Guppedantha Manasu: వసుధార కరెక్ట్ కాదన్న మంత్రి.. రగిలిపోయిన మహేంద్ర
జగతి దగ్గర వుసధార ఉండి మాట్లాడుతుంటే రిషి మెసేజ్ చేస్తాడు. ఎప్పుడు మేడమ్ దగ్గరేనా.. అప్పుడప్పుడూ నాక్కూడా కనిపించాలి కదా అంటాడు రిషి. ఎందుక సార్ అంటే.. ఏమో తెలియదు కానీ, నువ్వు కాసేపు కనిపించకపోతే నాకు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుందని రిప్లై ఇస్తాడు రిషి. గతంలో కాలేజీ ఫంక్షన్ లో నాకు కనిపించేలా కూర్చో అన్న రిషి మాటలు తలుచుకుని వసుధార ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. అదేదో నాకు చెబితే నేను కూడా నవ్వుతానని రిషి అంటే వద్దులేండి సార్ అని వసుధార అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 13, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్ 632లో ఏం జరిగిందో చదివేసేయండి.

నా స్థానంలో వసుధార..
వసుధార, రిషి ప్రేమగా, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జీవితం, జ్ఞాపకాలు అంటూ అనేకమైన ముచ్చట్లు చెప్పుకుంటారు రిషిధార. ఇలా మాట్లాడుకుంటూ పోతే తెల్లారిపోతుంది అని రిషి అంటే.. మీరు మాట్లాడుతుంటే వినేందుకు బాగుంటుంది సార్ అంటూ చేయి పట్టుకుని దగ్గరకు చేరి భుజంపై తల పెడుతుంది వసుధార. కట్ చేస్తే కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విషయంలో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు రిషి. ఈ ప్రాజెక్ట్ ను ఇన్ని రోజులు జగతి మేడమ్ చూసుకున్నారు అని చెప్పి జగతి వీడియో ప్లే చేస్తాడు. అందులో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు, ఆమె స్థానంలో వసుధారను నియమించినట్లు మంత్రి గారు చెప్పారని చెబుతుంది. దీనిపై అందరం ఏకాభిప్రాయానికి రావాలని చెబుతాడు రిషి.

వసుధార కరెక్ట్ కాదని..
ఇంతలో రిషికి మంత్రి నుంచి ఫోన్ వస్తుంది. జగతి స్థానంలో వసుధారను ఉంచాలనుకున్న మాట నిజమే కానీ, రేపటి రోజున ఈ విషయంపై అధికారులు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండదని మంత్రి అంటే రిషి షాక్ అవుతాడు. మీకు ఇష్టం వచ్చిన వాళ్లను నియమిస్తారా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు కదా అని అనడంతో అవును సార్ అని రిషి అంటాడు. తర్వాత కాల్ కట్ చేసి వచ్చిన రిషితో ఏమైందని అడుగుతారు మహేంద్ర, ఫణీంద్ర. వెంటనే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా వసుధారను నియమించడం మంత్రి కరెక్ట్ కాదంటున్నారని అనడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ మాట విన్న కాలేజీ స్టాఫ్ నవ్వుకుంటారు. మహేంద్ర ఏం చేద్దామని అడిగితే.. ఓటింగ్ పెడదామాని చెప్పి వెళ్లిపోతాడు రిషి.

దేవయానిపై రగిలిపోయిన మహేంద్ర..
వసుధార ఆలోచించుకుంటూ బయటకు వెళ్తుంది. ఇంతలోనే కాలేజీ స్టాఫ్ దేవయానికి కాల్ చేసి అసలు విషయం చెబుతారు. కాలేజీ స్టాఫ్ మాటలు వింటుంది వసుధార. మేడమ్.. వసుధార నియామకంపై అభ్యంతరం ఉన్నట్లు మినిస్టర్ గారికి మెయిల్ చేశాం అన్న మాటకు ఉలిక్కిపడుతుంది వసుధార. ఆ తర్వాత ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు జరిగిన విషయాన్ని జగతికి చెప్పి బాధపడతాడు మహేంద్ర. అసలు ఏం జరిగుతుందో అర్థం కావట్లేదని మహేంద్ర అంటే ఇంతలో అక్కడికి వచ్చిన వసుధార.. ఇదంతా దేవయాని మేడమ్ పని అని చెబుతుంది. దీంతో మహేంద్ర కోపంతో రగిలిపోతాడు.

ఈ హోదాలు అవసరమా..
ఎలా అయినా వాళ్లకు గుణపాఠం చెప్పాలి అని మహేంద్ర అక్కడి నుంచి వెళుతుండగా వద్దని, ఈ విషయం మనకు తెలిసిందని దేవయాని మేడమ్ కి తెలిస్తే దీన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకుంటారని వసుధార అంటుంది. మరోవైపు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ రిషి టెన్షన్ పడుతుంటాడు. ఏదేమైనా ఈ సవాల్ ను ఎదుర్కోవాలి అని అనుకుంటుండగా అక్కడికి వసుధార వస్తుంది. ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా నేను ఉండటం అవసరమా అని వసుధార అడుగుతుంది. ఏంటీ అలా మాట్లాడుతున్నావ్.. అని రిషి అంటాడు. ఎందుకో తెలియడం లేదు. కానీ, నాకు ఈ హోదాలు, ఓటింగ్ లు ఇవన్నీ అవసరం లేదనిపిస్తోంది. వేరే ఎవరినైనా ఆ స్థానంలో నియమించండని వసుధార అంటుంది.

వసుధార కోసం ఓటింగ్..
వసుధార మాటలకు.. ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావ్ అని రిషి అంటే.. ఈ విషయంలో లేనిపోని తలనొప్పులు ఎందుకని సార్ అని అంటుంది. అలాగే మనసులో ఈ విషయంలో దేవయాని మేడమ్ హస్తం ఉందని తెలిస్తే ఆవిడ మిమ్మల్ని ఇంకా బాధపెడతారు. అందుకే చెప్పలేకపోతున్నాను అని అనుకుంటుంది వసుధార. ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు వసుధార.. ఓటింగ్ జరగాలి.. జరిపి తీరుతాను స్ట్రాంగ్ గా చెబుతాడు రిషి. అనంతరం మీటింగ్ హాల్లో వసుధార విషయంలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా ఉండాలా లేదా అని ఓటింగ్ నిర్వహిస్తూ ఉంటాడు రిషి. వసుధారకు ఓట్ వేయాలనుకున్నవాళ్లు వచ్చి ఎస్ అని పెట్టండి.. వద్దు అనుకున్నవారు నో అని టిక్ పెట్టండని చెబుతాడు రిషి. ఓటింగ్ ఫణీంద్రతో మొదలుకాగా ఒక్కొక్కరుగా వెళ్లి ఓటింగ్ చేస్తుంటారు.


Click it and Unblock the Notifications











