జగతి మేడం కిల్లింగ్ లుక్స్ .. నాలుగు పదుల వయసులోనూ మత్తెక్కిస్తోన్న పరువాలు
సీరియల్స్ బ్యూటీస్ ఈ మధ్య అందంలోనూ , నటనలోనూ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువేనంటారు విశ్లేషకులు. ఈ కోవలోకే వస్తారు గుప్పెడంత మనసు ఫేమ్ జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్. ఈవిడ అసలు పేరును మరిచిపోయిన జనం జగతి మేడం అంటేనే ఇష్టపడతారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోయే జ్యోతిరాయ్ తాజాగా పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.
సీరియల్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ధారావాహికలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో జ్యోతిరాయ్ బిజీగా ఉంటున్నారు. కిల్లర్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్, ఏ మాస్టర్ పీస్ సినిమాలలో నటిస్తున్నారు. అలాగే ప్రెట్టి గర్ల్ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌లో జ్యోతిరాయ్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. వీటిలో కిల్లర్ తొలుత రెడీ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి కిల్లర్ పార్ట్ 1 అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జ్యోతిరాయ్ లేడీ రోబో క్యారెక్టర్‌లో నటిస్తున్నారు.

కర్ణాటకలోని మడికెర ప్రాంతానికి చెందిన జ్యోతిరాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్ . తొలుత తన మాతృభాషలోనే పలు సీరియల్స్‌లో నటించారు. దియా, సప్లయర్ శంకర, జెర్సీ నెంబర్ 10 తదితర సీరియల్స్‌లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా సప్లయర్ శంకర సినిమాలోని సరళ పాత్రతో ఈమె పేరు టెలివిజన్ రంగంలో మారుమోగింది.
కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన జ్యోతి రాయ్ కెరీర్‌ను గుప్పెడంత మనసు సీరియల్‌లో మలుపు తిప్పింది. ఇందులో జగతి మేడంగా పద్ధతిగా కనిపించి తల్లి , గురువు అంటే ఇలా ఉండాలి అన్నంతగా ఆకట్టుకున్నారు ఈ కన్నడ కస్తూరి. గతంలో పలు ధారావాహికల్లో నటించినా రానీ గుర్తింపు గుప్పెడంత మనసులో జగతి క్యారెక్టర్‌తో జ్యోతి రాయ్ సంపాదించారు. కానీ సీరియల్ మధ్యలోనే ఈమె క్యారెక్టర్ చనిపోవడాన్ని బుల్లితెర ప్రేక్షకులు, ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ క్యారెక్టర్ లేకపోవడంతో సీరియల్ అంతగా ఆకట్టుకోలేక త్వరగా శుభం కార్డ్ పడిందని విశ్లేషకులు అంటారు. అయినప్పటికీ జ్యోతీరాయ్‌గా కంటే జగతి మేడంగానే ప్రేక్షకులు ఆమెను గుర్తుంచుకుంటారు.
ఇక జ్యోతిరాయ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 20 ఏళ్ల వయసులో పద్మనాభ అనే వ్యక్తిని జ్యోతిరాయ్ పెళ్లి చేసుకున్నారు. అయితే యువ దర్శకుడు సురేష్ కుమార్ అలియాస్ సుక్కూ పూర్వాజ్‌తో ప్రేమలో పడిన జగతీ మేడం.. అతనిని రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఆమె అతని దర్శకత్వంలోనే సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. తన భర్త దర్శకత్వంలోనే కిల్లర్‌లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జ్యోతిరాయ్ తన వ్యక్తిగత విషయాలు, సీరియల్స్ ఇతర విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పర్పుల్ కలర్ చీరలో జ్యోతిరాయ్ చేసిన హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











