For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: దేవయానికి షాక్ ఇచ్చన వసుధార.. జగతి-మహేంద్ర ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

  |

  రేపే ప్రయాణం.. పెళ్లి సంబంధం కలుపుకోవడానికి.. కాదు కాదు.. సంబంధం తెంపుకోవడానికి అని దేవయాని వెంటనే వసుధార బావ రాజీవ్ కి కాల్ చేస్తుంది శాశ్వతంగా దూరం చేయాలని అంటుంది. అది చూసిన మహేంద్ర అక్కడికి వస్తాడు. మహేంద్రను చూసి షాక్ అయిన దేవయాని.. ఏంటీ చాటుగా మాటలు వింటున్నావా అని అడుగుతుంది. అదేం లేదు.. అలా వెళుతుండగా ఈ టైమ్ లో మిమ్మల్ని ఇక్కడ చూసి వచ్చానంటాడు మహేంద్ర. ఎవరో డబ్బు సాయం అడుగుతున్నారులే అని మ్యానేజ్ చేస్తుంది దేవయాని. తర్వాత మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 20, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 638లో ఏం జరిగిందో చదివేసేయండి.

   ఉన్నపలంగా వెళ్లాలి అంటే కష్టం కదా..

  ఉన్నపలంగా వెళ్లాలి అంటే కష్టం కదా..

  మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని ఏంటి మహేంద్ర మీరు.. ఇంకా ఇలాగే ఉన్నారు. రెడీ అవ్వలేదా.. వసుధార వాళ్ల ఇంటికి వెళ్లాలి కదా అని అంటే వెంటనే ఉన్నపలంగా వెళ్లాలి అంటే కష్టం కదా దేవయాని అని ఫణీంద్ర అంటాడు. అప్పుడు ఉన్నపలంగా ఏంటండి.. పంతులు గారికి ఫోన్ చేసి ముహుర్తం చూడమని చెప్పాను అని అంటుంది దేవయాని. వీళ్లిద్దరికి ఎలాగో పట్టదు. కనీసం నేనైనా ముందుండి ఇలాంటివన్నీ చేయించాలి కదా. ఇలాంటి విషయాల్లో తొందరపడాలి లేకపోతే పనులు జరగవని అంటుంది దేవయాని.

  ఏంటీ అంతా మౌనంగా ఉన్నారు..

  ఏంటీ అంతా మౌనంగా ఉన్నారు..

  ఇంతకీ రిషి ఏం చేస్తున్నాడు.. రెడీ అవుతున్నాడా అని అడుగుతుంది దేవయాని. వంటింట్లో పనులు చేస్తున్న వసుధారను చూసి.. రిషితో కబుర్లు చెప్పుకో అని అంటుంది. అందుకు పర్వాలేదు మేడమ్ అని వసుధార సమాధానం ఇస్తుంది. ఈలోపు ఏ షర్టు వేసుకోవాలా అని ఆలోచిస్తూ వసుధారకి కొన్ని పిక్స్ పంపిస్తాడు రిషి. అది చూసి మీకు ఏదైనా బాగుంటుంది కదా.. మీరు ప్రిన్స్ కదా అని రిప్లై ఇస్తుంది వసుధార. ఎవరకి వారు రిలాక్స్ గా కూర్చొవడంతో.. ఏంటీ అంతా మౌనంగా ఉన్నారని అరుస్తుంది దేవయాని. అప్పుడు దేవయానిపై ఫణీంద్ర ఫైర్ అవుతాడు. వాళ్లను ఏదో ఒకటి అనకపోతే మౌనంగా ఉండలేవా.. నువ్వు ఏదో ఏర్పాట్లు చేస్తున్నావ్ కదా.. నీ పని నువ్వు చేసుకో అని అంటాడు.

  మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో..

  మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో..

  మనం వస్తున్నామని మీ ఇంట్లో వాళ్లకు కాల్ చేసి చెప్పావా అని వసుధారను అడుగుతాడు ఫణీంద్ర. వసుధారను ఏదో ఒకటి అడుగుతుండగా రిషి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు దేవయాని తెగ హడావిడి చేస్తుంది. తర్వాత క్షమించండి.. మీరు ఎవరు నాతో రావొద్దు అని వసుధార అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటీ వసుధార.. మీరెవరు రావొద్దంటున్నావ్.. అని దేవయాని అంటే.. అవును మేడమ్.. మీరు ఈరోజు రావొద్దు.. అని అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది దేవయాని. వసుధార అందరం వెళ్దాం అనుకున్నాం కదా.. ఇప్పుడు వద్దంటావ్ ఏంటి అని అడుగుతాడు రిషి. సర్ మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. అలాంటిది సడెన్ గా వెళ్లి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకే నేను ముందుగా వెళ్లి వాళ్లకు చెప్పి ఆ తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటుంది వసుధార.

  వాళ్లే మిమ్మల్ని పిలిపించేలా చేస్తాను..

  వాళ్లే మిమ్మల్ని పిలిపించేలా చేస్తాను..

  ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు వసుధార అని మహేంద్ర అంటే.. మాది మధ్యతరగతి కుటుంబం. నేను జీవితం మీద లక్ష్యంతో చదువుకోవడానికి ఇలా బయటకు వచ్చాను. పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసాను. ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్నాను అని కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడుతుంది వసుధార. అందుకే ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది. నాకు కొంచెం సమయం కావాలి. అక్కడికి వెళ్లి ఇక్కడ పరిస్థితులు చెప్పి వాళ్లతంతట వాళ్లే మిమ్మల్ని పిలిపించేలా చేస్తాను. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాను. అక్కడ మా నాన్న కోపంతో నన్ను ఒక్క మాట అన్నా పర్వాలేదు. కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నా అది మర్యాద కాదు. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది వసుధార.

  ఏం జరిగినా నీ వెనుక రిషి ఉన్నాడు..

  ఏం జరిగినా నీ వెనుక రిషి ఉన్నాడు..

  దేవయాని ఏదేదో అంటుంటే. వసుధార వాళ్ల నాన్న గురించి మీకు తెలియదు. వసుధార అన్న మాటల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది జగతి. వసుధార చెప్పినదాంట్లో నిజం ఉంది. తన ఇంట్లో పరిస్థితులు మనకు ఎలా తెలుస్తాయి చెప్పండి. తన అభిప్రాయాన్ని గౌరవంచి తనను ఫస్ట్ పంపిద్దామని అనడంతో దేవయాని షాక్ అయి.. అందరూ ఒక్కటయ్యారు అనుకుంటుంది. వసుధార వెళుతూ రిషిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావని అంటే మీ ప్రేమకు అని చెబుతుంది. ఏం జరిగినా నీ వెనుక రిషి ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకో అని చెబుతాడు రిషి. తర్వాత నేను ఒక్కదాన్నే వెళ్లాలనుకున్న నిర్ణయం నాది కాదు సార్.. జగతి మేడమ్-మహేంద్ర సర్ ది అని జరిగిన విషయం తలుచుకుంటుందు వసుధార. నువ్వు రిషి బాగుండాలి వసుధార. దీనికోసం మేం ఇద్దరం ఏం చేయమన్నా చేస్తామని జగతి-మహేంద్ర చెబుతారు.

  English summary
  Guppedantha Manasu Serial December 20 2022 Today Full Episode 638
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X