For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: ఊహించని ట్విస్ట్.. దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి!

  |

  వసుధార కాలేజీలో తనతోపాటు రిషి చక్కర్లు కొడతారు. జగతి ప్రస్తావనను వసుధార తీసుకురాగానే రిషి డల్ అయిపోతాడు. తర్వాత జగతి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ను వసుధారకు ఇస్తాడు. మేడమ్ ఏం పంపించారు అని బాక్స్ వసుధార ఓపెన్ చేస్తుండగా.. మహేంద్ర ఫోన్ చేస్తాడు.

  జాగ్రత్త అని మహేంద్ర చెబితే.. పెద్దమ్మని కంగారు పడొద్దని చెబుతాడు రిషి. నేను కాల్ చేయగానే మీరు ఇక్కడికి రావడానికి రెడీగా ఉండండని చెప్పి కాల్ కట్ చేస్తాడు రిషి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 24, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 642లో ఏం జరిగిందో చదివేసేయండి.

  ఏదైనా నేను తట్టుకోలేను..

  ఏదైనా నేను తట్టుకోలేను..

  కాలేజీలో చక్కర్లు కొట్టిన తర్వాత కారులో వసుధార ఇంటికి బయలుదేరుతారు రిషిధార. ఇంటికి కొంచెం దూరంలోనే కారు ఆపేయమని చెబుతుంది వసుధార. మీరు ఇప్పుడే అక్కడవరకూ రావొద్దు. ఇన్నాళ్లు ఇంటికి దూరమయ్యాను. వాళ్లు కోపంగా ఉంటారు. అరుస్తారేమో. అక్కడ మీరు కనిపిస్తే నా ముందు మిమ్మల్ని ఏదైనా అంటే నేను తట్టుకోలేను సార్.

  వాళ్లు నా కన్నవాళ్లు అయినా సరే.. మిమ్మల్ని ఒక్క మాట కూడా అననివ్వను అని బాధగా అంటుంది వసుధార. జగతి మాటలు గుర్తు చేసుకున్న రిషి సరేనని అంటాడు. నేను కాల్ చేశాకే మీరు వద్దురుగానీ అంటుంది వసుధార. నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను లేట్ చేయకు. మన మధ్య దూరం నేను భరించలేనని బాధగా అంటాడు రిషి.

  ఇలా నిల్చోవాల్సిన అవసరం లేదు..

  ఇలా నిల్చోవాల్సిన అవసరం లేదు..

  నా ప్రాణాన్ని ఇక్కడే విడిచి వెళుతున్నట్లు ఉంది. రేపటికల్లా పరిస్థితులు చక్కబడేలా చేస్తాను అని వసుధార అంటే.. ఎదురుచూస్తాను. మనం కలిసే ఆ రేపటి కోసం. ఈరోజు నువ్వు చేసే కాల్ కోసం అని రిషి అంటాడు. వెళ్లనా సార్ అని వసుధార అంటే.. వెళ్లోస్తాను అంటారు కదా అని రిషి అడుగుతాడు. మీరే వస్తారు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది వసుధార.

  వసుధార వెళ్తుంటే అటువైపే బాధగా చూస్తూ ఉండిపోతాడు రిషి. మరోవైపు ఇంట్లో జగతి పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది. ఏంటీ జగతి బుక్ చదువుతుండగా డిస్ట్రబ్ చేశానా అని దేవాయని అడుగుతుంది. పర్లేదు అక్కయ్య అంటూ నిల్చుంటుంది జగతి. నువ్వు ఇలా నిల్చోవాల్సిన అవసరం లేదు జగతి ఇలా కూర్చో మాట్లాడుకుందాం అని అంటూ జగతిని కూర్చోబెడుతుంది దేవయాని.

  నీలాగా నేను మాట్లాడలేకపోవచ్చు..

  నీలాగా నేను మాట్లాడలేకపోవచ్చు..

  నా మనసులో చాలా బాధగా ఉంది. అది నీతో పంచుకుందామని వచ్చాను. ఎందుకంటే రిషి ఆ వసుధారతో వెళ్తున్న విషయాన్ని మీరు చెప్పలేదు. రిషి కూడా చెప్పలేదు. వెనక్కి రమ్మని చెప్పి రిషికి ఫోన్ చేశాను అని దేవయాని అనడంతో జగతి షాక్ అవుతుంది. ఎందుకు అక్కయ్య.. మీరు రిషి ఇష్టానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు.

