40 ఏళ్ల వయసులో రెచ్చగొట్టేలా జ్యోతి రాయ్.. చీరకట్టులో జగతి మేడం అందాల జాతర!

టెలివిజన్ రంగంలోని నటీనటులకు ప్రస్తుతం సినీ నటులను మించిన క్రేజ్, ఫాలోయింగ్ ఉంటోంది. నేమ్ అండ్ ఫేమ్ కానీ , పారితోషికం విషయంలో కానీ వారు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇక సీరియల్స్ హీరోయిన్స్ కానీ ఇతర మహిళా నటులైతే స్టార్ హీరోయిన్లను మించిన అందంతో దూసుకెళ్తున్నారు. ఈ కోవలోకే వస్తారు బుల్లితెర, గుప్పెడెంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్.

కర్ణాటకలోని మడికెర ప్రాంతానికి చెందిన జ్యోతిరాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్ . స్థానికంగానే చదువుకున్న ఈమె తొలుత కన్నడంలోనే పలు సీరియల్స్‌లో నటించారు. దియా, సప్లయర్ శంకర, జెర్సీ నెంబర్ 10 ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సప్లయర్ శంకర సినిమాలోని సరళ పాత్రతో ఈమె పేరు మారుమోగింది.

guppedantha manasu serial fame jyoti rai stunning look with saree

కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన జ్యోతీ రాయ్ ‌కెరీర్‌ను గుప్పెడంత మనసు సీరియల్‌లో మలుపు తిప్పింది. ఇందులో జగతి మేడంగా , కొడుకు కోసం తపించిపోయే తల్లి క్యారెక్టర్‌లో ఆమె అద్భుతంగా నటించారు. అంతకుముందే తెలుగు టెలివిజన్ రంగంలో పలు ధారావాహికల్లో నటించినా రానీ గుర్తింపు గుప్పెడంత మనసులో జగతి క్యారెక్టర్‌తో జ్యోతి రాయ్ సంపాదించారు. ఇప్పటికీ జ్యోతీరాయ్‌గా కంటే జగతి మేడంగానే ప్రేక్షకులు ఆమెను గుర్తుంచుకుంటారు.

20 ఏళ్ల వయసులో పద్మనాభ అనే వ్యక్తితో జ్యోతిరాయ్ పెళ్లి చేసుకుంది. అయితే యువ దర్శకుడు సురేష్ కుమార్ అలియాస్ సుక్కూ పూర్వాజ్‌తో ప్రేమలో పడిన జగతీ మేడం.. అతనిని రెండో పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఆమె తాజాగా సిల్వర్ స్క్రీన్‌పైనా అడుగుపెట్టింది. తన భర్త దర్శకత్వంలోనే కిల్లర్ అనే సినిమాలో నటిస్తోంది. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి కిల్లర్ పార్ట్ 1 అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జ్యోతిరాయ్ లేడీ రోబో క్యారెక్టర్‌లో నటిస్తున్నారు.

మొన్నామధ్య తన వయసు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది జ్యోతిరాయ్. అందరూ అనుకున్నట్లుగా తాను పుట్టింది 1985లో పుట్టలేదని 1994లో పుట్టానని చెప్పింది. తన వయసు 30 ఏళ్లేనని జ్యోతిరాయ్ చెప్పారు. దానికి ప్రూఫ్‌గా తన పాన్‌కార్డ్ చూపించింది. అందులో 1994 జూలై 4 అని ఉంది. అలాగే జ్యోతిరాయ్‌కి మానవత్వం కూడా ఎక్కువే. కొద్దిరోజుల క్రితం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు ఆర్ధిక సాయం చేసి శెభాష్ అనిపించుకుంది.

సీరియల్స్‌లో చీరలో హోమ్లీగా కనిపించి ఆకట్టుకున్న జ్యోతి రాయ్ రియల్ లైఫ్‌లో మాత్రం దానికి పూర్తి భిన్నంగా హల్‌చల్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్‌లతో అందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తుంది. తాజాగా చీరలో నాభి, నడుము అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం జ్యోతిరాయ్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: jagathi madam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X