Guppedantha Manasu: జగతి ప్రశ్నకు మౌనంగా ఉండిపోయిన రిషి.. టెన్షన్ లో గౌతమ్!

మహేంద్ర గురించి జగతితో మాట్లాడుతాడు రిషి. డాడ్ కి మీరంటే ఎంత గొప్పో ప్రేమో మీ కంటే నాకే బాగా తెలుసు. ఈ విషయం బహుశా మీకు ఇంతవరకు తెలియదేమో. డాడ్ ఆనందం కోసం మిమ్మల్ని ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశాను. డాడ్ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే కానీ, ఇంకొక బంధం కోసమో, ఇంకొక బంధాన్ని కలుపుకోవడం కోసమో కాదు. మీరంటే నాకు గౌరవం ఉంది.

గౌరవమే ఉందని రిషి అంటాడు. రిషి నేను ఎప్పుడో ఇంటికి దూరమయ్యాను. ఇంటికి మాత్రమే దూరమయ్యాను. బంధాలకు కాదుగా.. సంవత్సరాల కొద్దీ మహేంద్రకు దూరమైనా మా బంధం అలాగే ఉందని జగతి అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 1, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 622లో ఏం జరిగిందో చదివేసేయండి.

మీ శిష్యురాలని ఇష్టపడలేదు..

మీ శిష్యురాలని ఇష్టపడలేదు..

డాడ్ కి మీరు దగ్గరగా వచ్చినప్పుడు డాడ్ ముఖంపై చిరునవ్వు కనిపించింది. డాడ్ కి మీరు తోడుగా ఉండాలి. ఎప్పుడు డాడ్ ఆనందంగా ఉండాలి. నా కళ్ల ముందే ఉండాలి. ఇంతకుమించి నేను ఏం కోరువడం లేదని రిషి అంటే.. నేను కూడా జీవితంలో నువ్వు వసుధార ఇద్దరూ.. అని అనేలోపు వసుధారను మీ శిష్యురాలని ఇష్టపడలేదు. వసుధారను వసుధారగానే ప్రేమించానని రిషి అంటాడు.

వసుధారను ప్రేమిస్తున్నావు అన్న విషయాన్ని నీ కంటే ముందు నేనే చెప్పాను. ఆ మాట గుర్తుందా అని జగతి అంటే.. మేడమ్ వసుధార నాతో కలిసి చివరి వరకు ప్రయాణం చేస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదని రిషి అంటాడు. దీంతో సంతోషిస్తుంది జగతి.

ఎప్పటికీ నన్ను క్షమించడు...

ఎప్పటికీ నన్ను క్షమించడు...

రిషి.. డాడ్ అంటే ప్రేమ అన్నావ్.. నేనంటే గౌరవం అన్నావ్.. నేను ఎప్పటికీ జగతి మేడమ్ గా గౌరవాన్ని అందుకోవాలా. జీవితాంతం మేడమ్ అన్న పిలుపుతోనే సరి పెట్టుకోవాలా. నాకు తల్లిగా ఉండే అర్హత దొరకదా.. రాదా రిషి అని ఎమోషనల్ అవుతుంది జగతి. దీంతో రిషి మౌనంగా ఉండిపోతాడు. అక్కడకు వసుధార వస్తుంది.

ఏంటీ ఇద్దరూ మౌనంగా ఉన్నారని అడుగుతుంది వసుధార. మేడమ్ గారికి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు రిషి, మహేంద్రల ఫొటోవైపు చూస్తూ అంకుల్ వాళ్లు ఇక్కడే ఉన్నారని తెలిస్తే వాడు ఎప్పటికీ నన్ను క్షమించడు. ఫ్రెండ్ గా అస్సలు యాక్సెప్ట్ చేయడని భయపడుతూ ఉంటాడు గౌతమ్.

వాటిని చూస్తే నాకు భయమేస్తోంది..

వాటిని చూస్తే నాకు భయమేస్తోంది..

గౌతమ్ కి మహేంద్ర కాల్ చేసి థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు గౌతమ్.. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంకుల్. మీరు ఇక్కడున్న విషయం తెలిస్తే రిషి నన్ను ఎక్కడ కోప్పడతాడో అన్న విషయం తలుచుకుంటూనే భయంగా ఉందని అంటాడు. ఒక మంచిపని కోసం సహాయం చేశావు. నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనని మహేంద్ర అంటే.. అంత పెద్దమాటలు ఎందుకని అంటాడు గౌతమ్.

ఇక్కడ మీ ఫొటో, పర్ఫ్యూమ్, వాచ్ ఉన్నాయి. వాటిని చూస్తే నాకు భయమేస్తోందని గౌతమ్ అంటే.. ఎందుకు భయం, అనవసరంగా టెన్షన్ పడుతున్నావని మహేంద్ర అంటాడు. వాడికి నిజం తెలిసినట్లు, నన్ను దూరం పెడుతున్నట్లు ఏవేవో కలలు వస్తున్నాయని గౌతమ్ అంటే.. అలా ఏం జరగదు టెన్షన్ పడకని చెబుతాడు మహేంద్ర.

ధరణికి వడ్డించిన రిషి..

ధరణికి వడ్డించిన రిషి..

ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. అప్పుడు ఫణీంద్ర.. అమ్మా నువ్వు కూడా కూర్చొని భోజనం చేయని వసుధారను అంటే.. లేదు సార్, నేను జగతి మేడమ్ కి భోజనం తీసుకెళ్లాలని చెబుతుంది. దీంతో దేవయాని కుళ్లుకుంటుంది. అప్పుడు వసుధారను మహేంద్ర పొగుడుతుంటే.. ఫణీంద్ర కూడా మెచ్చుకుంటాడు.

ఆ తర్వాత జగతికి భోజనం తీసుకెళ్లి తినిపిస్తుంది వసుధార. అప్పుడు రిషి భోజనం చేయకుండా వెళ్లిపోతుండగా.. ఏమైందని అందరూ అడుగుతారు. దీంతో తర్వాత తింటానని వెళ్తాడు రిషి. అప్పుుడు తినేందుకని ధరణి కూర్చోవడంతో ఆమెకు రిషి వడ్డిస్తూ ఉంటాడు.

పార్టీ చేద్దామనుకున్నా..

అప్పుడు రిషి నువ్ కూడా తిను అంటే.. నేను వసుధారతో కలిసి తింటానని చెబుతాడు రిషి. దీంతో దేవయాని రగిలిపోతుంటుంది. వసుధారను రమ్మని మెసేజ్ చేస్తాడు రిషి. వసుధార బయటకు రాగానే కాస్తా నీ టైమ్ కావాలి.. మనిద్దరం కలిసి బయటకు వెళ్దామని అంటాడు రిషి. అప్పుడు ధరణి అక్కడికి రావడంతో.. మేడమ్ ని జాగ్రత్తగా చూసుకోండి, మేము బయటకు వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిపోతారు రిషిధార.

డాడ్ వాళ్లు ఇంటికి వచ్చారు కదా.. వసుధారా పార్టీ చేద్దాం అనుకున్నాను. కానీ డాడ్ వాళ్లకి అలా ఉండటంతో మౌనంగా ఉన్నానని రిషి అంటాడు. రిషి ఆనందం చూసి మురిసిపోతుంది వసుధార. ఇద్దరు సిటీలో షికారు కొడుతుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X