Guppedantha Manasu: రిషి చేతికి గాయం, అల్లాడిపోయిన వసు.. వనభోజనాలకు మంత్రి పిలుపు!

మహేంద్ర వాళ్లు గౌతమ్ ఇంట్లోనే ఉన్నారని అందరికి చెబుతాడు రిషి. దీంతో దేవయాని ఏదో ఒకటి గౌతమ్ ను అనాలనుకుంటుంది. కానీ రిషి అననివ్వడు. ఇదంతా జగతి ప్లాన్ అనుకుని ఆమె దగ్గరికి వెళ్తుంది దేవయాని. మీరు గౌతమ్ ఇంట్లోనే ఉన్నారని తెలిసిందిలే అని అంటుంది దేవయాని. తర్వాత సూటిపోటి మాటలు అంటుంది. రిషి బాధ్యత నీకెలాగూ పట్టదు.

నేనైనా చూసుకోవాలి కదా.. వసుధార వాళ్ల అమ్మానాన్నతో వసుధార పెళ్లి గురించి మాట్లాడివస్తాను. ఆ వివరాలు ఇవ్వు అని జగతిని అడుగుతుంది దేవయాని. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 6, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 626లో ఏం జరిగిందో చదివేసేయండి.

నేను వసుధారను అడగలేదే..

నేను వసుధారను అడగలేదే..

వసుధార పెళ్లి గురించి వాళ్ల ఇంట్లో వాళ్లతో మాట్లాడి వస్తాను అని దేవయాని అనడంతో.. సాధించడానికి వేరే దారి లేక వసుధార వాళ్ల ఊరి వివరాలు అడుగుతోంది. ఏవో కొత్త కుట్రలు చేయాలని ఆలోచిస్తోందని అనుకుంటుంది జగతి. మొత్తానికి గౌతమ్ ని రిషి క్షమించాడు అది చాలు అని జగతి అనుకుంటుంది.

అనంతరం కిచెన్ లోకి వెళ్లిన రిషి.. వెనుతిరిగి వెళ్లిపోతుంటాడు. అది గమనించిన ధరణి ఏమైనా కావాలా అని అడుగుతుంది. టీ, కాఫీ, జ్యూస్ అంటూ తడబడతాడు రిషి. దీంతో వసుధార ఇప్పుడే తన రూమ్ లోకి వెళ్లిందని చెబుతుంది ధరణి. నేను వసుధారను అడగలేదే అని రిషి అంటే.. నాకు తెలుసులే అని నవ్వుతుంది ధరణి.

రిషి చేయికి గాయం..

రిషి చేయికి గాయం..

రిషి వెంటనే వసుధార గదికి వెళతాడు. అది గమనించని వసుధార తన డ్రెస్ ను ఐరన్ చేసుకుంటూ రిషి కోపం గురించి ఏదేదో మాట్లాడుకుంటుంది. జగతి మేడమ్, మహేంద్ర సార్ కి కోపం అస్సలు లేదు. మరి రిషి సార్ కి కోపం ఎలా వచ్చిందో.. వాళ్ల తాతగారికి కోపం ఉందేమో.. అదే రిషి సార్ కి వచ్చిందేమో. అయినా పర్వాలేదులే.. నేను కోపాన్ని కూడా భరిస్తాను. వసుధార నీకు భయం లేకుండా పోతోంది. నేను రిషిని అని ఇమినేట్ చేస్తూ వెనక్కి తిరుగుతుంది. అక్కడ రిషిని చూసి షాక్ అవుతుంది. చేతిలో ఐరన్ బాక్స్ పట్టుకుని రిషితో వాదిస్తుంది వసుధార. ఇంతలో ఐరన్ బాక్స్ రిషి చేయికి తగిలి కాలుతుంది.

వన భోజనాలకు మంత్రి పిలుపు..

వన భోజనాలకు మంత్రి పిలుపు..

వసుధార కంగారు పడుతుంది. నాకున్న కోపానికి ఇది శిక్షా. కాల్చడం ఎందుకు, కంగారు పడటం ఎందుకని అంటాడు రిషి. నాకేం కాలేదులే వదిలేయ్ అని రిషి అన్నా.. వసుధార కంగారు పడిపోతుంటుంది. ఎప్పుడొచ్చారని అడిగితే.. నువ్వు నన్ను తిట్టుకున్నప్పుడే వచ్చానంటాడు రిషి. కాసేపు టీజ్ చేస్తాడు రిషి. గాయం మీకు.. నొప్పి నాకు.. అని వసుధార ఎమోషన్ అవడంతో బాధపడకు అని చెబుతాడు రిషి. ఇంతలో కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. తర్వాత మహేంద్రకు మంత్రి నుంచి కాల్ వస్తుంది. యాక్సిడెంట్ విషయం తెలిసి బాధపడ్డాను. మీరు కోలుకున్నారా అని పరామర్శిస్తాడు మినిస్టర్. ఎప్పటిలానే వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రావాలని పిలుస్తారు మంత్రి.

వసుధారతో గడిపిన సమయం..

వసుధారతో గడిపిన సమయం..

మరోవైపు వర్కౌట్ చేస్తుంటాడు గౌతమ్. రిషి గురించి ఆలోచిస్తూ.. రిషికి తనపై కోపం పోవడం గురించి తలుచుకుని సంతోషిస్తాడు. రిషి గొప్పోడు అనుకుంటాడు. ఆ తర్వాత వన భోజనాల సంగతి ఫణీంద్రకు చెబుతాడు మహేంద్ర. అదే విషయం రిషికి కూడా చెబుతాడు. దీంతో వెంటనే గతంలో వన భోజనాల సమయంలో వసుధారతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు రిషి. ఈ వన భోజనాల గురించి జగతికి వసుధార చెబుతుంది. రిషితో కలిసి చేసిన అల్లరి గుర్తుచేసుకుంటుంది. ఈసారి కూడా మనం బాగా ఎంజాయ్ చేద్దాం అంటుంది వసుధార. మనం అంటున్న వెంటనే ఎంట్రీ ఇస్తుంది దేవయాని.

ప్రశాంతంగా ఉండనివ్వరు..

అసలే జగతికి ఆరోగ్యం బాలేదు. ఇలాంటప్పుడు బయటకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. ఈసారికి జగతిని ఇక్కడే ఉంచేసి మనం వెళదాం అని దేవయాని అంటుంది. మేడమ్ బాగానే ఉన్నారు. తీసుకెళదాం అని వసుధార అంటే.. రిషి ఒప్పుకోడు నేను ఒప్పుకోను అంటుంది దేవయాని. దీంతో అక్కయ్య చెప్పేది నిజమే అంటుంది జగతి. ఇదంతా విన్న మహేంద్ర.. వదినగారు నిర్ణయించుకున్నారు.

జగతికి తోడుగా నేను ఉంటాను మీరు వెళ్లండి అని గౌతమ్ తో అంటాడు. అలా కుదరదని గౌతమ్ అంటే.. వదినగారు రిషి, వసుని ప్రశాంతంగా ఉండనివ్వరు ఏంటో నాకు అర్థం కావడం లేదంటాడు మహేంద్ర. మరోవైపు జగతి దగ్గర వసుధార కూర్చుని ఉంటే.. వసు కోసం డ్రెస్ సెలెక్ట్ చేసే పనిలో ఉంటాడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X