Guppedantha Manasu: పెళ్లి సంబంధం కోసం వసు ఊరికి రిషి ఫ్యామిలీ.. కొత్త కుట్రతో దేవయాని!

వసుధారను తనకు కాబోయే భార్య అని చెప్పి ఇంట్లోకి తీసుకువస్తాడు రిషి. వసుధారను పెళ్లి చేసుకోవడంపై ఇంట్లో అందరి అభిప్రాయం తెలుసుకుని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఏ అర్హతతో ఇంటికి రావాలన్నావ్ కదా.. నా భార్య అనే అర్హతతో ఇంట్లోకి రా అని చెబుతాడు రిషి. దీంతో ఇంట్లో అందరూ సంతోషపడుతుంటే.. దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది. వసుధార, రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది జగతి. ఇద్దరూ భార్యాభర్తలుగా ఇంట్లోకి అడుగుపెట్టింది గుర్తు చేసుకుని మనసులోనే ఆనందపడుతుంది. అప్పుడే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 19, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 637లో ఏం జరిగిందో చదివేసేయండి.

గుండెల్లో కోటి వీణలు మోగాయా..

గుండెల్లో కోటి వీణలు మోగాయా..

తన గదిలో రిషి, వసుధార గురించి జగతి సంతోషపడుతూ ఉంటే అంతలో దేవయాని ఎంట్రీ ఇస్తుంది. కొడుకు పెళ్లి అనగానే గుండెల్లో కోటి వీణలు మోగాయా.. పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నారా.. కొడుకు పెళ్లి అనగానే సంతోషపడుతున్నారా.. రిషి నీ కొడుకే కానీ, నా మాట అంటే వేదం. నేనంటే గౌరవం, ఆ గౌరవమే నాకు గొప్ప ఆయుధం అని దేవయాని అంటుంది. దీనికి అక్కయ్యా అన్ని సార్లు ఆయుధాలతో గెలవలేరు. ఆయుధాలు ఎంత బలంగా ఉన్న మానసికంగా దృఢంగా ఉండటం ముఖ్య. వంద ఆయుధాలు ఉన్న గెలుస్తామన్న గ్యారెంటీ ఉండదు కదా అని జగతి అంటుంది.

పేరుకు మాత్రమే నీ కొడుకు..

పేరుకు మాత్రమే నీ కొడుకు..

నువ్వు ఇంకా ఆత్మ విశ్వాసంతోనే ఉన్నావన్న మాట. కానీ ఇక్కడ ఉన్నది దేవయాని. నన్ను దాటి నా అనుమతి లేకుండా నా ఇష్టానికి వ్యతిరేకంగా రిషి, వసుధారల పెళ్లి అవుతుందని నువ్ ఎలా అనుకున్నావ్ జగతి అని అంటుంది దేవయాని. ఏంటీ జగతి నేను ఇలా ఆలోచిస్తానని నువ్వు అనుకేలేదు కదా.. నేను ఇలాగే ఆలోచిస్తాను జగతి. రిషి, వసుధారల పెళ్లి జరగదు. జరగదు గాక జరగదు. ఈ దేవయాని జరగనివ్వదు అని అంటుంది దేవయాని. రిషి పేరుకు మాత్రమే నీ కొడుకు. మిగతా పెత్తనాలన్నీ నావి. ఎందుకంటే రిషికి నా మీద నమ్మకం, గౌరవం ఎక్కువ అంటుంది దేవయాని. నిన్ను అమ్మా అని పిలవడు. గౌరవించడు. వేరీ సారీ జగతి. ఈ పెళ్లి జరగట్లేదు అని అంటుంది దేవయాని.

ఇష్టం ఉంటేనే ఆశ్చర్యపడాలి..

ఇష్టం ఉంటేనే ఆశ్చర్యపడాలి..

