చీరకట్టులో గిలిగింతలు .. నడుము అందాలతో కవ్విస్తోన్న గుప్పెడంత మనసు బ్యూటీ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్స్‌లో స్టార్ మా హవాకు కారణం సీరియల్స్. గతంలో వచ్చిన కార్తీకదీపం ధాటికి టీఆర్పీల లెక్కలన్నీ మారిపోయాయి. స్టార్ హీరోల సినిమాలకు మించిన టీఆర్పీతో ఈ సీరియల్ వెలుగొందింది. అలాగే ఇందులోని నటీనటులకు సినీనటులకు మించిన స్టార్ డమ్ దక్కింది. కార్తీకదీపం తర్వాత అంతటి హవా చూపించిన ధారావాహిక గుప్పెడంత మనసు.
స్టూడెంట్ - లెక్చరర్ మధ్య ప్రేమ, తల్లిని అపార్ధం చేసుకున్న కొడుకు వంటి అంశాల చుట్టూ అల్లిన ఈ సీరియల్ దుమ్మురేపింది. ఒకానొక సమయంలో కార్తీకదీపంను సైతం వణికించిన ఘనత గుప్పెడంత మనసుది. ఎంతో పాపులరైన ఈ సీరియల్ టైమింగ్స్‌ను ఇష్టమొచ్చినట్లు మార్చేయడంతో టీఆర్పీపై పడింది. తొలుత రాత్రి 7 గంటలకు ప్రసారమైన ఈ సీరియల్‌ను సాయంత్రం 6 గంటలకు మార్చారు. తర్వాత మధ్యాహ్నం 12.30కి మార్చారు. దీంతో ఈ సీరియల్ ఎప్పుడొస్తుందో తెలియక ఫ్యామిలీ ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు.

ఈ సీరియల్‌కు జగతి, రిషి, వసు క్యారెక్టర్‌లే కీలకం. అంతగా ప్రేక్షకులు ఆ క్యారెక్టర్స్‌తో మమేకమయ్యారు. అలాంటిది జగతి క్యారెక్టర్‌ను చంపేసిన తర్వాత సీరియల్‌లో పసలేకుండా పోయింది . ఈ క్రమంలో హీరో క్యారెక్టర్ కొద్ది నెలలు కనిపించకుండా పోయింది. మొత్తానికి కిందా మీదా పడి 1168 ఎపిసోడ్స్ వద్ద గుప్పెడంత మనసుకు శుభం కార్డ్ వేశారు. అయితే అసంపూర్తిగా సీరియల్‌ను ముగించారంటూ బుల్లితెర లవర్స్ మండిపడ్డారు కూడా.
ఈ సీరియల్‌లో నటించిన ముఖేష్ గౌడ, రక్ష గౌడతో పాటు జగతి మేడమ్‌గా కనిపించిన జ్యోతిరాయ్ ఫ్యామిలీ ఆడియన్స్‌తో యూత్‌లోనూ క్రేజ్ దక్కించుకున్నారు. వీరిలో హీరో రిషికి ఫ్రెండ్‌గా నటించిన ఏంజెల్ కూడా తన గ్లామర్‌తో అట్రాక్ట్ చేశారు. ఈ ఏంజెల్ అసలు పేరు అవంతిక మున్ని. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఈమె స్వస్థలం. గుప్పెడంత మనసు సీరియల్‌కి ముందు అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లికూతురు సీరియల్స్‌లో ఆమె నటించారు. సీరియల్సే కాదు పలు సినిమాల్లోనూ అవంతిక కనిపించారు.
రొమాంటిక్ క్రిమినల్స్, అబ్బో నా పెళ్లంట, ఐపీఎల్, అంతేలే కథ అంతేలే, బీకాంలో ఫిజిక్స్ వంటి సినిమాలలో ఆమె తళుక్కున మెరిశారు. కానీ ఇవన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలే కావడంతో పెద్దగా గుర్తింపు రాలే. అయితే గుప్పెడంత మనసులో ఏంజెల్ పాత్ర ద్వారా ఆమెకు పాపులారిటీ దక్కింది. బయట ఈమె కనిపిసంతే ఏంజెల్ అనే పిలుస్తున్నారంటే అవంతిక ఎలాంటి ముద్ర వేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అవంతిక.. తన సీరియల్స్, షోలు ఇతర వివరాలను పంచుకుంటూ ఉంటారు. చీరతో పాటు ట్రెడిషనల్ డ్రెస్‌లోనూ మెస్మరైజ్ చేస్తుంటారు అవంతిక. తాజాగా చీరకట్టులో తన అందాలను ఆరబోస్తూ ఆమె చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం అవంతిక అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











