Guppedantha Manasu: రిషీంద్ర భూషణ్ భార్యగా వసుధార.. షాక్ లో ఉండిపోయిన దేవయాని

ఇంటి ఓనర్ గెంటివేయడంతో లగేజ్ తీసుకుని వెళ్లి అమ్మవారి గుడి దగ్గర ఏడుస్తూ కూర్చుంటుంది వసుధార. కాలేజ్ స్టాఫ్, ఇంటి ఓనర్ అన్న మాటలు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు వసుధార ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న రిషి అక్కడికి వస్తాడు. ఇంటికి వెళదామని చెబుతాడు. ఏ అర్హత ఉందని రావాలి అన్న వసుధార.. ఏ హక్కుతో ఇక్కడికి వస్తున్నావ్.. ఏ హక్కుతో ఇక్కడ ఉంటున్నావ్ అని ప్రశ్నించే కళ్లకు నా దగ్గర సమాధానం లేదు సార్ అని చెబుతుంది వసుధార. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 17, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 636లో ఏం జరిగిందో చదివేసేయండి.

నీకు సమాధానం దొరికే చోటుకి..

నీకు సమాధానం దొరికే చోటుకి..

నేను మా ఊరికి వెళ్లిపోతాను. కష్టం వస్తే ఈ అమ్మ దగ్గరికి వస్తాను. అందరూ తరిమేస్తే మా అమ్మ దగ్గరికి వెళ్లిపోతాను అని బాధగా అంటుంది వసుధార. అప్పుడు వసుధార చేయి అందుకున్న రిషి.. పద వెళదాం అంటాడు. ఎక్కడికి అని వసుధార అడిగితే.. నీకు సమాధానం దొరికే చోటుకి అని తీసుకెళతాడు రిషి.

మరోవైపు జగతికి సేవలు చేస్తుంటాడు మహేంద్ర. జగతి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావ్ అని మహేంద్ర అడిగితే.. మహేంద్ర అక్కయ్య విషపు ఆలోచనల గురించి నీకు తెలిసిందే కదా.. రిషి, వసుధారలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఒకవేళ వాళ్లు మంచి నిర్ణయం తీసుకున్నా అక్కయ్య ఎలాంటి ప్లాన్ వేస్తుందో అని భయంగా ఉందని అంటుంది.

నువ్వు కాసేపు మౌనంగా ఉండు..

నువ్వు కాసేపు మౌనంగా ఉండు..

భయపడకు జగతి.. వారి జీవితానికి సంబంధించిన విషయంలో మంచి నిర్ణయమే తీసుకుంటారు అని ధైర్యం చెబుతాడు మహేంద్ర. ఇంతలో ఇంటికి వసుధారను తీసుకొస్తాడు రిషి. ఇంట్లో అందరరినీ రమ్మని పిలుస్తాడు. ఎందుకు సార్ అందరినీ పిలుస్తున్నారని వసుధార అడిగితే నువ్వు కాసేపు మౌనంగా ఉండు వసుధార.

ప్రశ్నలకు సమాధానాలు కావాలని అడిగావ్ కదా.. నేను చెబుతాను అంటాడు రిషి. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి వసుధారను చూసి షాక్ అవుతుంది. అప్పుడు రిషి, వసుధారలను చూసి జగతి, మహేంద్ర సంతోషపడుతుంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.

ఎవరికైనా అభ్యంతరమా..

ఎవరికైనా అభ్యంతరమా..

ఇంతలోనే వసుధార చేయిని రిషి పట్టుకోవడంతో దేవయాని షాక్ అవుతుంది. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను వసుధార పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అభ్యంతరమా అని అడుగుతాడు రిషి. దీంతో అందరూ వాళ్లిద్దరిని చూస్తూ నిల్చుని ఉంటారు.

పెద్దమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఇష్టం ఉందా లేదా అని అడగడంతో ఇష్టమే రిషి అని అంటుంది దేవయాని. ఆ తర్వాత జగత, మహేంద్ర, ఫణీంద్ర, ధరణిల నిర్ణయం తీసుకుంటాడు రిషి. అప్పుడు అందరూ కూడా ఇష్టమే అని చెబుతారు. దీంతో జగతి, మహేంద్ర నవ్వుకుంటూ ఉంటారు. దేవయాని తిక్క కుదిరిందని అనుకుంటూ ఉంటారు.

జీవితాంతం కలిసి నడిచే భార్యగా..

రిషికి ఏమైంది ఇలా చేస్తున్నాడని తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. వసుధార నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. ఏ అర్హతతో ఇంటికి రావాలి సార్ అని అడిగావ్. ఇప్పుడు చెబుతున్నాను విను. ఈ రిషీంద్ర భూషణ్ భార్యగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టు అని రిషి అనడంతో దేవయాని కంగుతింటుంది.

ఈ రిషీంద్ర భూషణ్ తో జీవితాంతం కలిసి నడిచే భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టు అంటాడు రిషి. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాని దేవయాని షాక్ లో అలానే చూస్తూ నిలబడి ఉంటుంది. వసుధారను లోపలికి తీసుకొచ్చి.. మా ఇద్దరికి పెళ్లి జరిపించండని అనడంతో చేసేది లేక అందరిముందు సరే అని ఒప్పుకుంటుంది.

రగిలిపోయిన దేవయాని..

రగిలిపోయిన దేవయాని..

వసుధార వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడి అప్పుడు పెళ్లి చేద్దామని దేవయాని అంటుంది. మీకు ఏం కావాలో నీ పెళ్లి ఎలా చేయాలో నాకంటే బాగా ఇంకెవరికీ తెలుస్తుంది రిషి అని జగతిని ఉద్దేశించి మాట్లాడుతుంది దేవయాని. అనంతరం వసుధారను లోపలికి తీసుకెళ్తుంది ధరణి. మరోవైపు దేవయాని రగిలిపోతూ ఉంటుంది.

జగతి, మహేంద్ర మాత్రం సంతోషంగా ఉంటారు. మేడమ్ అనడంతో ఇంకా మేడమ్ ఏంటి వసుధార నువ్వు ఇంటికి కోడలుగా అడుగు పెట్టావ్.. అక్క అని పిలువు అని సంతోషంగా మాట్లాడుకుంటారు వసు, ధరణి. నీ గురించి రిషి చెబుతుంటే పెద్దత్తయ్య మొహం చూడాల్సింది అని ధరణి అంటుంది.

రిషి సార్ ని సాధించడమే గొప్ప..

రిషి సార్ ని సాధించడమే గొప్ప..

ధరణి అలా అంటే ఇదంతా ఆవిడ చేసిందే కదా అని వసుధార సమాధానం ఇస్తుంది. ఆవిడను తక్కువ అంచనా వేయొద్దని వసుధార అంటే.. రిషి నీతో ఉన్నంతవరకూ ఆవిడ నిన్ను ఏం చేయలేరని ధైర్యం చెబుతుంది ధరణి. మీ ఇంటికి వెళ్లి యూనివర్సిటీ టాపర్ గా నువ్వు సాధించిన విజయం చెప్పు అని ధరణి అంటుంది. నేను సాధించిన వాటన్నింటిలో కంటే రిషి సార్ ను సాధించుకోవడమే గొప్ప.. నేను సాధించిన విజయాల కన్నా నా భవిష్యత్తు రిషి సార్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది అని వసుధార చెబుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X