హద్దులు దాటేసిన జగతి మేడం.. పొట్టి గౌనులో అక్కడ టాటూ చూపిస్తూ అరాచకం!
స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు నాట పాపులర్ అయ్యారు జ్యోతిరాయ్ అలియాస్ జగతి మేడం. అసలు పేరు కంటే జగతి మేడంతోనే ఫేమ్ సంపాదించారు జ్యోతిరాయ్. సీరియల్స్‌కు బ్రేక్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన పలు చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
కన్నడ సీరియల్స్‌లో ఎంట్రీ
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం కన్నడ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఛానెల్‌లోని సీరియల్ చూసినా అందులో కన్నడ నటీనటులు ఉండాల్సిందే. ఈ కోవలోనే కర్ణాటక నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జ్యోతిరాయ్ అలియాస్ జయశ్రీ రాయ్. అక్కడి మడికెర ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ... తొలుత కన్నడలో పలు సీరియల్స్‌లో నటించారు. దియా, సప్లయర్ శంకర, జెర్సీ నెంబర్ 10 తదితర సీరియల్స్‌లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

జగతి మేడంగా స్టార్‌డం
ఈ దశలో తెలుగు ఇండస్ట్రీ నుంచి జ్యోతిరాయ్‌కి ఆహ్వానం అందింది. కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆమె పలకరించారు. ఇక్కడ పలు ధారావాహికలలో నటించినప్పటికీ గుప్పెడంత మనసు సీరియల్ ఆమె నట జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇందులో జగతి మేడంగా కట్టుకున్నారు జ్యోతి. తన శిష్యురాలికి మార్గదర్శకత్వం చేసే టీచర్‌గా, బిడ్డ కోసం తపించిపోయే తల్లిగా, కుటుంబానికి దూరంగా ఉన్న ఇల్లాలిగా అద్భుతంగా నటించారు జ్యోతిరాయ్. అయితే ఈ సీరియల్ టాప్ రేటింగ్‌తో సాగుతున్న దశలో జగతి పాత్ర చనిపోవడంతో ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. ఇది చాలాకాలం పాటు గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్‌పై ప్రభావం చూపిందంటే జ్యోతిరాయ్ ఎలాంటి ముద్ర వేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
హీరోయిన్‌గా జగతి మేడం
తొలుత పద్మనాభ అనే వ్యక్తితో జ్యోతిరాయ్ పెళ్లి జరిగింది. అయితే దర్శకుడు సుక్కు పూర్వజ్‌కు దగ్గరైన ఆమె తన భర్తకు విడాకులిచ్చి.. సుక్కూని పెళ్లాడారు. ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో పలు చిత్రాలలో నటిస్తున్నారు. కిల్లర్, మాస్టర్ పీస్, ప్రెట్టి గర్ల్ అనే సినిమాలలో జ్యోతిరాయ్ నటిస్తున్నారు. వీటిలో కిల్లర్ టీజర్‌ను కొద్దిరోజుల క్రితం విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే కిల్లర్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. సూపర్ షీ క్యారెక్టర్‌లో జ్యోతి యాక్షన్, గ్లామర్ పరంగా ఇరగదీశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డ్రాగన్‌లో జ్యోతిరాయ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పొట్టి గౌనులో హల్‌చల్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జ్యోతిరాయ్.. తన వ్యక్తిగత వివరాలు, సినిమాలు, ఇతర సంగతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులు మిగులుస్తుంటారు. తాజాగా పొట్టి గౌను వేసుకుని, ఎదపై టాటూ చూపిస్తూ జ్యోతిరాయ్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. దాంతో రోజు రోజుకు మీ అందం వయసు తగ్గిపోతోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం జగతి మేడం అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











