Guppedantha Manasu: షాకింగ్.. బావ రాజీవ్ తో వసుధార పెళ్లి!.. మరి రిషి ఏం చేయబోతున్నాడు?
వసుధారకు జగతి ఫోన్ చేసి అక్కడ అంతా ఓకేనా అని అడగడంతో.. వెంటనే చక్రపాణి గట్టిగట్టిగా అరుస్తాడు. అమ్మ తల్లి టీచరమ్మా అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. రిషి తన కన్న కొడుకు అని జగతి చెప్పడంతో.. అలా అయితే అస్సలు పెళ్లి చేయనని అంటాడు చక్రపాణి. నీ ట్రైనింగ్ వల్ల పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. ఇప్పుడు నీ కొడుక్కి ఇస్తే మా ఇంట్లో వాళ్లందరు చచ్చిపోతారు అని గట్టిగా అరిచి ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 31, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 648లో ఏం జరిగిందో చదివేసేయండి.

తలుపు తీస్తే విషం తాగి చస్తా..
నీ పెళ్లి నా ఇష్టమని వసుధార మీద అరిచి వసుధారను గదిలో పెట్టి గడియ పెడతాడు తండ్రి చక్రపాణి. వసుధార దగ్గరి నుంచి ఫోన్ కూడా లాక్కుంటాడు. వసుధార తలుపు తీయమని బతిమాలాడుతుంది. తలుపు తీస్తే పాడే ఎక్కుతాను అని మంచి నీళ్ల బాటిల్ లో విషం కలుపుకుంటాడు చక్రపాణి. తలుపు తీస్తే అది తాగి చస్తానని సుమిత్రను బెదిరిస్తాడు. ఫోన్ కూడా ఇవ్వొద్దని అంటాడు. దీంతో వసుధార, సుమిత్ర ఇద్దరూ కూలబడి ఏడుస్తూ ఉంటారు. తర్వాత రాజీవ్ కి చక్రపాణి ఫోన్ చేస్తాడు. పరువు, కుటుంబాన్ని కాపాడాలని రాజీవ్ కు చెబుతాడు చక్రపాణి. మరోవైపు ఫోన్ లో చక్రపాణి అన్న మాటలనుమహేంద్రకు జగతి చెబుతుంది.

ఇంత ప్లాన్ చేస్తావా..
రిషికి ఈ విషయం చెబుదామని మహేంద్ర అంటాడు. అందుకు వద్దని జగతి అంటుంది. వసుధార పరిస్థితి ఎలా ఉందో.. ముందు మనం అక్కడికి వెళ్దాం. ఇంట్లో తెలియకుండా వెళ్లాలి అని జగతి అంటుంది. వదినకి అనుమానం వస్తుందేమో అని మహేంద్ర అంటాడు. కానీ, జగతి మాత్రం వెళ్లాలి.. మనం వచ్చేదాగా బావగారు ఇంట్లోనే ఉంటారు. మనం వెళ్తే అక్కడి పరిస్థితి సరి చేయొచ్చు కదా అని అంటుంది జగతి. అయితే మరోవైపు చాటునుండి ఈ మాటలన్నీ దేవయాని వింటుంది. ఇంత ప్లాన్ చేస్తావా అని అనుకుంటుంది దేవయాని. తర్వాత రాజీవ్ కి కాల్ చేసి రిషి కోసం జగతి, మహేంద్ర వాళ్లు అక్కడికి వస్తున్నట్లు చెబుతుంది దేవయాని.

నాన్న ఊరికే బెదిరిస్తున్నారు..
మహేంద్ర వాళ్లు ఎవరూ చూడటం లేదు కదా అని బయటకు వెళ్లబోతుంటే.. ఎదురుపడుతుంది దేవయాని. ఏం తెలియనిదానిలా ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. సామాన్లు, చీరలు కొనాలి అన్నారు కదా.. వాటికోసం వెళ్తున్నాం అని మహేంద్ర అబద్ధం చెబుతాడు. దేవయాని వాళ్లని పంపించేసి తను అనుకున్నది జరగబోతుందని సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు వసుధార గదిలో ఉండి తలుపు తీయ్యమని బతిమిలాడుతూ ఉంటుంది. సుమిత్ర మాత్రం చక్రపాణి బెదిరించిన విషయం గుర్తు చేసుకుని భయపడుతుంది. నాన్న ఊరికే బెదిరిస్తున్నారు. అలా ఏం చేయరు అని సుమిత్ర అంటుంది.

రాజీవ్ తో వసుధార పెళ్లి..
నాన్న వస్తే బయటకు వెళ్లలేను. కనీసం ఫోన్ అయినా ఇవ్వమని అడుగుతుంది వసుధార. ఫోన్ ఇచ్చే సమయానికి చక్రపాణి పూలదండలు పట్టుకుని ఇంట్లోకి వస్తాడు. రాజీవ్ తో వసుధార పెళ్లి చేస్తున్నా అని చక్రపాణి చెబుతాడు. దీంతో వసుధార, సుమిత్ర ఇద్దరూ షాక్ అవుతారు. రిషి సార్ ను పెళ్లి చేసుకుంటాను అని వసుధార అంటుంది. కానీ, చక్రపాణి మాత్రం తన మాట వినకపోతే విషం తాగి చస్తాను అని బెదిరిస్తాడు. దీంతో ఏం చేయలేక సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. చక్రపాణి ఇంట్లో పెళ్లికి అన్నీ రెడీ చేస్తూ ఉంటాడు. అది చూసి తలుపు తీయమని వసుధార వేడుకుంటుంది. కానీ తండ్రి చక్రపాణి మాత్రం సుమిత్రను బెదిరిస్తూనే ఉంటాడు.
నువ్వ వద్దన్నా వస్తున్నా..
ఇంతలో వసుధారకు ఫోన్ వస్తుంది. కానీ చక్రపాణి మాత్రం ఫోన్ ఇవ్వను అని గట్టిగా చెబుతాడు. రిషి చేసిన కాల్ ను లిఫ్ట్ చేస్తుంది సుమిత్ర. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. "ఏం జరుగుతుంది. మీ బావ వచ్చి ఏదేదో వాగి నీకు తనకు పెళ్లి అని అంటున్నాడు. నేను వస్తున్నాను. భయపడకు. మా వాళ్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ బావ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాడు. అందుకే నువ్వు వద్దన్నా నేను మీ ఇంటికి వస్తున్నా" అని రిషి కంగారుగా చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో పంతుల్ని తీసుకుని రాజీవ్ ఇంట్లో అడుగుపెడతాడు. పెళ్లి ఏర్పాట్లు చూసి రాజీవ్ నవ్వుకుంటాడు. మీరు ఇంత కష్టపడి పెళ్లి చేస్తున్నారని చూసి సంబరపడిపోతాడు.


Click it and Unblock the Notifications











