twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: వసుధారను ఘోరంగా అవమానించిన తండ్రి.. కాలితో గెంటేసిన చక్రపాణి!

    |

    వసుధార అమ్మ సుమిత్ర పూజ చేస్తుండగా ఇంటిలోపలకి ఎంట్రీ ఇస్తుంది వసుధార. కూతురుని చూసి తెగ సంతోషపడుతుంది వసుధార తల్లి. చాలా కాలం తర్వాత ఇంటికి చేరుకున్న వసుధార తన తండ్రి చక్రపాణి ఆశీర్వదాలు తీసుకునేందుకు వెళ్తుంది. ఇంతలో ఎందుకొచ్చావ్ అని అంటాడు చక్రపాణి. నేను యూనివర్శిటీ టాపర్ గా వచ్చాను అని వసుధార చెబితే సుమిత్ర విని సంతోషిస్తుంది.

    వసుధార తండ్రి మాత్రం నాన్న అని ఎలా పిలుస్తున్నావ్.. నిన్ను కన్న పాపానికి ప్రతిరోజు తల వంచుకుని వీధిలో నడుస్తున్నాను అని అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 26, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 643లో ఏం జరిగిందో చదివేసేయండి.

    నాన్న గొప్పగా పాస్ అయ్యాను..

    నాన్న గొప్పగా పాస్ అయ్యాను..

    పలానా చక్రపాణి కూతురు పెళ్లి పీటలపై నుంచి లేచిపోయింది అని ప్రతి ఒక్కరూ అంటుంటే ప్రాణాలు పోయేలా ఉండేవి అని వసుధార తండ్రి చక్రపాణి అంటే.. ఏవండి ఏం మాట్లాడుతున్నారు.. అమ్మాయి రాక రాక ఇంటికి వస్తే ఇలాగేనా మాట్లాడేది అని వసుధార తల్లి సుమిత్ర అంటుంది. నాన్న నేను గొప్పగా పాస్ అయ్యాను. మంచి పేరు తెచ్చుకున్నాను అని వసుధార అంటే ఎవరికి కావాలి నీ గొప్ప.

    పెళ్లి పీటల నుంచి ఎప్పుడైతే లేచిపోయావో అప్పుడే మీ నాన్న చక్రపాణి చచ్చిపోయాడు. నువ్వు కూడా ఎక్కడో ఒక చోట చచ్చిపోయావ్ అనుకుని బతుకుతున్నాను అని చక్రపాణి అంటాడు. నాన్న నా మీద ఎందుకు ఇంత కోపం అని వసుధార అనడంతో.. చేసిందంతా చేసి ఎందుకు కోపం అంటున్నావా అని ఇంట్లో నుంచి వెళ్లిపో అంటాడు చక్రపాణి.

    ఆడపిల్ల తండ్రిగా పుడితే..

    ఆడపిల్ల తండ్రిగా పుడితే..

    ఏవండి.. ఏంటండి ఇది అని సుమిత్ర అంటే నువ్వు మాట్లాడకు. కోపం వస్తే నేను మనిషిని కాదు అన్న విషయం నీకు తెలుసు కదా. ఊర్లో వాళ్లకు మాట్లాడుకోడానికి ఇంకొక టాపిక్ దొరికింది. ఇన్నాళ్లకు చక్రపాణి కూతురు వచ్చింది. ఎక్కడ ఉందో.. ఏం చేసిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు అని బాధగా చెబుతాడు చక్రపాణి.

    ఆడపిల్ల తండ్రిగా పుడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని కోపంగా అంటాడు చక్రపాణి. దీంతో తండ్రి కాళ్లపై పడి నేను బాగా చదువుకున్నాను నాన్న అని వసుధార అంటే.. వసుధారను కాలితో పక్కకు నెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు చక్రపాణి.

    ఒక్కసారి అయిన ఫోన్ చేయలేదు..

    ఒక్కసారి అయిన ఫోన్ చేయలేదు..

    మరోవైపు హోటల్ రూమ్ తీసుకుంటాడు రిషి. నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను అని వసుధారకు మెసేజ్ చేస్తాడు రిషి. అటువైపు తల్లి సుమిత్ర ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వసుధార.

