Guppedantha Manasu: వసుధారను చేయిచేసుకోబోయిన తండ్రి.. షాక్ లో దేవయాని!
ఇంట్లో రిషి, వసుధారల గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది జగతి. ఏం కాదు, అన్నీ రిషి చూసుకుంటాడని మహేంద్ర ధైర్యం చెబుతాడు. అప్పుడు దేవయాని అక్కయ్యను తక్కువ అంచనా వేయకూడదంటూ హెచ్చరిస్తుంది జగతి. అదే సమయానికి దేవయాని వసుధార బావ రాజీవ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. వాళ్ల ప్రేమను చెడగొట్టి.. వాళ్లిద్దరినీ విడగొట్టి.. నా మరదలి మెడలో తాళి కడతాను అని దేవయానితో సవాల్ చేస్తాడు రాజీవ్.
వసుధార బావ అలా అనడంతో పైశాచికంగా నవ్వుతుంది దేవయాని. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 29, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 646లో ఏం జరిగిందో చదివేసేయండి.

జీవితమంటేనే ఊహలు..
మహేంద్ర-జగతిలకు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది ధరణి. అది చూసిన దేవయాని మీరు ఏం జరగాలని ఆశిస్తున్నారో అది జరగనివ్వను అని అనుకుంటుంది. మరోవైపు వసుధారకు ఫోన్ కొనిచ్చిన రిషి.. తనను వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అయినా వసుధార డల్ గానే ఉంటుంది.
ఇంకా కొన్ని గంటలే కదా మనమధ్య ఈ దూరం అని రిషి అంటే.. ఆశిద్దాం సార్.. నేను కూడా కొన్ని అపురూపమైన క్షణాల కోసం ఆశిస్తున్నాను అని వసుధార అంటుంది. ఎందుకు డల్ గా ఉన్నావో అర్థం కావడం లేదని రిషి అంటే.. జీవితమంటేనే ఊహలు అని వసుధార అంటుంది. ఈ ఫోన్ నీకోసమే అని రిషి ఇస్తాడు. అది తీసుకుని వసుధార డల్ గా వెళ్లిపోతుంది.

ఎవడో వచ్చాడంట..
కష్టంలో.. నష్టంలో ఎలాంటి పరిస్థితిలో అయినా నేను నీకు ఉన్నానని గుర్తుపెట్టుకో అని అంటాడు రిషి. వసుధార వెళ్లిపోయేదాకా అలాగే నిల్చుని ఉంటాడు రిషి. వసుధార ఏమైనా దాస్తోందా అని మనసులో అనుకుంటాడు రిషి. ఇంట్లోకి వసుధార వెళ్లేసరికి తండ్రి కోపంతో కూర్చుని ఉంటాడు. తల్లి సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది.
ఎవడో వచ్చాడంట.. ఇది వెళ్లిందట.. నేను పరువు పరువు అని కొట్టుకుంటుంటే అది వెళ్లింది. రానీ.. దాని సంగతి చెబుతాను అని చక్రపాణి అంటుంటే వసుధార ఎంట్రీ ఇస్తుంది. సుమిత్ర టెన్షన్ పడుతుంటుంది. తండ్రిని చూసి భయం భయంగా అడుగు పెడుతుంది వసుధార. ఆగు అని అరుస్తాడు చక్రపాణి.

పెళ్లాంపై అరవడమే గొప్ప..
వాడెవడు అని చక్రపాణి అంటే.. నాన్న మర్యాద అని వసుధార అంటుంది. ఏంటీ మర్యాదా.. ఎవడే వాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు. నువ్వెందుకు వెళ్లావ్. సమాధానం చెప్పాకే లోపలికి రా అని చక్రపాణి అంటే.. నాకు కాబోయే మొగుడు అని వసుధార చెబుతుంది. ఒక్కసారిగా సుమిత్ర-చక్రపాణి షాక్ అయి చూస్తారు. తను నాకు కాబోయే భర్త అన్నాను.
అనవసరంగా ఆవేశపడొద్దు అని వసుధార అంటుంది. ఏం తల్లివే నువ్వు అని సుమిత్రను చక్రపాణి అంటే.. ఇందులో అమ్మ తప్పేముంది. ప్రతి చిన్నదానికి పెళ్లాంపై అరవడం గొప్పేం కాదు అని వసుధార అంటే చక్రపాణి చేయి ఎత్తుతాడు. దీంతో ప్రశాంతగా వినండి.. వచ్చింది రిషి సార్.. మేం ఇద్దరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అని వసుధార అంటుంది. అంతా మీ ఇష్టమేనా అని చక్రపాణి అంటే.. ఇది నా జీవితం నాన్న. నా ఇష్టమే అని వసుధార తేల్చి చెప్పేస్తుంది.