  వాళ్లిద్దరూ ఒకరినొకరు కోరుకుంటున్నారు. వెళ్లాలనిపించింది వెళ్లాడు. మీరు వెనక్కి రమ్మని చెప్పడం ఏంటి అది తన ఇష్టం కదా అని జగతి అంటుంది. దీంతో బాగానే మాట్లాడుతున్నావ్ జగతి.. నువ్వు లెక్చరర్ వి కదా నీలాగా నేను మాట్లాడలేకపోవచ్చు. కానీ నేను చేసే పనిలో ప్రయత్న లోపం ఉండకూడదు కదా. నువ్వు నీ శిష్యురాలు కలిసి వల వేసి ప్లాన్ చేసి రిషిని నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారు అని దేవయాని అంటుంది.

  ఎంతసేపు రిషిని అడ్డుపెట్టుకుని..

  ఎంతసేపు రిషిని అడ్డుపెట్టుకుని..

  దేవయాని అన్నమాటలకు అక్కయ్య అని అరుస్తుంది జగతి. ఏంటీ జగతి కోపం వస్తుందా.. నేను అన్నదాంట్లో తప్పేముంది. రిషి మీదకు వసుధారను ఉసిగొలిపింద నువ్వే కదా. వసుధారను అడ్డుపెట్టుకుని రిషితో అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశ ఇంకా చావలేదా. రిషి భవిష్యత్ నాశనం చేస్తున్నావ్. నీకు రిషి అంటే ప్రేమే లేదు అని దేవయాని అనడంతో.. జగతి చాలా సీరియస్ అవుతుంది.

  ఇంకోసారి రిషి మీద నాకు ప్రేమ లేదు అని అనకండి. అసలు మీకు రిషి మీద ప్రేమ ఉందా.. ఎంతసేపు రిషిని అడ్డుపెట్టుకుని పెత్తనం చేయాలి అని చూస్తారు. ఇన్ని రోజుల్లో మీ ఆలోచనలు. మీ విషపు ప్లాన్లు ఏంటో నాకు తెలియదని అనుకుంటున్నారా. మీ గురించి ఒక్కసారి రిషికి చెబితే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా. ఎందుకు ఇన్ని నాటకాలు.

  మీ నిజ స్వరూపం రిషికి తెలిసేలా..

  ఇన్ని రోజులు నా జీవితంతో ఆడుకుని నన్ను మహేంద్రకు కాకుండా దూరం చేశారు. ఇప్పుడు మళ్లీ రిషి జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. నేను ఇంటికి రావడం ఇష్టం లేదు. కానీ రిషి మాట మీద వచ్చాను. నన్ను ఏం చేయలేక వసుధారను అడ్డుపెట్టుకుని రిషిని శిక్షించాలని చూస్తున్నారా అని చాలా సీరియస్ గా అంటుంది జగతి. దీంతో దేవయాని షాక్ అవుతుంది. మనుషులను, బంధాలను విడదీసి మీరు ఏం బాగుపడతారు అక్కయ్య.

  ఇన్నిరోజులపాటు మీరు ఏం సాధించారు. ఇప్పుడు ఏం సాధించబోతున్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది జగతి. నా జోలికి రండి పర్లేదు. నన్ను ఏమైనా చేయండి కానీ, రిషి జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఏ వసుధారను అయితే మీరు చీదరించుకుని అవమానిస్తున్నారో అదే వసుధార త్వరలోనే మీ నిజ స్వరూపం ఏంటో రిషికి తెలిసేలా చేస్తుంది అని జగతి అంటుంది.

  తండ్రి మాటకు వసుధార షాక్..

  తండ్రి మాటకు వసుధార షాక్..

  జగతి మాటలకు కంగుతిన్న దేవయాని టెన్షన్ తో నీ సంగతి, ఆ వసుధార సంగతి తొందర్లేనే తేలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు వసుధార అమ్మ పూజ చేస్తుండగా ఎంట్రీ ఇస్తుంది వసుధార. కూతురుని చూసి తెగ సంతోషపడుతుంది వసుధార తల్లి. తండ్రి దగ్గరికి వెళ్లి యూనివర్శిటీ టాపర్ గా వచ్చాను నన్ను దీవించండి అని అడిగితే ఎందకు వచ్చావ్ అని అంటాడు వసుధార తండ్రి. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార.

  English summary
  Guppedantha Manasu Serial December 24 2022 Today Full Episode 642..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X