దేవయాని మాటలకు అక్కయ్య ఒక్క మాట. మీరు ఇప్పటికే చాలా మాట్లాడారు. నాకు మీ మీద ఇంకా కొంచెం గౌరవం మిగిలి ఉంది. ఎందుకంటే మీరు నాకన్న పెద్దవారు. మీకు ఈ పెళ్లి ఇష్టం ఉంటుందని నేను ఎలా అనుకుంటాను అక్కయ్య. మీకు ఈ పెళ్లి ఇష్టం అంటేనే ఆశ్చర్యపడాలి. ఇష్టం లేదంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం ఏముంది. ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదని నాకు ఎందుకు చెప్పడం. రిషికే చెప్పొచ్చు కదా అంటుంది జగతి. దీనికి రివర్స్ గేమ్స్ ఆడుతున్నావా అని అంటుంది దేవయాని. ఈ పెళ్లి మీకు ఇష్టం లేకపోవడం మీ పర్సనల్ విషయం. అదే విషయాన్ని రిషికి వెళ్లి చెప్పండి అంటుంది జగతి.

కొత్త కుట్రతో దేవయాని..

కొత్త కుట్రతో దేవయాని..

నీకు ఏ మూలానో ఈ పెళ్లి జరుగుతుందని ఇంకా ఆశ ఉన్నట్లు ఉంది. ఈ ఆశలన్నీ వదులుకో. ఇక్కడ ఉంది దేవయాని అని చెప్పి వెళ్లబోతుండగా.. ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏంటీ వదినగారు అంటే.. ఏం లేదు మహీంద్ర. నా మనసులో ఉన్న విషయాలు జగతికి చెప్పాలినిపించింది చెప్పాను. అంతే.. నువ్వు వెళ్లు. నీకు జగతి చెబుతుందిలే అంటుంది దేవయాని. ఏమైంది జగతి అని మహేంద్ర అడిగితే.. రిషి, వసుధార పెళ్లి జరగదని చెప్పింది అంటుంది జగతి. ఏదో కొత్త కుట్రతో అక్కయ్య రెడీగా ఉన్నారు. తన కుట్రలను ఎలాగైనా ఛేదించాలని అంటుంది జగతి. మరోవైపు వసుధారకు రిషి ఫోన్ చేసి.. ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. మిమ్మల్ని చూడగానే నా బాల్యం అన్నీ గుర్తొస్తాయని వసుధార చెబుతుంది.

ప్రేమగా వసుధార, రిషి..

ప్రేమగా వసుధార, రిషి..

రిషి, వసుధార ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. దేవయాని నిద్రపోకుండా ఫోన్ చూస్తూ ఉంటుంది. చీకట్లో ఫోన్ ఏంటీ అని ఫణీంద్ర నిద్రలోనే అడుగుతాడు. ఈ సమయంలో ఫోన్ చేసి ఎవరినీ డిస్టర్బ్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. అందరూ నన్నే డిస్టర్బ్ చేస్తున్నారని కోపంగా బయటకు వెళ్లిపోతుంది దేవయాని. బాల్కనీ వద్ద వసుధార, రిషి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని వస్తుంది. ఏంటీ రిషి ఇక్కడున్నారని అడుగుతుంది. రేపు ప్రయాణం చేయాలి కదా వెళ్లి పడుకోమని రిషికి చెబుతుంది. నువ్వైనా చెప్పాలి కదా వసుధార అంటే.. చలిగా ఉంది మీరు ఈ సమయంలో బయట తిరగకండి.. ఆరోగ్యం జాగ్రత్త అని వసుధార అని వెళ్లిపోతారు.

సంబంధం తెంపుకోవడానికి..

సంబంధం తెంపుకోవడానికి..

రేపే ప్రయాణం.. పెళ్లి సంబంధం కలుపుకోవడానికి.. కాదు కాదు.. సంబంధం తెంపుకోవడానికి అని దేవయాని వెంటనే వసుధార బావ రాజీవ్ కి కాల్ చేస్తుంది శాశ్వతంగా దూరం చేయాలని అంటుంది. దేవయాని ఫోన్ మాట్లాడటాన్ని మహేంద్ర చూస్తాడు. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతుంది అని వచ్చి పలకరిస్తాడు. ఇలా ఆసక్తికరంగా సాగుతోన్న గుప్పెడంతా మనసు సీరియల్ లో తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X