే విశ్వనాథం ఇంటికి వచ్చిన వసుధార గట్టిగా రిషి సార్ అని అరుస్తుంది. హాల్లోనే ఉన్నా విశ్వనాథం, ఏంజెల్ షాక్ అవుతారు. అన్నంత పని చేసింది అని రిషి కిందకు దిగుతాడు. మీతో మాట్లాడాలని చెప్పాను కదా. ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా వచ్చేశారేంటి. మాట్లాడలాని అడిగినప్పుడు మాట్లాడాలి కదా అని వసు గట్టిగా అంటుంది. నాతో మాట్లాడేదేముంది. మీరెవరు నాతో మాట్లాడటానికి. మీతో నాకేం పని లేదు. ఇంటికి వెళ్లండి మేడమ్ అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial August 9 2023 Today Full Episode 837

విశ్వనాథమే సాక్ష్యం:మీతో నాకు పని ఉంటుంది. మీరు మాట్లాడితేనే కదా తెలిసేది అని వసు అంటే.. ఎందుకమ్మా ఇంత ఆవేశం అని విశ్వనాథం అంటాడు. నేను ఎవరో తనకు తెలుసు. కానీ తెలియదంటున్నారు అని వసు అంటుంది. ఏ హక్కుతో అజమాయిషీ చెలాయిస్తున్నారు అని రిషి అంటాడు. దీంతో వేలికి ఉన్న రింగ్ చూపిస్తుంది వసు. ఇది మా ఎంగేజ్ మెంట్ రింగ్. ఈ హక్కుతోనే అజమాయిషీ చెలాయిస్తున్నాను అని వసు చెప్పడంతో విశ్వనాథం, ఏంజెల్ షాక్ అవుతారు. నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని రిషి అంటే.. మీరు కాల్ చేస్తానన్నారు. అందుకు విశ్వనాథం గారే సాక్ష్యం. లేకుంటే మళ్లీ మీ నట్టింట్లోకి వచ్చి అరుస్తాను అని వసు వెళ్లిపోతుంది. దీంతో ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు రిషి. ఇదంతా నా భ్రమ అనుకుని రిషి చక్రపాణి ఇంటికి వెళ్తాడు.

Guppedantha Manasu Serial August 9 2023 Today Full Episode 837

భయపడుతున్నారు:ఇంటికి వసుధార రావడంతో.. రిషి వచ్చిన విషయం చెప్పడానికి చక్రపాణి బయటకు వస్తాడు. అల్లుడు గారు అని చక్రపాణి అంటే.. హా మీ అల్లుడు గారి గురించి నా దిగులు. అరే చెబితే వినకుండా పంతానికి పోతారే. ఏం మనిషో ఏమో అనుకుంటూ లోపలికి వచ్చిన వసుధార రిషిని చూసి షాక్ అవుతుంది. ఏంటీలా వచ్చారు అంటే.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. గతం అందరికి తెలిసిన వాళ్ల మధ్య మన సంభాషణ జరిగితే మంచిది కదా అని రిషి అంటాడు. కాసేపు పోటాపోటీగా వాదించుకుంటారు. మహేంద్ర సార్ కాల్ చేశారు. మీ గురించి తిండి తినకుండా, నిద్ర పోకుండా భయపడుతున్నారు. మీకు కాల్ చేస్తే మీరు విసుక్కుంటారని మీకు కాల్ చేయకపోవచ్చు. నాకు జాగ్రత్తలు చెబితే మీకు చెప్పినట్టే భావిస్తున్నారు. ఎస్సైకి కాల్ చేసిన ఆ ఫోన్ గురించి వివరాలు తెలుసుకోండి అని వసుధార చెబుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X