పెద్దరికం అంటే పెత్తనం కాదు..
ఎవడో ఏంటో తెలియదు అని చక్రపాణి అంటే.. తెలియాల్సింది మీకు కాదు నాకు.. అమ్మా పంచాంగం చూసి చెబితే వాళ్లు మన ఇంటికి వస్తారు. పద్ధతి ప్రకారం సంబంధం మాట్లాడాతారు. ఏం టైమ్ కి రావాలో చెప్పు చాలు అని వసుధార అంటే అనుమతి అవసరం లేదా.. అన్నీ నువ్వే మాట్లాడుతున్నావ్ అని చక్రపాణి అంటాడు.
పెద్దరికం అంటే పెత్తనం కాదు. ఓ బాధ్యత. తండ్రి అంటే ప్రేమగా మాట్లాడాలి. కష్టం వస్తే ఓదార్చాలి. కన్నీళ్లొస్తే తుడవాలి. మీకు నేనున్నా అని చెప్పగలగాలి. అంతేకానీ నేను చెప్పిందే వినాలి అంటే దాన్ని పెద్దరికం అనరు. మీ మాట నెగ్గించుకోవడం ముఖ్యం. నీ కూతుర్ల భవిష్యత్తు ఎలా అయినా పోని. అక్కయ్యల పెళ్లిళ్లు అలా మెడలు వంచి చేశావ్. ఇప్పుడేం జరిగింది. ఒక అక్కయ్య చచ్చి బతికిపోయింది. మరో అక్కయ్య బతికి చస్తూ ఉంది.

మీ పరువు కోసం రిషిని వదులుకోలేను..
పెళ్లి విషయంలో మిమ్మల్ని ఎదురించడం నాకు ఇష్టం కాదు. అది నా హక్కు. అక్కయ్యల్లా తలవంచుకుని నువ్వు చెప్పింది వినను. తాళి కట్టించుకోను. రిషి సార్ నా జీవితం. రిషి సార్ తోనే నా జీవితం. నువ్వు సెల్ ఫోన్ పగలగొట్టావ్.. రిషి సార్ కొనిచ్చారు. ఫోన్ అయినా మనసు అయినా, బంధాన్ని అయినా పగలగొట్టడం గొప్ప కాదు. కలపడమే గొప్ప.
ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం గొప్ప అని వసుధార అంటుంది. మేం వద్దన్నా వాడినే పెళ్లి చేసుకుంటావా అని చక్రపాణి అంటే.. ఒక్క మాట విను. అర్థం చేసుకో ప్లీజ్. ప్రేమించాను. పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటాను. వాళ్లు ఇంటికొచ్చి మాట్లాడతారు. మీరు ఒప్పుకుంటే సరేసరి. లేదంటే మీ పరువు కోసం రిషి సార్ ను వదులుకోలేను. ఓ చెడ్డ కూతురని మీరు అనుకున్నా పర్వాలేదు. రిషి సార్ నే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే తనతోనా నా జీవితం అని చెబుతుంది వసుధార.
షాక్ అయిన దేవయాని..
రిషి ఊరంతా తిరుగుతూ వసుధార మాటలు తల్చుకుని ఏమైందా అని ఆలోచిస్తుంటాడు. మరోవైపు వసుధారతో సుమిత్ర నాన్నతో మాట్లాడటం గురించి అడుగుతుంది. నువ్వు ఒకసారి గట్టిగా ప్రయత్నం చేయమ్మా.. నేను ఇలా ఆలోచించకపోతే నా జీవితం కూడా అక్క జీవితం లాగే అయిపోతుంది అని అనడంతో సుమిత్ర ఆలోచలో పడిపోతుంది.
తర్వాత రిషి ఫొటో చూపిస్తే మహారాజులా ఉన్నాడని అంటుంది సుమిత్ర. మరోవైపు దేవయానికి కాల్ చేస్తాడు రిషి. అందరినీ ఒకసారి పిలవమని చెబుతాడు. అందరు వచ్చాక.. వసుధార ఏ క్షణంలోనైనా మనల్ని బయలుదేరమని చెప్పొచ్చు రెడీగా ఉండండని రిషి చెబుతాడు. దీంతో ఇంట్లో అందరూ సంతోషపడితే.. దేవయాని మాత్రం షాక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











