గ్లామర్ డోస్ పెంచిన జగతి మేడమ్.. అందాల ఆరబోతతో హీట్ పుట్టిస్తున్న జ్యోతిరాయ్
Jyothi Rai: గుప్పెడంత మనస్సు అనే సీరియర్ ద్వారా 'జగతి మేడమ్'గా పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతిరాయ్. ఈ అమ్మడు తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు తాజాగా కేవలం సీరియల్స్ ల్లోనే కాదు. యాడ్స్, స్టార్ట్ ఫీల్స్, వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది. తాజాగా హీరోయిన్ గా వెండి తెరపై కూడా నటించబోతుంది. అయితే.. సీరియల్లో ఎక్కువగా చీరల్లోనే కనిపించేది. ఆఫ్ స్క్రీన్ మాత్రం చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా యూత్ నే టార్గెట్ చేస్తూ జ్యోతి రాయ్ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఓ ఫోటోలు ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
'గుప్పెడంత మనస్సు' అనే సీరియర్ ద్వారా 'జగతి మేడమ్ 'గా పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతిరాయ్ (Jyothi Rai). ఇక గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో హుందాగా.. రిషికి తల్లిగా చీరకట్టుతో గృహిణిలా కనిపించింది. వాస్తవానికి జ్యోతి రాయ్ మోడల్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ రంగంలో తన అందచందాలతో మెప్పించి, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా'అనే సీరియల్ లో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఇలా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు తమిళం, తుళు భాషల్లో పలు సీరియల్స్ లో నటించింది.

ఈ ఫేమ్ తో తెలుగు సీరియల్ లో కూడా నటించి అవకాశం అందుకుంది. ఇలా తొలుత 'కన్యాదానం' అనే సీరియల్ కనిపించింది. కానీ ఈ సీరియల్ తో అంతగా గుర్తింపు రాలేదు. కానీ,'గుప్పెడంత మనసు' అనే సీరియల్ లో జగతి అనే పాత్రలో నటించి, తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను దగ్గరైంది. ఈ పాత్రతో జ్యోతి రాయ్ రేంజ్ అమాంతం పెరిగింది. జగతి మేడమ్ గా పాపులారిటీ సొంతం చేసుకుంది. జ్యోతి రాయ్ అనే పేరుతో కన్న జగతి మేడమ్ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుంది.
జ్యోతి రాయ్ కేవలం సిరియల్స్ లోనే కాకుండా.. 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి పలు సినిమాల్లో కూడా నటించింది. అలాగే.. దియా, గంధాడ్ గుడి, 99, మడిపు, 'ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్‌లు నటించింది. ఇలా సినిమాలు, సిరియల్స్, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది జ్యోతి రాయ్. త్వరలో మరోసారి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందు రాబోతుంది. జ్యోతిరాయ్ తన భర్త పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కిల్లర్' అనే యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్స్, మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. సీరియల్స్, యాడ్స్, స్టార్ట్ ఫీల్స్, వెబ్ సిరీస్ ల్లో హల్చల్ చేసే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తరుచు.. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ.. ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. తాజాగా జ్యోతి రాయ్ తన లేటెస్ట్ హాట్ ఫోటోలను సోషల మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఈ అమ్మడు తన మత్తెక్కించే చూపులతో మెస్మారైజ్ చేస్తోంది. ఈ ఫోటోలతో జ్యోతి రాయ్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.


Click it and Unblock the Notifications











