Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్‌కు శుభం కార్డు.. అర్ధాంతరంగా ఆపేయడం వెనుక ట్విస్ట్ అదేనట!
Guppedantha Manasu Serial:బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన సీరియల్ 'గుప్పెడంత మనసు'. తెలుగింట ఈ సీరియల్ కు ఎంతో క్రేజ్ ఉంది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా టాప్ రేటెడ్ సీరియల్ గా రికార్డు క్రియేట్ చేసింది ఈ సీరియల్. సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే.. ఎంతటి ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రిషి సార్‌కి.. సఫరేట్ ఫ్యాన్ ఆర్మీ ఉందంటే.. అతియోక్తి కాదు. అనుకొని కారణాల వల్ల ఆయన సీరియల్ నుంచి బయటకు వెళ్లే.. సోషల్ మీడియాలో కమ్ బ్యాక్ రిషి సార్ అంటూ.. పెద్ద ఎత్తున రిక్వెస్ట్ లు, పోస్టులు వచ్చాయి. ముఖేష్ గౌడ, రిషి సార్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో ఫ్యాన్స్ పేజీలు ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు రీఎంట్రీ ఇచ్చారు రిషి సార్.
ఇక ఈ సీరియల్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇక చెప్పనవసరం లేదు. ఇందులోని వసుధార, జగతి మేడమ్, మహేంద్ర, శైలేంద్ర, ఫణింద్ర భూషణ్ , దేవయాని, ధరణీ వంటి పాత్రలను తమ ఇంట్లో సభ్యులుగానే ఫీల్ అయ్యారు గుప్పెడంత మనస్సు లవర్స్. అయితే.. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్‌కి త్వరలోనే శుభం కార్డు పడబోతుందని తెలుస్తుంది. నాలుగు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినా.. రసవత్తరంగా సాగుతున్న సీరియల్‌కి త్వరలోనే ముగుస్తుందని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.

వాస్తవానికి ఏ సీరియల్ కు అయినా ఎప్పుడొప్పుడు ఎండ్ కావాల్సిందే. ప్రస్తుతం సీరియల్ లోని రిషి సార్ రీ ఎంట్రీ ఇవ్వడం.. కథ రసవత్తరంగా.. ట్విస్టుల మీద ట్వీస్టులు రావడం చూస్తుంటే ఇప్పట్లో శుభం పడేలా లేదని భావిస్తున్నారు సీరియల్ లవర్స్. కానీ, ఈ సీరియల్ కు శుభం కార్డు పడటానికి ఎక్కువ సమయం లేదు. ఇక త్వరలోనే ఈ సీరియల్ ఎండ్ కార్డు పడబోతుందని టీం కూడా ప్రకటించింది. ఇటీవలే గుప్పెడంత మనసు టీం ఫెయిర్ వెల్ పార్టీ కూడా చేసుకుందట. ఈ సీరియల్ ను అర్థంతరంగా ముగించగానికి, ఇంత త్వరగా శుభం కార్డు వేయడానికి కారణమేమిటీ? అని ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ టాప్ రేటింగ్ సీరియల్ హీరో ముకేష్ గౌడ ఆలియస్ రిషి మీడియాతో మాట్లాడుతూ సీరియల్ కు ఇంత త్వరగా ఎండ్ కార్డు వేయడానికి అసలు కారణమేంటో వివరించారు. తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమను చూపించారనీ, తన జీవితంలో ఇలాంటి ప్రేమను తాను చూడలేదని, తన సొంత వారు కూడా ఇలాంటి అభిమానాన్ని చూపించలేదని అన్నారు. అనుకోకుండా తాను సిరీయల్ నుంచి బయటకు వెళ్లిపోతే.. ప్రేక్షకులు ఎంతోగానో భాదపడ్డపడ్డారని, వారి సపోర్ట్ అండ్ లవ్ తోనే మళ్లీ సీరియల్ లోకి రీఎంట్రీ ఇచ్చానని ఎమోషనల్ అయ్యారు.

ఈ సీరియల్ వల్ల కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాననీ, వాళ్లు చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదు.. సోషల్ మీడియాలో ఈ సీరియల్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి ఇష్టపడితే.. మా వాళ్ల ఇంట్లో అబ్బాయిలా చూసుకుంటారనీ, వాళ్ల అభిమానాన్ని పొందడం తన అద్రుష్టమని సంతోషం వ్యక్తం చేశారు.
అయితే.. ఇలాంటి హర్ట్ టచింగ్ సీరియల్ గుప్పెడంత మనసుకు త్వరలో శుభం కార్డు పడబోతుందని ప్రకటించారు. ఎందుకు సీరియల్ త్వరగా ముగించాల్సివచ్చిందో తాను చెపితే బాగోదని, కానీ, మీరు ఎంతగానో ఇష్టపడే రుషి-వసుధారల లవ్ స్టోరీ మాత్రం హ్యాపీ మూమెంట్ తోనే ముగిస్తుందని ముఖేష్ గౌడ వెల్లడించారు.

గీతా శంకరం, ప్రియమైన నీకు అనే సినిమాలో నటించబోతున్నానని తెలిపారు. కామన్ పిపుల్స్ లే కాకుండా.. మాస్ రాజ్ రవితేజ వాళ్ల ఫ్యామిలీ, బహ్మానందం ఫ్యామిలీ కూడా తమ సీరియల్ చూస్తారనీ, వారు ఫ్యాన్ కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఏ కథకు అయినా ముగింపు ఉండాలనీ, అలాగే లాగా దీసుకుంటూ వెళ్తే.. ఆ స్టోరీ ఫీల్ పోతుందన్నారు. రిషి-వసుంధరల ప్రేమకథ కూడా లైఫ్ టైం గుర్తు ఉండాలని, అందుకే ఎలాంటి లాగ్ లేకుండా ముగిస్తున్నట్లు వివరించారు.
ప్రస్తుతం డిసప్పాయింట్ లో ఈ సీరియల్ లవర్స్ కాస్త రిలీప్ ఇచ్చేలా.. గుప్పుడంత మనసు సీరియల్‌కి సీక్వెల్ కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సీక్వెల్‌లో రిషి-మను లు లీడ్ రోల్ లో రాబోతుందట. ఈ సీక్వెల్ అనపమ, మహేంద్రల మధ్య ఉన్న రిలేషన్ గురించి రివీల్ చేసి, రిషి-మను ప్రధాన పాత్రలుగా సాగబోతుందని టాక్. మరి గుప్పుడంత మనసుకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అని తెలియాంటే.. మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..


Click it and Unblock the Notifications