    నేను అక్కడికి వెళ్లినా కూడా మీ గురించే ఆలోచిస్తూ బాధపడ్డాను అమ్మ అనడంతో.. ఒక్కసారి అయినా ఫోన్ చేయలేదు కదా వసు అని సుమిత్ర అంటుంది. దీనికి ఫోన్ చేసినట్లు తెలిస్తే మళ్లీ నాన్న నీపై ఎక్కడ కోప్పడతాడో అని చేయలేదు. అమ్మ నేను ఏ లక్ష్యంతో అయితే వెళ్లానో అది సాధించాను. యూనివర్శిటీ టాపర్ గా నిలిచాను అని వసుధార అంటే సుమిత్ర సంతోషపడుతుంది.

    కప్పు విసిరికొట్టిన చక్రపాణి..

    కప్పు విసిరికొట్టిన చక్రపాణి..

    వసుధార ఇంట్లో వాళ్ల గురించి అడుగుతుంది. ఏం చెప్పాలి.. మనకు ఆ బాధలు ఎప్పటికీ తప్పవు. అందరూ తలా దిక్కు విడిపోయారు. మీ అక్క మాధవికి ఇంకా కష్టాలు తప్పలేదు అని బాధపడుతుంది సుమిత్ర. అమ్మ నువ్వేం బాధపడకు నేను వచ్చాను కదా. ఒక్కొక్కటి సాల్వ్ చేస్తాను అని ధైర్యం చెబుతుంది వసుధార.

    అన్ని బాగుంటే మన పెద్దక్క కొడుకుని మన దగ్గర పెంచుకుందాం అని సంతోషంగా అంటుంది. యూనివర్సిటీ టాపర్ అయినందుకు కప్పు చూపిస్తూ ఉండగా ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి ఆ కప్పును విసిరి కొడతాడు. ఏం గొప్పగా చేశావని గొప్పగా చెప్పుకుంటున్నావ్. వీధుల్లో నడుచుకుంటూ వెళ్తే ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేయడం చేతకాదని అంటున్నారని చెబుతాడు చక్రపాణి.

    పుట్టినప్పుడే చనిపోయి ఉంటే..

    పుట్టినప్పుడే చనిపోయి ఉంటే..

    నువ్వు గెలిచిన గెలుపు పోయిన పరువు తీసుకువస్తుందా.. నేను అన్న మాటలకు ఇంకా ఎవరైనా అయింటే విషం తాగి చచ్చేవాళ్లు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావ్. సుమిత్ర దాన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పు ఇక్కడే ఉంటే నా పరువు తీస్తుంది.

    ఇది నా కడుపుని ఎందుకు పుట్టిందో. పుట్టినప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేదని చక్రపాణి అంటే సుమిత్ర కుమిలిపోతు ఉంటుంది. మరోవైపు వసుధారకు రిషి కాల్ చేస్తాడు. వసుధార లిఫ్ట్ చేయదు. ఇంట్లో విషయాలను తల్చుకుని వసుధార బాధపడుతుంది.

    రిషికి వసుధార అబద్ధాలు..

    మళ్లీ రిషి కాల్ చేయగా లిఫ్ట్ చేస్తుంది. ఏమైంది ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటీ.. అంతా ఓకే కదా ఏం సమస్య లేదు కదా అని రిషి అడుగుతాడు. ఇది మా ఇల్లే కదా సార్.. ఏం సమస్య ఉంటుంది అని అబద్ధాలు చెబుతూ కవర్ చేస్తుంది వసుధార. నీ వాయిస్ ఎందుకో తేడాగా ఉంది. నిజం చెప్పు వసుధార.

    నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నావ్ కదా.. అని రిషి అడగడంతో.. ఏం లేదు సార్ అని చెప్పి మ్యానేజ్ చేస్తుంది వసుధార. రిషితో ఫోన్ మాట్లాడుతూ అమ్మ వస్తున్నాను.. అని అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత సారీ సర్.. నన్ను క్షమించండి అని అనుకుంటుంది వసుధార.

    English summary
    Guppedantha Manasu Serial December 26 2022 Today Full Episode 643..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X