Guppedantha Manasu: జగతి-వసుధారపై కాలేజీ స్టాఫ్ మాటల తూటాలు.. దేవయానికి కలిసొచ్చిన అవకాశం!

వనభోజనాల్లో జరిగిన విషయంతో వసుధార బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. వసుధారను జగతి ఓదార్చుతుంది. శత్రుత్వం, ఒంటరి అమ్మాయి అంటూ చెప్పిన జగతి వసుధారను వాళ్ల ఇంటికి వెళ్లమని సలహా ఇస్తుంది. తర్వాత వనభోజనాల్లో జరిగినదంతా మహేంద్రకు చెబుతుంది జగతి. అలాగే వసుధారను వాళ్ల ఊరు వెళ్లమని చెప్పానని జగతి అంటే.. వసుధార వెళితే ఎలా అని మహేంద్ర అంటాడు. వసుధార వెళ్లి మళ్లీ తిరిగి ఈ ఇంటికి రావాలి మహేంద్ర అని జగతి అంటుంది.

వాళ్లిద్దరూ ఎప్పటికీ అధికారికంగా కలిసే ఉండాలి అంటే వారిద్దరూ ఇంట్లోనే ఉండాలి. అంటే.. మనం ఏం చేయాలో మొదట అది ఆలోచించు మహేంద్ర అని జగతి అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 10, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 630లో ఏం జరిగిందో చదివేసేయండి.

 ప్రాజెక్ట్ విషయాలు మెయిల్ చేయు..

ప్రాజెక్ట్ విషయాలు మెయిల్ చేయు..

రిషి, వసుధారను మూడుముళ్ల బంధంతో ఒక్కటి చేయాలి. అందుకు ఏం చేయాలో ఆలోచించు మహేంద్ర అని జగతి చెబుతుంది. మరుసటి రోజు ఉదయం కాలేజీలో మీటింగ్ అరేంజ్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి పొగుడుతాడు రిషి. ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి దేశం అంతటా మంచి స్పందన లభిస్తోందని, ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు.

వసుధార నేను మొన్న ఇద్దరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను కలిసి వచ్చాను. వాళ్లందరి నెంబర్స్ నీకు ఇస్తాను. వారికి నువ్వు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వివరాలను మెయిల్ చేయాలని ఫణీంద్ర చెబుతాడు. దీనికి సరే సార్ అని వసుధార అంటుంది.

జగతి మేడమ్ చాలా జీనియస్..

జగతి మేడమ్ చాలా జీనియస్..

అందరూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో మంచిగా పని చేయాలని రిషి అంటాడు. ఆ తర్వాత కాలేజీ స్టాఫ్ జగతి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్తారు. ఆ మాటలు వింటుంది వసుధార. జగతి మేడమ్ గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. మేడం చాలా జీనియస్. యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలుసా.

ఒకరు మనమధ్య లేనప్పుడు వారి గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడుకున్న మాటలు నేను పూర్తిగా వినలేదు. కానీ మీరు ఏం మాట్లాడారో అంచనా వేయగలను అని వసుధార అంటుంది. మేం ఏం మాట్లాడుకున్నామో తెలియకుండా మాకు సలహాలు ఎలా ఇస్తావు వసుధార అని కాలేజీ స్టాఫ్ మేడమ్ అంటుంది.

బాధపడుతున్న వసుధార...

బాధపడుతున్న వసుధార...

సలహాలు ఇవ్వడం లేదు మేడమ్.. జగతి మేడమ్ గురించి మీరు ఆలోచించే విధానం తప్పుంటున్నాను అని వసుధార అంటుంది. దీంతో వసుధార గురించి కూడా తప్పుగా మాట్లాడి వెళ్లిపోతారు కాలేజీ స్టాఫ్ మేడమ్స్. ఈ సీన్ తర్వాత మహేంద్ర, ఫణీంద్ర, రిషి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటారు.

ఇంతలో ఇంటి నుంచి క్యారేజ్ రావడంతో.. రిషి డైనింగ్ హాల్లో పెట్టమని చెప్పి.. వసుధారను అక్కడికి పంపిస్తాడు. అప్పుడు వాళ్ల ముగ్గురు కలిసి కాలేజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు వసుధార జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.

ఎదుటి వాళ్ల గురించి పట్టించుకోవద్దు..

ఎదుటి వాళ్ల గురించి పట్టించుకోవద్దు..

నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది సార్ అని వసుధార అంటుంది. దీంతో నువ్వు ఏ మూడ్ లో ఎక్కడ ఉంటావో నాకు కాకుండా ఇంకెవరికీ తెలుస్తుంది వసుధార అని అంటాడు రిషి. ఏంటీ డల్ గా ఉన్నావని అడుగుతాడు రిషి. ఏం లేదు సార్ అని చెప్పిన వసుధార.. మేడమ్ వాళ్లు అన్న మాటలు రిషి సార్ కి చెబితే బాధపడతారు.

వద్దులే అని అనుకుంటుంది వసుధార. ఇష్టం లేకపోతే వదిలేయ్ అని రిషి అంటాడు. అనంతరం తన క్లాస్ రూమ్ లో తన జ్ఞాపకాలను రిషితో షేర్ చేసుకుంటూ ఉంటుంది వసుధార. వసుధారో ఏదో మాట్లాడుతుందని అర్థం చేసుకున్న రిషి.. ఎదుటి వాళ్ల గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు. నువ్వు కరెక్ట్ గా ఉండు చాలు అని రిషి చెబుతాడు.

ఇదేదో కలిసొచ్చే టాపిక్..

ఇదేదో కలిసొచ్చే టాపిక్..

వసుధారను రిషి ఓదార్చన తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోకవైపు జగతి కోసం ఓ ఇద్దరు ఇంటికి రావడంతో దేవయాని వాళ్లకి మర్యాదలు చేస్తుంది. జగతిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంది. జగతి గురించి మాట్లాడుతూనే వాళ్లు వసుధార గురించి చెడుగా మాట్లాడటంతో ఇదేదో కలిసొచ్చే టాపిక్ లా ఉందే అనుకుంటుది దేవయాని. ధరణి వచ్చి కాఫీ ఇచ్చి వెళ్లి వంటగదిలో నుంచి వాళ్ల మాటలు చాటుగా వింటుంది. వాళ్లిద్దరూ దేవయానిని పొగుడుతుంటే దేవయాని మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ధరణిని పిలిచి.. వీళ్లను జగతి రూమ్ కి తీసుకెళ్లు అని చెప్పి.. వెళ్లే ముందు నన్ను కలవండని అంటుంది దేవయాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X