twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: వనభోజనాల్లో రిషిధార రొమాన్స్.. గౌతమ్ సీరియస్ వార్నింగ్!

    |

    వసుధారకు రిషి గిఫ్ట్ గా ఇచ్చిన చీరను కట్టుకుంటుంది. అది చూసి మైమరిచిపోతాడు రిషి. ఆ తర్వాత గులాబీ పెట్టమని వసుధార అడిగితే రిషి అలానే చేస్తాడు. వసుధార జడలో పువ్వు పెట్టి అద్దం ముందు నిల్చుని ఒకరిని మరొకరు చూస్తూ మురిసిపోతుంటారు. ఇంతలో గౌతమ్ పిలవడంతో త్వరగా రా అని చెప్పి బయటకు వెళ్లిపోతాడు రిషి. నీ డ్రెస్ బాగుందిరా అని రిషిని అంటాడు గౌతమ్.

    అలాగే మరి నా డ్రెస్ బాగుందని చెప్పవా అని గౌతమ్ అంటే.. నువ్వు చెప్పావని నేను చెబితే బాగుండదు అని.. కొద్దిసేపటికీ నీ డ్రెస్ కూడా బాగుందిరా అంటాడు రిషి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 8, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 628లో ఏం జరిగిందో చదివేసేయండి.

    కోపంతో రగిలిపోయిన దేవయాని..

    కోపంతో రగిలిపోయిన దేవయాని..

    మరోవైపు కింద దేవయాని నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కిందకి వసుధార చీర కట్టుకుని రావడం చూసిన దేవయాని షాక్ అవుతుంది. తర్వాత ఏం వసుధార కొత్తదా అని దేవయాని అంటుంది. బాగుంది కదా మేడమ్. రిషి సార్ తీసుకువచ్చారని వసుధార అంటుంది.

    దీంతో మరింత షాక్ అవుతుంది దేవయాని. రిషి సెలక్షన్ గురించి వసుధార పొగుడుతూ మాట్లాడడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రోజు రోజుకీ వసుధార ఎక్కువ చేస్తోంది అని అనుకుంటుంది దేవయాని. తర్వాత కాలేజీ స్టాఫ్ కి ఫోన్ చేసి వసుధార విషయలో ఒక ప్లాన్ చెబుతుంది దేవయాని.

    రిషిని చూసి షాక్ అయిన వసుధార..

    రిషిని చూసి షాక్ అయిన వసుధార..

    మరోవైపు మినిస్టర్ ఇంటికి వెళ్లిన పుష్ప వసుధార ఎక్కడుందని కాలేజీ మేడమ్ ని అడిగితే.. రిషి సార్ ఎక్కడున్నారో వసుధార అక్కడే ఉంటుంది వెళ్లి వెతుక్కో అంటుంది. ఇక్కడ రిషి-వసుధార గురించి కామెంట్స్ చేస్తారు. మరోవైపు వంటల దగ్గర వసుధార సలహాలు, సూచనలు ఇస్తుంది. వసుధారను చూసి రిషి మురిసిపోతూ అక్కడకి వెళతాడు.

    అప్పుడు రిషి చెఫ్ గెటప్ లో రావడంతో అందరూ షాక్ అవుతారు. వసుధార దగ్గరికి వెళ్లి గొంతు మార్చి వంట పనులు ఎలా సాగుతున్నాయి అమ్మ అని అనడంతో బాగానే సాగుతున్నాయని వెనక్కి తిరిగిన వసుధార.. రిషిని చూసి షాక్ అవుతుంది. వంట మాస్టారు గారు మా రిషి సార్ కి ఆలూ ఫ్రై చాలా ఇష్టం.. బాగా చేయండి అని చెప్పి రిషితో ఒక సెల్ఫీ దిగుతుంది వసుధార.

    మీ గెటప్ బాగోలేదు..

    మీ గెటప్ బాగోలేదు..

    వనభోజనానికి రావడం చాలా సంతోషంగా ఉందని మాట్లాడుకుంటారు రిషిధార. డాడ్ వాళ్లు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేదని రిషి అంటాడు. అంతకుముందు జరిగిన వనభోజనాలను గుర్తు చేసుకుంటారు ఇద్దరు. తర్వాత ఇక్కడ పనులు చూసుకునేందుకు స్టూడెంట్స్ ని గ్రూపులుగా డివైడ్ చేశారంట అని వసుధార అంటే.. సరే కానీ, ఈ గౌతమ్ గాడు కనపడలేదంటాడు రిషి.

    ఆ వాలంటీర్స్ కి గౌతమ్ సార్ హెడ్ అని వసు చెప్పడంతో ఇంకా సూపర్ అంటాడు రిషి. మీ గెటప్ అంతా బాగలేదు.. తీసేయండని వసు అంటే రిషి తీసేస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా వసుధార డ్రెస్ సరిగా లేకపోవడం చూసి ఏం చేయాలని అని ఆలోచనలో పడతాడు రిషి.

    మీ ఇంట్లో ఇలాంటివి జరగవా..

    మీ ఇంట్లో ఇలాంటివి జరగవా..

    వసుధార డ్రెస్ గురించి ఫొటో తీసి పంపిస్తాడు రిషి. తర్వాత డ్రెస్ సరిచేసుకునేందుకు వసుధార ఇబ్బంది పడుతుంటే రిషి వెళ్లి సహాయం చేస్తాడు. ఇదంతా చూసిన కాలేజీ స్టాఫ్ కొందరు చెడుగా మాట్లాడతారు. ఆ మాటలు విన్న వసుధార షాక్ అవుతుంది. వసు గమనిస్తుందని తెలిసి మరింతగా మాట్లాడతుంది కాలేజీ స్టాఫ్.

    దీంతో వసుధార మౌనంగా వెళ్లిపోతుంది. ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి వారిపై సీరియస్ అవుతాడు. మీరు మాట్లాడింది తప్పు మేడమ్. వసుధార ఇక్కడ అందరి ముందు ఇబ్బింది పడుతుండగా రిషి సహాయం చేశాడు. అలాంటిది మీరు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతారా. మీ ఇంట్లో ఇలాంటివి జరగవా. మీరు ఇన్ని మాటలు అన్న వసుధార ఏం మాట్లాడకుండా వెళ్లింది అంటే అది ఆమె సంస్కారం అని చెబుతాడు గౌతమ్.

    వసుధారకు సారీ చెప్పండి..

    మీరిద్దరూ మాట్లాడిన మాటలు ప్రతి ఒకటి రిషికి చెబితే తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండని వార్నింగ్ ఇస్తాడు గౌతమ్. మీరు వెళ్లి వసుధారకు సారీ చెప్పకపోతే మీరు మాట్లాడిన మాటలు వెళ్లి నేను రిషికి చెబుతాను అని అంటాడు. అనంతరం.. రిషి దగ్గరికి వెళ్లిన గౌతమ్.. మినిస్టర్ గారు వస్తున్నారు.. వెళదాం పదా అంటాడు. వదినా వసుధారను రమ్మని చెప్పండి అని ధరణికి చెబుతాడు రిషి. మరోవైపు కాలేజ్ మేడమ్స్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటుంది వసుధార.

    English summary
    Guppedantha Manasu Serial December 8 2022 Today Full Episode 628..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X